Business

టాటా టియాగో కొత్త మోడల్ విడుదల – TNI – వాణిజ్యం వార్తలు

టాటా టియాగో కొత్త మోడల్ విడుదల – TNI  – వాణిజ్యం వార్తలు

* టాటామోటార్స్‌ టియాగో ఎన్‌ఆర్‌జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్‌ చేసింది. ఎన్‌ఆర్‌జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది.

* కంపెనీ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే చాలు.. దానిలో నిజానిజాలను పక్కనబెట్టి ఆ కంపెనీ షేర్లు మాత్రం చిగురుటాకులా వణికిపోతాయి. జొమాటో విషయంలోనూ ఇదే జరిగింది. ఇండియన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఉబర్ టెక్నాలజీస్ తన మొత్తం 7.8% వాటాను విక్రయించే అవకాశం ఉందని ఒక న్యూస్ బయటకొచ్చింది. అంతే జొమాటో షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ప్రారంభ ట్రేడ్‌ లో కంపెనీ షేర్లు 9% పైగా పడిపోయాయి.

* స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. లాభాల్లో టాటా స్టీల్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారతి ఎయిర్‌టెల్ సిప్లా ఉండగా.. నష్టాల్లో కొటక్ మహీంద్రా మారుతీ సుజుకీ కోల్ ఇండియా టైటాన్ ఉన్నాయి. జూలై నెలలో భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. రికార్డ్ స్థాయిలో 31.02 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.67 వద్ద ప్రారంభమైంది.

* బ్యాంకులు ఖాతాదారులకు జారీ చేసే చెక్‌బుక్స్‌పై జీఎస్‌టీ విధించినట్టు వచ్చిన వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రచురణకర్తల నుంచి బ్యాంకులు తీసుకునే చెక్‌బుక్‌లకు మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. స్మశాన, అంత్యక్రియలు, మార్చురీ సేవలపైనా జీఎస్‌టీ విధించారన్న వార్తలనూ ఆమె తోసిపుచ్చారు. కొత్త స్మశాన వాటికల నిర్మాణాలపై మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందన్నారు. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారమై ఉంటాయన్నారు. బ్యాంకు ఏటీఎంల నుంచి నగ దు ఉపసంహరణపైనా ఎలాంటి జీఎస్‌టీ విధించలేదన్నారు.

* ఎయిర్‌క్రాఫ్ట్‌ నిర్వహణలో శిక్షణ కోసం జీఎంఆర్‌ గ్రూప్‌తో ఎయిర్‌బస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా ఏవియేషన్‌ ఇంజనీర్లకు హైద రాబాద్‌లోని జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ మె యింటెనెన్స్‌ ఇంజనీర్‌ లైసెన్సింగ్‌ ప్రొగ్రామ్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. ఎయిర్‌బస్‌ అవసరమైన సాఫ్ట్‌వేర్‌, కోర్స్‌వేర్‌ను అందిస్తుంది. జీఎంఆర్‌తో భాగస్వామ్య ఒప్పందం భారత్‌లో ఎంఆర్‌ఓ సామర్థ్యాలను పెంచడానికి దోహదం చేస్తుందని ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రెమిమైలార్డ్‌ తెలిపారు. 2030 నాటికి భారత్‌ అతిపెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌ కానుందని.. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఓ సేవలు, నిర్వహణ వ్యవస్థ భారత్‌లో బలోపేతమవుతోందని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ సీఈఓ అశోక్‌ గోపినాథ్‌ అన్నారు.

* గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు 5.83 కోట్ల ఐటీ రిటర్న్‌లు అందాయి. ఇందులో 72 లక్షలకుపైగా రిటర్న్‌లు ఆఖరి రోజైన ఆదివారం దాఖలు చేశారు.

* హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ క్వాంటమ్‌ ఎనర్జీ నాలుగు హైస్పీడ్‌ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురానుంది. హైస్పీడ్‌ స్కూటర్ల అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని దేశీయంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంబీఐ కొరియా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్వాంటమ్‌ ఎనర్జీ డైరెక్టర్‌ చక్రవర్తి చుక్కపల్లి తెలిపారు. ప్లాస్మా, ఎలకా్ట్రన్‌, మిలాన్‌, బిజ్‌నెస్‌ స్కూటర్లను కంపెనీ ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ స్కూటర్లు అక్టోబరు నాటికి డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ధరను ఇంకా నిర్ణయించలేదు. కుశలవ గ్రూప్‌నకు చెందిన క్వాంటమ్‌ ఎనర్జీకి బెంగళూరులో ఆర్‌ అండ్‌ డీ కేంద్రం, హైదరాబాద్‌ వద్ద పాశమైలారంలో తయారీ యూనిట్‌ ఉంది.

* బ్యాంకులు రుణ గ్రహీతలకు చుక్కలు చూపిస్తున్నాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కంటే ముందే వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకు తమ వడ్డీ రేట్లను మరింత పెంచాయి. ఎంసీఎల్‌ఆర్‌గా పిలిచే అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా నిర్ణయించే రుణాల వడ్డీ రేట్లను ఈ రెండు బ్యాంకు లు 10 బేసిస్‌ పాయింట్ల నుంచి 15 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాయి. ఇండియన్‌ బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచితే, ఐసీఐసీఐ బ్యాంక్‌ 15 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఈ రెండు బ్యాంకుల నుంచి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలు తీసుకున్న రుణ గ్రహీతల ఈఎంఐల భారం మరింత పెరగనుంది. ఈ నెల 5న వెలువరించే ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటు మరో 35 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.