DailyDose

ట్రై కలర్స్ కంపెనీపై ఐటి దాడులు – TNI నేటి తాజా వార్తలు

ట్రై కలర్స్ కంపెనీపై ఐటి దాడులు – TNI  నేటి  తాజా వార్తలు

* దేశవ్యాప్తంగా 16 చోట్ల దాడులు నిర్వహిస్తున్న ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్రై కలర్స్.. హైదరాబాదులో పది చోట్ల ఐటి అధికారుల సోదాలు.. హైదరాబాద్, ముంబై, పాట్నా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తో పాటుగా పలు పట్టణాల్లో ఐటీ సోదాలు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్న ట్రై కలర్స్. ట్రై colour సంస్థలో భారీగా నగదును గుర్తించిన అధికారులు.

* ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు ఉందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ (NDRF NDMF) సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగిందని నిత్యానంద్‌ రాయ్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పిందని తెలిపారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని నిత్యానంద్‌ రాయ్‌ చెప్పారు.

*తెలుగు ఐఏఎస్ అధికారి, చిలకలూరిపేట పట్టణానికి చెందిన మైలవరపు కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలోని అలెప్పి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా తొలుత బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో 2018లో అలెప్పి జిల్లాలో వరద పోటెత్తింది. అప్పుడు 48 గంటల్లో 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వరద ముంపుకు గురి కాకుండా కాపాడిన కృష్ణతేజ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆపరేషన్ కుట్టునాడు, ఐయామ్ ఫర్ అలెప్పీ కార్యక్రమాలతో వరద బాధితులకు అండగా నిలిచి జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కేరళ పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ గా, డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా నియంత్రణ అధికారిగానూ పనిచేసిన కృష్ణ తేజ తన సమర్ధతను చాటుకున్నారు. తిరువనంతపురం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈఓ గాను కృష్ణ తేజ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. తాజాగా ఆయనను అలప్పీ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అలెప్పీ జిల్లా ప్రజలు కృష్ణ తేజను తమ జిల్లా కలెక్టర్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కలెక్టర్ కృష్ణ తేజ నియామకాన్ని స్వాగతిస్తున్నారు. సబ్ కలెక్టర్ గా ఎక్కడైతే పనిచేసి దేశవ్యాప్తంగా పేరు గడించారో అదే ప్రాంతానికి కలెక్టర్ గా వెళుతుండడం పట్ల కృష్ణతేజ సంతోషం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట కు చెందిన పలువురు ప్రముఖులు కృష్ణ తేజకు అభినందనలు తెలిపారు.

* కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌ పశ్చిమ బెంగాల్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లకు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరని తెలిపారు. బెంగాల్‌లో పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పీఎం దక్ష్ పథకాన్ని అమలు చేయాలని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడుతారా? అని బెంగాల్‌ బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లూవాలియా పార్లమెంటులో మంగళవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ మంత్రుల ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా పట్టించుకోరని, వాళ్ల సిబ్బంది కూడా ఇతరులకు మంత్రుల ఫోన్ నంబర్ ఇవ్వాలంటేనే భయపడతారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేనప్పుడు పథకాల అమలు ఎలా సాధ్యమవుతుందన్నారు.

* 3,986 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించిన మూడు కేసులకు సంబంధించి చెన్నై కి చెందిన సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన 67 విండ్‌మిల్స్‌ సహా 75 స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం తెలిపింది. బెంగళూరులోని సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, సురానా పవర్ లిమిటెడ్ ), సురానా కార్పొరేషన్ లిమిటెడ్ తదితర సంస్థలపై సీబీఐ దాఖలు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.

* కర్నూలు జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో…..కుంభవృష్టి వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరు గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తెర్నేకల్ లో రహదారులు కాలువల్లా మారాయి. బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొందరు విద్యార్థులను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని..పాఠశాలకు తీసుకెళ్లారు. అల్లారిదిన్నె సమీపంలో వాగు…ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆస్పరిలో లోతట్టు కాలనీలు నీట మునిగాయి.

* ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘తిరంగా బైక్ ర్యాలీ’ నిర్వహించింది కేంద్ర సాంస్కృతిక శాఖ. ఎర్రకోట నుంచి పార్లమెంట్ గేటు వరకు సాగిన ఈ బైక్ ర్యాలీని జెండా ఊపి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

* ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి మేల్కొలిపేలా అంగరంగ వైభవంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’నిర్వహించాలని, ఎక్కడివాళ్లక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, అన్ని రకాల స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

* కోనసీమ జిల్లాను ఇకపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది గెజిట్‌ను విడుదల చేసింది. సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోనసిమా జిల్లా ఏప్రిల్‌ 4న ఉనికిలోకి వచ్చింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు కోనసీమ జిల్లా పేరుమార్పు విషయమై మే 18న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది.

* వరంగల్‌ , మహబూబాబాద్‌ జిల్లాల్లో వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌ పట్టణంతోపాటు జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని సాయిగణేశ్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, గరీబ్‌నగర్‌లో రోడ్లపైకి వరద నీరు చేసింది. ఇక హంటర్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకున్నది.జిల్లాలో అత్యధికంగా వరంగల్‌ మండలంలో 14 సెంటీమీటర్ల వాన కురిసింది. నల్లబెల్లి మండలంలో 5.8 సెంటీమీటర్లు, దుగ్గొండిలో 5, రాయపర్తిలో 4.1, గీసుకొండలో 3.2, ఖానాపూర్‌లో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

* ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (సెజ్‌)లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన 95 మంది మహిళా కార్మికులు కోలుకుంటు న్నారు. ఇవాళ అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. సీడ్స్‌ కంపెనీ మూసేయాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు.

*నంద్యాల: జిల్లాలోని శ్రీశైలం రుద్రాపార్క్ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేగింది. వాకింగ్ చేస్తుండగా స్ధానికులు చిరుతను చూశారు. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని కాస్తా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వేకువజామున రుద్రాపార్క్ వైపు వాకింగ్‌కు వెళ్లొద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

*చమురు, సహజవాయువుల సంస్థ (ఓఎన్జీసీ)కు జరిమానా విధిస్తూ చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థలు కారణంగా భావించి రూ.22,72,61,000 జరిమానా విధిస్తూ మంగళవారం చెన్నైలోని ఎన్జీటీ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఆరు నెలల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద జమ చేయాలంటూ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. మలికిపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ పర్యావరణవేత్త యెనుముల వెంకటపతిరాజు 2020లో కోనసీమలో ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థల అన్వేషణల ఫలితంగా జల కాలుష్యం ఏర్పడుతున్నదని ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు కోనసీమలో పరిస్థితులను అధ్యయనం చేసి ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. దీనిపై విచారణ చేసిన ఎన్జీటీ.. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిన ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ల జరిమానా విధించింది. ఈ నిధులను కోనసీమ ప్రాంతంలోనే ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్‌ను, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ఆదేశించింది. సీఎ్‌సఆర్‌ నిధులను ఆయా సంస్థల కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల వినియోగంపై పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలను పాటించాలని ఓఎన్‌జీసీకి తెలిపింది.

* మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో టీపీసీసీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డితో ఎవరూ వెళ్లిపోకుండా.. మండల, గ్రామస్థాయి నేతలతో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. మధుయాష్కీ నేతృత్వంలో స్ట్రాటజీ, ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

*ట్రై కలర్స్ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 16 చోట్ల సోదాలు ఐటీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా ట్రై కలర్స్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు చేపట్టారు. హైదరాబాద్, ముంబై, పాట్నా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా పలు పట్టణాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. విదేశాల్లో కూడా ట్రై కలర్స్ పెద్దఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్నట్లు తెలసింది. ట్రై కలర్ సంస్థలో భారీగా నగదును ఐటీ గుర్తించింది.

*చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల జనగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2, 3, 4, 9, 10, 11 తేదీల్లో దశల వారీగా పార్లమెంట్‌ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణ, ఏపీతో పాటు.. కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు పాల్గొంటారని చెప్పారు. కేంద్రలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు

* తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్‌కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్‌పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోకి ఎగిరేది. రోజూ పదుల సంఖ్యలో మాత్రమే తిరిగే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉండేది. కానీ, శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సగటున ప్రతి 3.6 నిమిషాలకు ఒకటి చొప్పున రోజూ దాదాపు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నిత్యం దాదాపు 50 వేల మంది చొప్పున ఏటా 2 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌ ముందంజలో నిలిచింది. ఇటీవల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాశ్రయ కాంట్రాక్టు గడువును మరో 30 ఏండ్లు (2068 వరకు) పొడిగించింది.

*కులం,మతంతో పట్టింపులు లేవని అందరి సంక్షేమమే తమ ధ్యేయమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో 24వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు హమీద్‌ ఆధ్వర్యంలో ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 500మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ రూపురేఖలను పూర్తిగా మార్చామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగడం ఖాయమన్నారు. మెడికల్‌ కాలేజీ, బైపాస్‌రోడ్డు, కేసీఎర్‌ ఎకో అర్బన్‌ పార్కు, మినీ ట్యాంక్‌ బండ్‌, శిల్పారామం, ఐటీ పార్కుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో మహబూబ్‌నగర్‌ ఉత్తమస్థానంలో నిలబడడం ఖాయమన్నారు.ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ టీఆర్‌ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వారికి మిగిలేదని కుళ్లుకుతంత్రాలేని విమర్శించారు.

*కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 35,704క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 24,008 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలో ప్రస్తుతం 103.018 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గానూ, ప్రస్తుతం 1632.31అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. అదేవిధంగా ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరదనీరు నిలకడగా చేరుతున్నది. ఆనకట్టకు ఇన్‌ఫ్లో 63,579 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 63,100 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 479 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 11.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. వరద రాకతో అయిజ మండలం, పులికల్‌ వద్ద నాగల్‌దిన్నె వంతెన సమీపంలో వరదనీరు నిండుగా ప్రవహిస్తున్నది.

*కందనూలు యుగ పురుషుడు, అభినవ అంబేద్కర్‌ మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్‌ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్రనాథ్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ మంద జగన్నాథం, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతీబంగారయ్య ఆవిష్కరించారు.

*కేంద్ర సీడబ్ల్యూసీ బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. నెలరోజులుగా వచ్చిన వరదలకు దిగువ, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లకు ఎలాంటి నష్టమైనా జరిగిందా? స్విల్‌వే ద్వారా వరద జలాల విడుదల సక్రమంగా జరిగిందా లేదా అనే అంశాలపై కేంద్రం బృందం పరిశీలించింది. ఉదయం 9.45 గంటలకు పోలవరం ప్రాజెక్టుకి చేరుకున్న బృందం సభ్యులు తొలుత దిగువ, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లను, గైడ్‌ బండ్‌, గ్యాప్‌ 1,2,3 పనులను పరిశీలించారు. గ్యాప్‌ 2 వద్ద మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత వివరాలను ఎస్‌ఈ నరసింహమూర్తిని అడిగి తెలుసుకున్నారు.

*163వ జాతీయ రహదారి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఓ టోల్‌ ఏజెన్సీకి భువనగిరి మునిసిపల్‌ అధికారులు ఆదివారం రూ.50 వేలు జరిమానా విధించారు. జూలై 29న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నందనం నీరా కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జాతీయ రహదారి నిర్వహణ, భువనగిరి బైపాస్‌ రోడ్డుపై పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌ సంబంధిత గూడూరు టోల్‌ప్లాజా ఏజెన్సీకి జరిమానా విధించారు. పారిశుధ్య నిబంధనలు పాటించకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చారిటబుల్‌ ఫండ్‌కు బిన్‌లాడెన్‌ సోదరులు విరాళం ఇచ్చారంటూ ద సండే టైమ్స్‌ కథనం ప్రచురించడం సంచలనం సృష్టించింది. బిన్‌లాడెన్‌ సోదరులు బకర్‌ బిన్‌లాడెన్‌, షఫీక్‌ 2013లో రూ.9.50 కోట్లు విరాళమిచ్చినట్లు కథనంపేర్కొంది

*చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల జనగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2, 3, 4, 9, 10, 11 తేదీల్లో దశల వారీగా పార్లమెంట్‌ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణ, ఏపీతో పాటు.. కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు పాల్గొంటారని చెప్పారు. కేంద్రలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు

*తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్‌కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్‌పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోకి ఎగిరేది. రోజూ పదుల సంఖ్యలో మాత్రమే తిరిగే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉండేది. కానీ, శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ
విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సగటున ప్రతి 3.6 నిమిషాలకు ఒకటి చొప్పున రోజూ దాదాపు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నిత్యం దాదాపు 50 వేల మంది చొప్పున ఏటా 2 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌ ముందంజలో నిలిచింది. ఇటీవల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాశ్రయ కాంట్రాక్టు గడువును మరో 30 ఏండ్లు (2068 వరకు) పొడిగించింది.

*కులం,మతంతో పట్టింపులు లేవని అందరి సంక్షేమమే తమ ధ్యేయమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో 24వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు హమీద్‌ ఆధ్వర్యంలో ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 500మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ రూపురేఖలను పూర్తిగా మార్చామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగడం ఖాయమన్నారు. మెడికల్‌ కాలేజీ, బైపాస్‌రోడ్డు, కేసీఎర్‌ ఎకో అర్బన్‌ పార్కు, మినీ ట్యాంక్‌ బండ్‌, శిల్పారామం, ఐటీ పార్కుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో మహబూబ్‌నగర్‌ ఉత్తమస్థానంలో నిలబడడం ఖాయమన్నారు.ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ టీఆర్‌ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వారికి మిగిలేదని కుళ్లుకుతంత్రాలేని విమర్శించారు.

*కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 35,704క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 24,008 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలో ప్రస్తుతం 103.018 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గానూ, ప్రస్తుతం 1632.31అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. అదేవిధంగా ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరదనీరు నిలకడగా చేరుతున్నది. ఆనకట్టకు ఇన్‌ఫ్లో 63,579 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 63,100 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 479 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 11.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. వరద రాకతో అయిజ మండలం, పులికల్‌ వద్ద నాగల్‌దిన్నె వంతెన సమీపంలో వరదనీరు నిండుగా ప్రవహిస్తున్నది.

*కందనూలు యుగ పురుషుడు, అభినవ అంబేద్కర్‌ మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్‌ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్రనాథ్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ మంద జగన్నాథం, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతీబంగారయ్య ఆవిష్కరించారు.

*కేంద్ర సీడబ్ల్యూసీ బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. నెలరోజులుగా వచ్చిన వరదలకు దిగువ, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లకు ఎలాంటి నష్టమైనా జరిగిందా? స్విల్‌వే ద్వారా వరద జలాల విడుదల సక్రమంగా జరిగిందా లేదా అనే అంశాలపై కేంద్రం బృందం పరిశీలించింది. ఉదయం 9.45 గంటలకు పోలవరం ప్రాజెక్టుకి చేరుకున్న బృందం సభ్యులు తొలుత దిగువ, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లను, గైడ్‌ బండ్‌, గ్యాప్‌ 1,2,3 పనులను పరిశీలించారు. గ్యాప్‌ 2 వద్ద మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత వివరాలను ఎస్‌ఈ నరసింహమూర్తిని అడిగి తెలుసుకున్నారు.

*163వ జాతీయ రహదారి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఓ టోల్‌ ఏజెన్సీకి భువనగిరి మునిసిపల్‌ అధికారులు ఆదివారం రూ.50 వేలు జరిమానా విధించారు. జూలై 29న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నందనం నీరా కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జాతీయ రహదారి నిర్వహణ, భువనగిరి బైపాస్‌ రోడ్డుపై పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌ సంబంధిత గూడూరు టోల్‌ప్లాజా ఏజెన్సీకి జరిమానా విధించారు. పారిశుధ్య నిబంధనలు పాటించకపోతే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చారిటబుల్‌ ఫండ్‌కు బిన్‌లాడెన్‌ సోదరులు విరాళం ఇచ్చారంటూ ద సండే టైమ్స్‌ కథనం ప్రచురించడం సంచలనం సృష్టించింది. బిన్‌లాడెన్‌ సోదరులు బకర్‌ బిన్‌లాడెన్‌, షఫీక్‌ 2013లో రూ.9.50 కోట్లు విరాళమిచ్చినట్లు కథనంపేర్కొంది

* ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన మీడియాకు వెల్లడించారు. ,1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బాలురు 60.83 శాతం , బాలికలు 68.76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సప్లిమెంటరీలోనూ బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.

* ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో సాగు చేసే వరంగల్‌ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (పేటెంట్‌) సాధించేందుకు శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే వర్సిటీ పరిధిలోని మహబూబాబాద్‌ జిల్లా మల్యాల్‌ జేవీఆర్‌ ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారుచేశారు.

* దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,734 కేసులు నమోదవగా, బుధవారం 17,135 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,40,67,144కు చేరాయి. ఇందులో 4,34,03,610 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,477 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,37,057 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 47 మంది మరణించగా, 19,823 మంది కరోనా నుంచి కోలుకున్నారు.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.32 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 204.84 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

* శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధిక శాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటాయి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. దీంతో శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్‌ పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు.