Movies

‘బాలీవుడ్​ మాఫీయా అంటే వాళ్లే’.. పేర్లు చెప్పేసిన తనుశ్రీ దత్తా

‘బాలీవుడ్​ మాఫీయా అంటే వాళ్లే’.. పేర్లు చెప్పేసిన తనుశ్రీ దత్తా

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ఇన్‌స్టా వేదికగా మరో సంచలన పోస్ట్​ పెట్టారు. బాలీవుడ్‌ మాఫియా తనని వేధిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన ఆమె.. ఇప్పుడు ఆ వ్యక్తలు ఎవరో చెప్పేసింది. ఇంతకీ ఆమె చేసిన సంచలన కామెంట్స్​ ఏంటంటే? తనుశ్రీ దత్తా తాజాగా చేసిన షేర్​ చేసిన పోస్టులో ఆమెను ఎవరు వేధిస్తున్నారో చెప్పేశారు. ప్రధానంగా నానా పటేకర్​ పేరును ప్రస్తావించారు.తనకు ఏమైనా జరిగితే.. నానా పటేకరే బాధ్యులు అని షాకింగ్​ కామెంట్​ చేశారు తను శ్రీ. నాకు ఏదైనా జరిగితే.. నానా పటేకర్, ఆయన​ లాయర్.. బాలీవుడ్​లో వారి స్నేహితుల మాఫియానే కారణం’ అని పేర్కొన్నారు తను శ్రీ.’సుషాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బయటకి వచ్చిన పేర్లే బాలీవుడ్ మాఫియాలో ఉన్నాయి. వీరందరికీ ఒకే లాయర్ కామన్​గా ఉంటాడు.’వాళ్ల కేసులన్నీ ఆయనే డీల్ చేస్తుంటాడు. వారి సినిమాలు చూడకండి. ఇండస్ర్టీ నుంచి వారిని బహిష్కరించండి. కొంత మంది పరిశ్రమ వ్యక్తులు, పీఆర్ టీమ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు’ అని తన ఇన్​ స్టా పోస్ట్​లో వివరించారు.’మళ్లీ కలుద్దాం’ అనే మాటను పోస్ట్​ చివరలో జోడించారు తను శ్రీ.అయితే మరో సంచలన పోస్ట్​తో తను శ్రీ దత్తా ముందుకు రావొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.ఇప్పుడు నానా పటేకర్​ పేరును బయట పెట్టినట్లు.. ఇంకా ఎవరి పేర్లను ఆమె చెప్పనున్నారనేది చర్చనీయాంశంగా మారింది.