Movies

మన్నించండి… తప్పైపోయింది! – జాన్వి

Auto Draft

బాలీవుడ్‌లో బంధుప్రీతిపై వ్యంగ్యంతో కూడిన కామెంట్స్‌ చేసిన కథానాయిక జాన్వీకపూర్‌ ఇబ్బందుల్లో పడింది. సోషల్‌మీడియాలో ఆమెపై విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుంది. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. సోదరుడు అర్జున్‌కపూర్‌తో తాను ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెపోటిజమ్‌’ అనే పేరు పెడతానని జోక్‌ పేల్చింది.అలాంటి సినిమా తీయడం తప్పవుతుందా అంటూ ప్రశ్నించింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్స్‌ను నెటిజన్లు సీరియస్‌గా తీసుకున్నారు. పరోక్షంగా బంధుప్రీతిని ప్రోత్సహించేలా ఆమె మాట్లాడిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఏదో సరదాగా అన్న మాటలు దుమారానికి దారితీయడంతో జాన్వీకపూర్‌ చివరకు సారీ చెప్పింది. తాను ఉద్దేశ్యపూర్వకంగా అలా మాట్లాడలేదని, తప్పుంటే క్షమించమని కోరింది. ఇంటర్వ్యూలు, టాక్‌షోలలో తనకు సరదాగా మాట్లాడటం అలవాటని, కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది