DailyDose

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగి రాసలీలలు – TNI నేటి తాజా వార్తలు

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగి వెంకటేష్ రాసలీలలు  – TNI  నేటి  తాజా వార్తలు

*నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన చలం వెంకటేష్ అనే యువకుడు తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయం లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు …ఇతనికి కొంత కాలం క్రితం సుమ చందు అనే అమ్మాయి తో వివాహం జరిగింది,వివాహ సమయంలో సుమ తల్లి, తండ్రులు వెంకటేష్ కు భారీ మొత్తంలో కట్నంగా నగదు,బంగారు ముట్టాజెప్పారు,,కొన్ని రోజులకే వెంకటేష్ ప్రవర్తన లో మార్పు రావడం తో అనుమానం కలిగిన సుమ భర్త పై నిఘా పెట్టగా వెంకటేష్ ఇంకో అమ్మాయి తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకుని 15 రోజుల క్రితం నెల్లూరు నగరంలోని ఒక ప్రైవేటు హోటల్ లో వెంకటేష్ తో పాటు అతని ప్రియురాలు వుందని తెలుసుకున్న సుమ పోలీసులకు సమాచారం ఇచ్చి తన బంధువులతో సహా హోటల్ కి వెళ్ళి వెంకటేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పాగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు..ఇదే అలుసు గా తీసుకుని వెంకటేష్ మరోసారి తన వక్ర బుద్ది చూపించాడు,ప్రియురాలిని తీసుకుని తన అమ్మమ్మ ఊరు అయిన కొడవలూరు తీసుకెళ్ళి అక్కడే ప్రియు రాలిని వివాహం చేసుకున్నట్టు సమాచారం రావడంతో మొదటి భార్య సుమ కొడవలూరు వెళ్ళగా అక్కడ వెంకటేష్ అమ్మమ్మ బంధువులు సుమ పై దాడి చేసి తరిమి వేసి నట్టు తనకు జరిగిన అన్యాయం గుర్తించి తనకు న్యాయం జరిగేలా చూడాలని హరిత పోలీసులను అధికారులను వేడుకుంటుంది…

* మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే మండిప‌డ్డారు. మ‌రాఠీల‌ను అవ‌మానిస్తూ గ‌వ‌ర్న‌ర్ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌దవిలో ఉన్న వారిని తాను అవమానించాల‌ని కోరుకోవ‌డం లేద‌ని..ఆ ప‌ద‌వికి తాను గౌర‌వ‌మిస్తాన‌ని అయితే భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ మ‌రాఠీల‌ను అవ‌మానించ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం పెల్లుబుకుతోంద‌ని ఠాక్రే పేర్కొన్నారు.
రాష్ట్ర‌ప‌తి సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ చేర‌వేస్తార‌ని, అలాంటి గ‌వ‌ర్న‌ర్ త‌ప్పు చేస్తే ఆయ‌న‌పై ఎవ‌రు చ‌ర్య తీసుకోవాల‌ని ప్ర‌శ్నించారు.

*ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… దశాబద్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధితుల ను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. బాధితులను సమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొంతమేరకు సాయం కొనసాగుతోందన్నారు. దాతలు వారి పేరుతోగానీ.. టీడీపీ ద్వారా గానీ సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

*కడపలో బార్ల కోసం వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య నువ్వా -నేనా అన్న స్థాయిలో వేలం పాట జరుగుతోంది. బార్ల లైసెన్స్‌ కోసం వేలం పాట రూ. కోటి దాటింది. కడపలో ఒక బార్‌ లైసెన్స్‌కు రూ. కోటి 71 లక్షలకు వైపీసీ నేత వేలం పాట పాడారు. కడపలో మిగతా బార్లకు 90 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతిలో అత్యధికంగా రూ. కోటి 59 లక్షలు ధర పలికింది. ప్రొద్దుటూరులో రూ. కోటి 31 లక్షలు, అనంతపురంలో రూ. కోటి 05 లక్షలకు వేలం పాట పలికింది. రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల బార్లకు ఈ వేలం కొనసాగుతోంది.

*నాజీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ ధ‌రించిన ఓ వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్‌ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయిన‌ట్లు తెలిపారు. హ్యూబ‌ర్ కంపెనీ వాచీని హిట్ల‌ర్‌కు పుట్టిన రోజు కానుక‌గా ఇచ్చి ఉంటార‌ని భావిస్తున్నారు. ఆ వాచ్‌పై స్వ‌స్తికాతో పాటు ఏహెచ్ గుర్తులు ఉన్నాయి. మేరీల్యాండ్‌లోని అలెగ్జాండ‌ర్ హిస్టారిక‌ల్ ఆక్ష‌న్ హౌజ్‌లో వేలం జ‌రిగింది. ఈ వేలాన్ని యూద నేత‌లు ఖండించారు. 1933లో ఈ వాచ్‌ను హిట్ల‌ర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఆ ఏడాదే ఆయ‌న జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1945లో బెర్‌గాఫ్‌లో ఉన్న హిట్ల‌ర్ ఇంటిని అటాక్ చేసిన స‌మ‌యంలో అక్క‌డ ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచ్‌ చిక్కింది.

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌ ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని ప్రారంభించారు. అగనంపూడిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి అక్కడి రోగులతో మాట్లాడి దవాఖానలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అందిస్తున్న సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలోని అగనంపూడి ఏరియా దవాఖానను కూడా మంత్రి సందర్శించారు. అక్కడ గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బందితో మంత్రి ముచ్చటించారు.

*షాద్నగర్ టోల్ప్లాజా దగ్గర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాయికల్ టోల్ప్లాజా వద్ద రూట్ వాచ్లో వ్యక్తి దగ్గర డ్రగ్స్‌ను గుర్తించారు. నిందితుడి నుంచి 3 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఈసీఎస్‌టీఏఎస్‌వై, 5.491 గ్రాముల ఎమ్‌డీఎంఏ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అమీర్పేటకు చెందిన శబరీష్గా గుర్తించారు. శబరీష్‌ను అరెస్ట్ చేయగా… లోకేష్ అనే మరో నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరీష్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆపై రిమాండ్కు తరలించారు.

*రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసు లో ఏడుగురికి ఈడీ జారీ చేసింది. చీకోటి ప్రవీణ్‌ మాధవరెడ్డి సంపత్‌ సహా హవాలా ఏజెంట్లకు నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ప్రవీణ్‌, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ గుర్తించింది. రాజకీయనేతలు, అధికారులకు ప్రవీణ్‌, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ అయ్యాయి. ఏడాది వ్యవధిలో 4 క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్టు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహణ, హవాలా ద్వారా నగదు బదిలీ అయినట్లు తెలుస్తోంది. అలాగే బేగంబజార్‌, జూబ్లీహిల్స్‌కు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల ద్వారా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు.

* గుజ‌రాతీలు, రాజ‌స్ధానీల‌ను ముంబై, థానేల నుంచి వెళ్ల‌గొడితే మ‌హారాష్ట్ర‌కు డ‌బ్బులుండ‌వ‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఆర్ధిక రాజ‌ధానిగా పేరొందిన ముంబై ఆ పేరును నిల‌బెట్టుకోలేద‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించిన శివ‌సేన మ‌రాఠాల‌ను అవ‌మానించిన కోశ్యారి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

*జిల్లా న్యాయ స్థానాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా న్యాయ ఉద్య‌మాన్ని చేప‌ట్ట‌డంలో జిల్లా కోర్టులు చోద‌కాలుగా ప‌నిచేస్తాయ‌న్నారు. చాలా వ‌ర‌కు కేసుల్లో జిల్లా జుడిషియ‌ల్ అధికారులే కాంటాక్ట్‌లోకి వ‌స్తార‌ని, జిల్లా న్యాయ‌స్థానాల వ‌ద్ద త‌మ‌కు క‌లిగిన అనుభ‌వాల ద్వారానే న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో ప్ర‌జాభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీలో జ‌రిగిన న‌ల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీస్ స‌మావేశంలో ఎన్వీ ర‌మ‌ణ ఈ వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం ఇప్పుడు అత్యంత అవ‌స‌ర‌మ‌ని, దేశంలో న్యాయ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో జిల్లా న్యాయ‌స్థానాలు కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేద‌న్నారు.

*క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులైన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డికి ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. తాజాగా విమానాల ఆపరేటర్‌ సంపత్‌తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లకు నోటీలు ఇష్యూ చేసింది.

*ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ స‌ర్కార్ మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి ఆ విధానం అమ‌లు అవుతుంద‌ని డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో నాటు సారా విషాదాల‌ను సహించ‌బోమ‌ని, అందుకే కొత్త లిక్క‌ర్ విధానం బ‌దులుగా, మ‌ద్యాన్ని పాత ప‌ద్ధ‌తిలోనే అమ్మ‌నున్న‌ట్లు సిసోడియా తెలిపారు. కొత్త విధానాన్ని స‌మ‌ర్ధించిన సిసోడియా.. అవినీతిని అడ్డుకునేందుకు ఆ విధానాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఎక్సైజ్ పాల‌సీ గ‌డువు ముగుస్తున్న త‌రుణంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇటీవ‌ల గుజ‌రాత్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 42 మంది మ‌ర‌ణించారు. అయితే అలాంటి సంఘ‌ట‌న‌లు ఢిల్లీలో జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని సిసోడియా స్ప‌ష్టం చేశారు. లీగ‌ల్‌గా మ‌ద్యాన్ని అమ్మ‌డం నిలిపివేస్తే, అప్పుడు గుజ‌రాత్ లాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న అన్నారు. *గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్‌ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్‌ వైద్యులు.మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.

* మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా విభాగం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో రావూరి జంక్షన్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతల వెంకటరమణ మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి రాక ముందు దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. అంటే జగన్ చెప్పిన మద్యపాన నిషేధం ఇంకా అమలు కానేట్టేనా అని ప్రశ్నించారు. ‘‘నువ్వు చెప్పిన మద్యపాన నిషేదం ఎప్పుడు చేస్తావ్ జగన్ రెడ్డి’’ అంటూ నినాదాలు చేశారు.

* తిరువూరు మండలం ఎరుకుపాడుకు చెందిన చింతల నాగేంద్రబాబుకు మతిస్తిమితం సరిగా లేదు. తల్లి మంగమ్మతో గొడవపడిన అతను.. పారతో కొట్టి, గొంతు నులిమి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరూవురు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

*ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర రూ. కోటీ 59 లక్షల రూపాయలు పలికింది. వేలంలో కడప, తిరుపతి అధికార పార్టీ నేతలు పోటాపోటీగా పాల్గొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బార్లకు ఈరోజు ఈ ఆక్షన్‌, మిగతా బార్లకు కూడా రూ.95 లక్షల్లో 90 శాతం వెచ్చించాల్సిందే. అనంతపురంలో కూడా పోటీ పెరగనుంది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు రాజీ చేస్తున్నారు. అనేక నగరాల్లో ఎమ్మెల్యేలు, అధికార పక్ష నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపారు. తిరుపతి బార్లు వేలం దగ్గర వైసీపీ నేతల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ పెరిగింది. అధికార పార్టీ నేతల బెదిరింపులతో రాష్ట్రంలో మద్యం షాపులకు దరఖాస్తులు తగ్గాయి.

*‘దేశంలో మోడీ మార్క్ అభివృద్ధి, సంక్షేమం.. ఏపీలో జగన్ మార్క్ అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తా’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్యకుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడా రు. ‘‘వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోం ది. కేంద్రంపై విమర్శలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో పెరిగిన అప్పులపై సమాధానం చెప్పలేని పరిస్థితి లో ఉంది. దేశాభివృద్ధిలో భాగంగా కేంద్రం అప్పులు చేసింది.

*ఏపీలో ఇక డ్రెడ్జింగ్ కార్యకలాపాల శిక్షణ, మరమ్మతుల సౌకర్య కేంద్రం ఏర్పాటు లేనట్లేనని లోక్సభకు కేంద్రం ఇచ్చి న సమాధానం ద్వారా వెల్లడైంది. ఈ కేంద్రం ఏర్పాటుకు 2016లో ఆంధ్రప్రదేశ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ(డీసీఐ) మధ్య జరిగిన ఒప్పందం గడువు ముగిసిందని రాష్ట్ర ప్రభుత్వమే తమకు సమాచారం ఇచ్చిందని, ప్రస్తుతం కేంద్రం ఏర్పాటుకు క్రియాశీలక ప్రతిపాదనలేమీ లేవని కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. లోక్సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

* లోన్ రికవరీ కోసమంటూ తాజా మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు ఓ ఏజెంటు ఫోన్ యడం కలకలం సృష్టించింది. లోన్ రికవరీ ఏజెంట్ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఇలాంటి ఫోన్ కాల్ అందుకున్న 24 గంటల్లోపే అదే జిల్లాకు చెందిన అనిల్కుమార్ యాదవ్కు కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు అనిల్ ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాకింగ్లకు లోను రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది.

*పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసిన 2018 నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1కు ఎంపికయిన 30 మందిని రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్లుగా నియమించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీఓ-558) జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ సీర్వసులో కేటగిరీ 2లో తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

*శ్రీకాకుళం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కాకినాడకు చెందిన రాజేశ్ మహాసేనపై నమోదైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. తమను అడ్డుకొనేందుకు ఎలాంటి చట్టంలేదనే భావనతో ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. విధి నిర్వహణలో పోలీసులు కొన్నిసార్లు తమపరిధి దాటి వ్యవహరిస్తున్నారని కోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య శుక్రవారం వ్యాఖ్యానించారు.

*ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో జూలై 31న మహిళా డాక్టర్ల కోసం మొట్టమొదటి రాష్ట్రస్థాయి నిరంతర వైద్య విద్య సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ స్టేట్ చైర్పర్సన్ డాక్టర్ సీ. పద్మావతి దేవి తెలిపారు. శుక్రవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ కేజీవీ సరిత, గౌరవ అఽతిథులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ జీ. నందకిషోర్, జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొంటారని ఆమె వెల్లడించారు. ఇటీవల కాలంలో వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక వైద్య విధానాలపై డాక్టర్ ఉషా శ్రీరామ్, డాక్టర్ రజిత, డాక్టర్ ప్రీతి శుక్లా, డాక్టర్ యామిని కన్నప్పన్, డాక్టర్ ఆళ్ల ప్రశాంతి, డాక్టర్ రాధికారాణి తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కార్డియాలజిస్ట్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత, సెక్రటరీ డాక్టర్ పీవీ దుర్గారాణి , డాక్టర్ ఆళ్ల ప్రశాంతి పాల్గొన్నారు.

*‘గోదావారి నదీ పరీవాహక ప్రాంతంలో 1986లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని భద్రాచలానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు 2002లో మీరు నిర్మించిన కరకట్టే నేడు మహోగ్ర వరదల సమయంలో మాకు శ్రీరామరక్షగా నిలిచింది’ అంటూ భద్రాద్రి వాసులు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి వద్ద కరకట్టను పరిశీలించారు. ఈ సమయంలోనే స్థానికులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో యటపాక నుంచి సుభా్షనగర్ కాలనీ వరకు నిర్మించిన కరకట్ట వల్ల జలప్రళయాన్ని సైతం తట్టుకోగలగడం సాధ్యమైందని చంద్రబాబుతో అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు, ఇరవై ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు నేటికీ గుర్తుపెట్టుకొని అభినందించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. 1986లో వరదలు వచ్చిన సమయంలో అప్పటి సీఎం ఎన్టీ రామారావు హయాంలో, తాను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ ప్రాంతంలో పర్యటించి గోదావరి వరద సమస్యను స్వయంగా పరిశీలించాని గుర్తుచేసుకున్నారు.

*‘తెలుగుదనానికి నిలువెత్తు సంతకం సినారె’ అంటూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. వివిధ పదవులకు వన్నెతెచ్చిన బహుముఖప్రజ్ఞాశాలి సి.నారాయణరెడ్డి అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. అందుకే, ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా, రాజ్యసభ నిర్వహణ బాధ్యతలను ఉపసభాపతికి అప్పగించి మరీ తాను ఈ సభకు హాజరైనట్లు వెల్లడించారు. వాజపేయి కవిహృదయాన్ని, సినారె మనసును తాను దగ్గర నుంచి చూసినట్లు పేర్కొన్నారు. సహ రాజ్యసభ సభ్యుడిగా సినారేతో తనకున్న ఆత్మీయానుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సి.నారాయణ రెడ్డి 91వ జయంతి సభ శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది.

*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆగస్టు 5న జరగనున్న యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవంలో భాగంగా ఆయనకు ఈ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొ.రవీందర్ మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి తెలుగువారు కావడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. కాగా, విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి జస్టిస్ ఎన్వీ రమణతోపాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వర్సిటీ వర్గాలు ప్రకటించాయి.

*హిమాచల్ప్రదేశ్ సోలన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ధాటికి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బద్ది సమీపంలోని ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ వాహనం మీద ముగ్గురు చిక్కుకుపోయారు. ట్రాక్టర్తో పాటు నదిలో వారు కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్లాక వాహనం మీద నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు వరదల ధాటికి రెండు ఇళ్ల మీద కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పుడే అటువైపుగా బైక్పై వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్.. పిథౌరాగఢ్లోని ధార్చులాలో జరిగింది.