NRI-NRT

ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిల భారీ విరాళం. కాణిపాకంలో ధ్వజస్థంభం ప్రతిష్ట

ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్,  ఐకా రవిల భారీ విరాళం. కాణిపాకంలో ధ్వజస్థంభం ప్రతిష్ట

ప్రముఖ ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా భారీ విరాళంతో కాణిపాకంలో పునర్నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. పునర్నిర్మాణం అనంతరం ఆగష్టు 21న మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన కలుగజేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా గత ఆగష్టు 4వ తేదీన వేద పండితుల ఆధ్వర్యంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు.
kanipakam-4
ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వివిధ పూజా పునస్కారాలు వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయాన్ని 11 నుంచి 14 అడుగుల ఎత్తుకు పెంచారు. అలాగే గోపురాన్ని 22 అడుగుల నుంచి 28.6 అడుగులకు పెంచారు. గుడి లోపల భారతీయ సాంప్రదాయ కళలతో రూపొందించిన స్తంభాలను ఏర్పాటు చేశారు. గర్భ గుడి, మండపం, బలాలయం ఇలా అన్నిటినీ ఆధునీకరించారు.
kanipakam-3
వచ్చే ఆగష్టు 21న మధ్యాహ్నం 12:30 నుండి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం అందించేలా ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆగష్టు 15న సాయంత్రం 5 గంటల నుండి వివిధ పూజలు చేయనున్నారు. ఈ మహాకుంభాభిషేకానికి భక్తులందరూ తరలి రావాల్సిందిగా ఆలయ దాతలు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలు కోరుతున్నారు.
kanipakam-2
kanipakam-1
kanipakam-2