NRI-NRT

పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ పరిశీలించిన తానా ప్రతినిధులు

పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ పరిశీలించిన తానా ప్రతినిధులు

వచ్చే జులై నెలలో తానా మహాసభలు జరుగనున్న పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను తానా బృందం శుక్రవారం సందర్శించింది. సెంటర్లో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించారు. తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి ఈ సమావేశ మందిరంలో ఉన్న ఏర్పాట్లను గురించి బృందానికి వివరించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా ప్రతినిధులు లక్ష్మీ దేవినేని, రవి మందడపు, విద్య గారపాటి, రాజా కసుకుర్తి, హరీష్ కోయ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.