DailyDose

అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు – TNI నేటి నేర వార్తలు

అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు   – TNI   నేటి నేర వార్తలు

* టెలీ మార్కెటింగ్ స్కామ్‌లో నిధుల అక్రమ తరలింపునకు పాల్పడని ఓ భారత సంతతి వ్యక్తికి అమెరికాలో మూడేళ్ల జైలు శిక్ష పడింది. తాను తప్పు చేసినట్టు హిరేన్. పి. చౌదని అంగీకరించడంతో శిక్ష ఖరారైంది. సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సాగుతున్న ఓ టెలీ మార్కెటింగ్ స్కామ్‌లో హిరేన్ కీలకంగా వ్యవహరించారని నార్తర్న్ ఇలినాయ్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ గురువారం పేర్కొన్నారు. వివరాలు.. గత రెండేళ్లుగా సాగిన ఓ స్కామ్‌లో అనేక మంది సీనియర్ సిటిజన్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల పేరుతో నిందితులు వృద్ధులకు ఫోన్ చేసి..వారి గుర్తింపు సంఖ్య వంటి కీలక వివరాలు బయటకుపొక్కాయని భయభ్రాంతులకు గురి చేసేశారు. ఆ తరువాత.. తమకు డబ్బు పంపిస్తే అంతా సరైపోతుందంటూ నమ్మబలికేవారు. మోసం జరుగుతున్న విషయాన్ని గుర్తించలేక అనేక మంది నిందితులు కొరిన మొత్తాన్ని వారు సూచించిన అకౌంట్లకు బదిలీ చేసేవారు. అయితే.. నకిలీ గుర్తింపు కార్డులతో హిరేన్ తెరిచిన అకౌంట్లలోకి కొన్ని నిధులు వచ్చేవని అటార్నీ జనరల్ తెలిపారు. పదవీ విరమణ పొందిన నర్సు ఒకరు ఇలా 9 లక్షల డాలర్లను కోల్పోయారని చెప్పారు. హిరేన్ ఏర్పాటు చేసిన అకౌంట్లతో పాటూ అతడికి తెలిసిన వారి అకౌంట్లలోకి కూడా ఈ మొత్తం డిపాజిట్ అయిందని తెలిపారు.

* విద్యార్థినులకు తండ్రి స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే లెక్క తప్పాడు. పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు. 9, 10 తరగతులకు గణితం బోధిస్తారు. పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థినులతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తాకరాని ప్రదేశాల్లో చేతులు వేస్తున్నారు. రోజూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హెచ్‌ఎం సుధారాణికి ఫిర్యాదు చేసి ఘటనపై నిలదీశారు. హెచ్‌ఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఉడాయించటంతో దీనిపై తల్లిదండ్రులు ఉయ్యూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడుపై అసభ్యకర ప్రవర్తన, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.హెచ్‌ఎం పైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. ఎంఈఓ కనకమహాలక్ష్మి, రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈఓ కనకమహాలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయుడు సాయి బాబును సస్పెండ్‌ చేస్తూ డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

* చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఇంటిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా..ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు కుప్పం వాసులుగా గుర్తించారు.

* ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో జడ రామాంజమ్మ (33), పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (54), ఆలకుంట చిన్న రాములు (60) గేదెలను మేపుకోవటానికి ప్రతిరోజు మాదిరిగానే సమీపంలోని పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగివస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పొలాల్లోని గట్లపై ఉన్న సమయంలో భారీ పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురూ మృతిచెందారు. అలాగే పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని మతుకుమల్లిలో శివాది అంజయ్య (60) పశువులను మేపడానికి పొలానికి వెళ్లి భారీ వర్షంలో ఇంటికి తిరిగి వస్తూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

* కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నియోజకవర్గ భాజపా ఇంఛార్జ్ కృష్ణబాబు కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108లో గుడివాడ ఆసుపత్రికి తరలించారు. ఆటో ఢీకొనడంతో కారు కాలువలోకి వెళ్లింది. ప్రమాద సమయంలో కారులో కృష్ణ బాబు దంపతులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీకైంది. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 100 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స (First Aid) అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిఫ్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4వేల మంది కార్మికులు పని చేస్తుండగా వారిలో దాదాపు 100 అస్వస్థతకు గురయ్యారు.

* కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ ని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. వాహనం లో 12 మంది ప్రయాణికులు ఉండగా, సంఘటన స్థలంలో ఒకరు మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలుకాగా ఐదుగురు పరిస్టితి విషమంగా ఉంది. ఎక్కువ మంది చిన్నారులకు ఎముకలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి 108 లో తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం కాకినాడ, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. విజయనగరం జిల్లా అగ్రహారం నుంచి రామచంద్రపురం శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాల పాలైన వారిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారు ఉన్నారు. రెండు వాహనాల్లో వెళ్తుండగా ఒక వాహనం ప్రమాదానికి గురయింది.

* హైదరాబాద్‌: నగరంలోని ఎన్‌ఎండీసీ వద్ద పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం వైపు వెళ్తున్న కూరగాయల లారీ అదుపుతప్పి ఎన్‌ఎండీసీ సమీపంలో బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో మెహదీపట్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌ వైపునుంచి వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో లారీని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

* హైదరాబాద్‌: నగరంలోని మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఆపిన ఎస్‌ఐ.. వారిని ప్రశ్నించారు. అయితే వారిలో ఓ వ్యక్తి తనవద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ కడుపులో పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.

*తుని రూరల్ వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మ్యాజిక్ ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు విజయనగరం జిల్లా, దీనికల పట్టి నుంచి రామచంద్రపురంలో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*హైదరాబాద్‌ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. నిరూస్‌ సర్కిల్‌ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని ముజీబ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముజీబ్‌ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

*శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువతిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తాలియాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*హైదరాబాద్‌: నగరంలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం చోటుచేసుకుంది. మాదాపూర్‌లో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని ముజీబ్‌ కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకరికి గాయాలయ్యాయి. స్థిరాస్తి గొడవల వల్లే కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఇస్మాయిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*మాదాపూర్‌ లో దారుణం చోటు చేసుకుంది. నీరూస్ సిగ్నల్ వద్ద రౌడీ షీటర్‌ ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌ లో మరో రౌడీషీటర్ ముజ్జు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా.. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ముజ్జుకు మధ్య మాటా మాటా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజ్జు ఆరు రౌండ్‌లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ అక్కడిక్కడే మరణించాడు. డీసీపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా.. ముజ్జు, ఇస్మాయిల్ ఇద్దరూ స్నేహితులేనని తెలుస్తోంది. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడింది. అరే మైసమ్మ టెంపుల్ సమీపంలో ముజ్జు నివాసముంటున్నాడు. అయితే ఇదో గ్యాంగ్ వార్‌ గా తెలుస్తోంది. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెటిల్మెంట్‌ల కోసం ముఠాగా ఏర్పడినట్టు సమాచారం. అయితే డబ్బు పంపకం లో తేడాతో ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని తెలుస్తోంది. ఎక్కడో చంపేసి నీరూస్ వద్ద శవాన్ని పడేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

*శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు నాగార్జున(37) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు…. నాగార్జున కూలిమగ్గం నేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. ముడిపట్టు ధరలు విపరీతంగా పెరగడం, నేసినవాటికి గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రూ.4లక్షలదాకా అప్పులు చేశాడు.

*పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం సతివాడ పంచాయతీలోని కొత్తగూడ గ్రామంలో బత్తిలి ఎస్‌ఐ సీతారాములుపై ఆదివారం సారా విక్రయదారులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో కానిస్టేబుల్‌ నవీన్‌కుమార్‌తో కలిసి ఎస్‌ఐ సీతారాములు సాయంత్రం మఫ్టీలో గ్రామానికి చేరుకున్నారు. సారా తయారీ, విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. విక్రయదారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా వారు కర్రలతో తిరగబడ్డారు. ఎస్‌ఐతోపాటు కానిస్టేబుల్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.

*ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. నేరడిగొండ మండలం కుమారికి చెందిన రైతు బిక్క బక్కన్న(65) తన పొలంలో గట్ల వెంట కొమ్మలు కొడుతుండగా విద్యుత్‌ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గాజిలి గ్రామానికి చెందిన రైతు పెందుర్‌ వెంకటి (39) తనకున్న ఏడు ఎకరాల్లో పత్తి, సోయా పంటలు వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.5లక్షల అప్పులు తీర్చే దారి కానరాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటి.. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

* సికింద్రాబాద్: నగరంలోని మారేడుపల్లి ఎస్ఐపై దుండగులు బ్లేడ్తో దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఎస్ఐని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితులు యాప్రాల్కు చెందిన టమాటా పవన్, సంజయ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

* సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం పుల్లారెడ్డి కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న వ్యక్తిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం పుల్లారెడ్డి కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న వ్యక్తిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* మేడ్చల్‌లో ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని వివేకానంద సెంటర్‌లో ఉన్న ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు.. చోరీకి యత్నించారు. అయితే పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు అటుగా రావడంతో అక్కడినుంచి పరారయ్యారు. గుర్తించిన పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.