DailyDose

బైడెన్ కు షాక్ ఇచ్చిన సౌదీ.

బైడెన్ కు షాక్ ఇచ్చిన సౌదీ.

బండ్లు ఓడలు .. ఓడలు బండ్లవుతాయని సామెత ఉంది . కొన్ని నెలల క్రితం వరకూ హుతి రెబల్స్ దాడి చేస్తున్నారు .. ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది .. కానీ , అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది .. ! కాలం మారింది .. చమురు సంక్షోభం భగ్గుమంది . దీంతో ఇంధన ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీని కోరింది . దీనికి అంగీకరించి పెంచింది .. దాదాపు 40 ఏళ్ల అతితక్కువ పెంపు అదే కావడం అమెరికాను షాక్ కు గురి చేసింది . ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు పెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభానికి ఆజ్యం పోసింది . దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో 9 శాతాన్ని దాటేసింది . మరికొన్నాళ్లలో అమెరికా మిడ్ఆర్మ్ ఎన్నికలు ఉండటంతో బైడెన్ సర్కారులో కంగారు మొదలైంది . ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి పెంచడం దాని లక్ష్యంగా మారింది . కానీ , రష్యా బైడెన్ మాట వినదు .. ఇక కొద్దో గొప్పో వినేది సౌదీనే . ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన బైడెన్ చమురు ఉత్పత్తి పెంచడంపై అక్కడి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించారు .

**86 సెకన్లకు సరిపడా చమురు ఉత్పత్తి పెంపు .. ?
అప్పటి వరకు మహమ్మద్ బిన్ సల్మాన్ ( ఎంబీఎస్ ) పాలనలోని సౌదీని బైడెన్ కార్యవర్గం దూరం పెట్టింది . కానీ , చమురు కోసం ఒక్కసారిగా దగ్గరయ్యేందుకు చేసిన యత్నం పెద్దగా ఫలితం చూపించలేదు . సౌదీ నేతృత్వంలోని ఒపెక్ ( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ) బృందం కేవలం రోజుకు 1,00,000 పీపాల చమురు | ఉత్పత్తి మాత్రమే పెంచాలని నిర్ణయించింది . ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో ఇది కేవలం 86 సెకన్ల | డిమాండ్ను మాత్రమే తీర్చగలదని సీఎన్బీసీ కథనంలో పేర్కొంది . బైడెన్ కార్యవర్గానికి ఇదో పెద్ద షాక్ . అమెరికాలోనే 2021 లెక్కల ప్రకారం రోజువారీ చమురు వినియోగం 19.78 మిలియన్ పీపాలుగా ఉందంటే .. తాజా పెంపు ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు . 1986 నుంచి అతి తక్కువ చమురు ఉత్పత్తి పెంపుగా ఇది | నిలిచిందని వాషింగ్టన్కు చెందిన కన్సల్టెంట్ గ్రూప్ ర్యాపిడాన్ ఎనర్జీ అధ్యక్షుడు బాబ్ మెక్ నల్లీ పేర్కొన్నారు . వాస్తవానికి జులై , ఆగస్టు నెలల్లో రోజుకు 6.48,000 పీపాల చమురు ఉత్పత్తి పెంచుతామని జూన్లో ఒపెక్ పేర్కొంది . తాజా పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం కూడా పేర్కొంది . ఒపెక్ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు బైడెన్ వైపల్యంగా పేర్కొంటున్నాయి . ‘ బ్రెడెన్ కార్యవర్గానికి ఇదో చెంపపెట్టు ” అని సీఎన్ఎన్ విశ్లేషకుడు మాల్ స్మిత్ పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్టు కథనం వెల్లడించింది. అయినా ఫలితం లేకపోయింది.