Politics

ఖమ్మం తెరాసలో కలకలం – TNI నేటి రాజకీయ వార్తలు

ఖమ్మం తెరాసలో కలకలం –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* రంగు మారుతున్న రాజకీయం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలు తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు…ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. టీఆర్ఎస్ కార్యకర్తలు రెడీగా ఉండాలి-తుమ్మల నాగేశ్వరరావు

*ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా?:బొత్స
రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలన్నింటినీ ప్రజాభిప్రాయంతో అమలు చేయాలంటే కుదరదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నందున పాఠశాలల విలీన ప్రక్రియలో వారి అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పారు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని.. ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకునే తల్లిదండ్రులు ఇంటి పక్కనే పాఠశాల ఉండాలని కోరుకోకూడదన్నారు.రాష్ట్రంలో పాఠశాలల విలీనం జరగలేదని.. కేవలం తరగతుల విలీనం మాత్రమే జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామే తప్ప ఇతర కారణాలు ఉండవన్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నివేదిక ఇవ్వగానే దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స వెల్లడించారు.

*రేవంత్ మమ్మల్ని తిట్టడం మానేసి కేసీఆర్ తో కొట్లాడు:ఈటల
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది భాజపాలో చేరగానే రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులో మోహరిస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో ఆడిన నాటకాలు ఇక్కడ సాగనివ్వమని హెచ్చరించారు. రాజగోపాల్ రాజీనామా చేస్తానంటే మునుగోడు ప్రజలు సంబరపడుతున్నారని.. ఉపఎన్నిక వస్తే సమస్యలు తీరుతాయని భావిస్తున్నారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈటల మాట్లాడుతూ.. ”మునుగోడు ఉపఎన్నిక వ్యక్తుల మధ్య ఉండదు. సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. పార్టీలు వేరైనా మాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో అన్యాయంపై పోరాడిన వ్యక్తి. రేవంత్‌రెడ్డి తన బ్లాక్‌మెయిల్‌ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కౌశిక్‌ రెడ్డి లాంటి వాళ్లతో మాట్లాడే స్థాయి కాదు నాది. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించగానే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో చులకన అవుతారు. మమ్మల్ని తిట్టడం మానేసి కేసీఆర్‌తో కొట్లాడాలి. ప్రధాని మోదీ పరిపాలన చూసి ఇతర పార్టీల నేతలు భాజపాలోకి వస్తున్నారు” అని ఈటల అన్నారు.

* జగన్రెడ్డితో శత్రుత్వం మొదలైంది: కేఏ పాల్ఏ
పీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో శత్రుత్వం మొదలైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశాననే పోలీసులు తనను ఇబ్బంది పెట్టారన్నారు. విద్యార్థులు తనను సీఎం అని నినాదాలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారని, ఎంఆర్‌పల్లి సీఐ సురేందర్రెడ్డి దురుసుగా వ్యవహరించారన్నారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో సీఎం జగన్ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. జగన్ అక్రమాస్తుల విషయంలో.. సీబీఐ డైరెక్టర్తో మాట్లాడానని కేఏ పాల్ అన్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేఏ పాల్ అన్నారు. కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. రాజగోపాల్ ఎప్పటి నుంచో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పూర్తిగా పతనమైన పార్టీ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను గెలిపిస్తానన్నారు. బీజేపీలో చేరితే రాజగోపాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే 60 శాతం ఓట్లు రాజగోపాల్కే పడతాయని కేఏ పాల్ అన్నారు.

* తెలంగాణలో రాజకీయ కాక.. మూడు పార్టీలకూ మునుగోడు సవాల్‌
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక మూడు పార్టీలకూ మునుగోడు సవాల్గా మారనుంది. ఉపఎన్నికలో గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఈ ఎన్నికలో తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది. కాంగ్రెస్‌ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న ఈ పోరును ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. భాజపా అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగనుండగా తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఇక్కడ విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయశక్తిగా మారాలని భాజపా భావిస్తుండగా… గత ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలని తెరాస పట్టుదలగా ఉంది. క్షేత్రస్థాయి బలంతో స్థానాన్ని నిలబెట్టుకోగలమని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. గత కొన్ని నెలలుగా మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమనే సంకేతాలు వెలువడడంతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

* మద్యం బ్రాండ్లపై, డిస్టలరీలపై చర్చకు సిద్దమా?: విష్ణువర్ధన్రెడ్డి
హంద్రీనీవా , గాలేరు , నగరి వంటి రాయలసీమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరం పైనే దృష్టి కేంద్రీకరించి, చర్చలకు తావిస్తున్నారని.. కానీ ఒక్క పైసా రాష్ట్ర నిధులు పోలవరానికి కేటాయించడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం మైనింగ్, ల్యాండ్, ఇసుక, లిక్కర్‌లపై ఆధారపడి అవినీతికి గేట్లు తెరిచిందని, మద్యం బ్రాండ్లపై, డిస్టల్లరీలపై చర్చకు సిద్దమా? అంటూ విష్ణువర్ధన్రెడ్డి సవాల్ చేశారు.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలకు పేదలు వెళ్ళాలంటే జగన్ తిరిగే హెలికాఫ్టర్‌లలో వెళ్ళాలని విష్ణువర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులకు హామీలపై మతిమరుపు వచ్చిందన్నారు. మద్యపాన నిషేధం గురించి ఒక్కసారి వైసీపీ వెబ్ సైట్ చూస్తే.. అందులో ఉందని అన్నారు. కానీ రాష్ట్ర మంత్రి అమర్ నాధ్ మద్యపాన నిషేదం తమ మేనిఫెస్టోలో లేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఆదాయ మార్గాలు పెరగలేదు కానీ , ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఆదాయం మాత్రం భారీగా పెరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ పోరాడుతుందని విష్ణువర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.

* తప్పు ఎవరిదో సీఎం జగన్‌, మంత్రి అంబటి చెప్పాలి?: ఉండవల్లి
పోలవరం పై టీడీపీ , వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్ , మంత్రి అంబటి చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్‌ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని, పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. తాను బతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని, అసలు పోలవరం డ్యామ్ కట్టలేదు.. డ్యామ్ కట్టకుండానే భద్రాచలం మునిగిపోయిందంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిపై ప్రధాని మోదీ ఈడీ పేరుతో భయపెడుతున్నారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. లోక్ సత్తా అధినేత జయవ్రకాశ్ నారాయణ క్యాప్టిలిజమ్ వల్ల దేశానికి మంచి జరుగుతుందనే వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. క్యాప్టిలిజమ్‌పై జయప్రకాశ్ నారాయణతో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఉండవల్లి అన్నారు.

* తప్పు ఎవరిదో సీఎం జగన్‌, మంత్రి అంబటి చెప్పాలి?: ఉండవల్లి
పోలవరం పై టీడీపీ , వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్, మంత్రి అంబటి చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్‌ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని, పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

* ప్రతీ చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదు : ఏపీ మంత్రి బొత్స
ప్రభుత్వాలు చేసే ప్రతి చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏపీలో పాఠశాలల విలీన ప్రక్రియలో శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పాఠశాలల విలీనం జరగలేదని, తరగతుల విలీనమే జరిగిందని పేర్కొన్నారు.పేద పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని వివరించారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామని వెల్లడించారు. భేషజాలకు పోకుండా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.పాఠశాలల విలీనంపై సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

* ప్రతీ చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదు : ఏపీ మంత్రి బొత్స
ప్రభుత్వాలు చేసే ప్రతి చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏపీలో పాఠశాలల విలీన ప్రక్రియలో శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పాఠశాలల విలీనం జరగలేదని, తరగతుల విలీనమే జరిగిందని పేర్కొన్నారు.పేద పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని వివరించారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామని వెల్లడించారు. భేషజాలకు పోకుండా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.పాఠశాలల విలీనంపై సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

*నేను వైసీపీలో శాశ్వతమా?: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రభుత్వం పై ఆయన సెటైర్లు వేశారు. పెన్షన్ తీసుకునే సామాన్యుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టగలడా? అని ప్రశ్నించారు. పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు? అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలో శాశ్వతమా?.. రేపన్న రోజు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వ్యాఖ్యలు చేశారు.

*విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: లోకేష్
జగన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతొందన్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో జే గ్యాంగ్‌ క‌బ్జాలు, దౌర్జ‌న్యాలు, ప్ర‌మాదాలు, విష‌ర‌సాయ‌నాల లీకుల‌తో ప్ర‌జ‌లు తమ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌తుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలీమ‌ర్స్ మ‌ర‌ణ‌మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మ‌రువ‌క‌ముందే, అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్ కంపెనీలో రెండోసారి విష‌వాయువులు లీకై వంద‌ల‌మంది మ‌హిళ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గురి కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించిందన్నారు. ఉపాధి కోసం వ‌చ్చిన మ‌హిళల‌ ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేదు… క‌మీష‌న్లు నెల‌నెలా అందితే చాల‌న్న‌ట్టుంది వైసీపీ పాలన ఉందని మండిపడ్డారు. చ‌నిపోయాక ప‌రిహారం ఇవ్వ‌డం కాదు సీఎం గారూ! వాళ్లు బ‌తికేలా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోండని ఆయన సూచించారు.

*ఆ మహిళలకు వేగంగా వైద్యం అందించాలి: సోమువీర్రాజు
అనకాపల్లి బ్రాండిక్స్‌లో రసాయన వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రెండు మాసాల వ్యవధిలో రెండు పర్యాయాలు రసాయనాలు లీక్ అయ్యాయన్నారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పరిశ్రమల పై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా? అని ప్రశ్నించారు. కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోమువీర్రాజు విసుర్లు విసిరారు. స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన విడుదల చేశారు.

*ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం జాప్యం: దేవినేని
జగన్‌ ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, రివర్స్‌ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలన్నారు

*మద్యపానంపై మడమ తిప్పారు: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చడమే సీఎం జగన్‌ ధ్యేయంలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నారనడానికి వైసీపీ నేతలు పోటీపడి దక్కించుకున్న బార్ల లైసెన్సులే నిదర్శనమన్నారు

*నన్ను ప్రధానిని చేస్తే దేశాన్ని బాగుచేస్తా: కేఏ పాల్‌
దేశంలో అవినీతి పేరుకుపోయిందని, తనను ప్రధానికి చేస్తే దేశాన్ని బాగుచేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ‘జగన్‌ పోవాలి.. పాల్‌ రావాలి’ నినాదంతో పాల్‌ చేపట్టిన యాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు చేరింది. దేశాన్ని రక్షించుకోకపోతే, రాష్ట్రాన్ని కూడా రక్షించుకోలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగాఆరు నెలల్లో ఏపీ మరో శ్రీలంకగా మారబోతున్నదన్నారు. జగన్‌ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదని, కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగటంలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తాను తెలంగాణ నుంచి పోటీచేసి ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు.