DailyDose

ప్రకాశంలో కారు ప్రమాదం ఐదుగురు మృతి – TNI నేటి నేర వార్తలు

ప్రకాశంలో  కారు ప్రమాదం ఐదుగురు మృతి  – TNI   నేటి నేర వార్తలు

* రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. సికార్ జిల్లాలోని ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన నెలవారీ జాతర సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.జాతర సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఖాతూ శ్యామ్ జీ ఆలయాన్ని తెరిచారు. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మరణించారు. మృతుల్లో ఒకరిని గుర్తించారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మరో ఇద్దరు భక్తులను జైపూర్ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆలయంలో భక్తుల మృతిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా విచారం వ్యక్తం చేశారు.

* ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కంభం సమీపంలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాల వద్ద అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై… లారీని వెనక నుంచి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టడం వల్ల లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల పేర్లు… అనిమిరెడ్డి(60), గురవమ్మ(60), అనంతమ్మ(55), ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి(24)గా గుర్తించారు.

* అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక పార్కులోని ఫెర్రో కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ అలముకొవడంతో ఊపిరాడక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇద్దరికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, ఈ ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ సేఫ్టీ వారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

* నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేగింది. కుటుంబంలో తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

* వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఎన్ఎస్ఎల్ టెక్స్‌టైల్స్‌ కర్మాగారం గోడౌన్‌లో రాత్రి 11గంటల 30నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగార సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. మంటలు ఎక్కువగా ఉండటంతో పులివెందుల, వేంపల్లి, కమలాపురం, యురేనియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చిన అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఇవ్వాళ ఉదయం వరకు మంటలను అదుపు చేయడానికి శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు రూ.లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

* అశ్లీల వీడియో తీసి వైరల్‌ చేసిన పెనుగంచిప్రోలులోని కంఠమనేని ఫంక్షన్‌ హాలు యజమాని వేణుగోపాల్‌పై బాధిత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ హరిప్రసాద్‌ వివరాల మేరకు.. వివాహితతో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా అమర్చిన సెల్‌ఫోన్‌లో వేణుగోపాల్‌ వీడియో తీశాడు. దానిని బయటపెడతానని చాలాకాలం బెదిరించాడు. ఆమెను అనేక సార్లు లైంగికంగా వేధించాడు. ఇటీవల ఆ వీడియోను ఇతరులకు పంపి ఆమె పరువుకు విఘాతం కలిగించాడు. ఆ విషయమై అతన్ని ప్రశ్నించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆమె ఫంక్షన్‌ హాలుకు వెళ్లగా… వారిపై వేణుగోపాల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఆగ్రహం చెందిన వారు అతనిపై దాడి చేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చారు. గాయపడ్డ వేణుగోపాల్‌ని 108 వాహనంలో చికిత్స కోసం నందిగామ ఆసుపత్రికి పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

* ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. సంఘటన సమయంలో కారు వేగం అదుపు చేయలేక.. రోడ్డు పక్కనే ఉన్న గోడని ఢీకొట్టి ఆగింది. ప్రమాదంలో షకీల్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జీజీహెచ్కి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వస్తున్న కారు కంటైనర్ని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి చెందగా.. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. మృతుడు తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు

* నంద్యాల పట్టణంలో ఓ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్సీ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్‌ (37) విధులు ముగించుకొని ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌ థియేటర్‌ సమీపంలో ఆరుగురు పాతనేరస్తులు అడ్డగించి అటుగా వస్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కించుకుని చిన్నచెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సురేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి హత్యచేసి వెళ్లిపోయారు.

* మద్దూరు లో విషాదం..కరువు కాలువ లోనికి దూసుకెళ్లిన జోడెద్దుల టైర్ బండి. ప్రాణాలు కోల్పోయిన జోడెద్దులు ట్రాక్టర్ సాయం తో భయటకు తీసిన స్థానికులు.సంఘటన స్థలాన్ని పరిశీలించి యాజమాని వల్లభుని చిన పోతురాజును పరామర్శించిన ఎమ్మెల్యే సారథి.భారీగా చేరుకున్న స్థానికులు కంటతడి పెట్టుకున్న పశుపోషకులు

* 90 రోజులకు కూడా ఛార్జ్ షీట్ కోర్టులో పోలీసులు వేయకపోతే చట్ట ప్రకారం కోర్ట్ అనoత బాబుకు బెయిల్ ఇస్తుందని.అందుకోసమే పోలీసులు చార్జషీట్ వేయకుండా పరోక్షంగా సహకరిస్తునారెమో అని అనుకోవాలసి వస్తుందని ప్రముఖ నాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ సుబ్బారావు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పిట్టా వర ప్రసాద్, జార్జి అంథోని,ఇసుకపట్ల రాంబాబు, కొల్లాపు వేణు, ధార ఎసురత్నం, నక్కా వెంకటరత్నం, కె. వి. ఎస్. ఎం. కుమార్ లతో కలసి పత్రికా ప్ర తినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర స్థలం గుర్తించడం లో మిగిలిన నేరస్థులను అరెస్టు చేయడంలో వైపల్యం అయ్యారన్నారు. సీసీ పుటేజీలను స్వాధీనపరచుకొని ఎందుకు పోలీసులు విచారణను ముందుకు తీసుకెళ్ళడం లేదో అర్థం కావడంలేదన్నారు.కస్టడీలోకి ముద్దాయిని తీసుకోవడానికి వేసిన పిటిషన్ గడువు ముగిసే చివరి నిమిషం వరకు ఎందుకు జాప్యం చేశారని.. ఇది ముద్దాయిని కాపాడే ప్రయత్నం కాదా? అని ముప్పాళ్ళ ప్రశ్నిం చారు.

* ఓ కానిస్టేబుల్ పనిమీద టైలరింగ్ షాపు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న దుండగులు అతనిని వెంబడించి, కిడ్నాప్ చేసి మరీ హత్య చేశారు. సినీ ఫక్కీలో నంద్యాల నడిరోడ్డుపై కానిస్టేబుల్ సురేంద్ర హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాలలో డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్రను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కానిస్టేబుల్‌పై బీర్ బాటిళ్లతో దాడి చేసి.. ఆటోలో కిడ్నాప్ చేసి.. కత్తులతో పొడిచి హత్య చేశారు.

*మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యొన్నబత్తిని రమాదేవి(ఒంగోలు), సాంబశివరావు(విజయవాడ) కొంతకాలంగా గద్వాల పట్టణ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బెంగళూరు, ఒంగోలు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సమాచారం అందడంతో పట్టణంలోని బీరోలు రోడ్డు(తాయమ్మ దేవాలయం) సమీపంలోని ఇంటిపై దాడులు చేశారు. నిర్వాహకులతోపాటు చెనుగోనిపల్లికి చెందిన యువకులు ఎం.డి ఫాయాజ్, ఎండి సోహెల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గదిలోని సెల్‌ఫోన్‌లు స్వాదీనం చేసుకున్నారు. వారిని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరొకరు పరారయ్యారని స్థానికులు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్‌ను అటకాయించిన దుండగులు కత్తితో పొడిచి హత్యచేశారు. కానిస్టేబుల్‌ గూడూరు సురేంద్రకుమార్‌.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అయితే రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు దుండగులు సురేంద్రను అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు.

*రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్‌ జిల్లాలోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు స్వామివారికి తొలిపూజల అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు.

*ఇరాన్‌లో ఇటీవ‌ల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి 10 మందిని క‌త్తితో పొడిచి ఫార్మ్‌ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విష‌యంలో ఈ దాడి జరిగిన‌ట్లు ఇరాన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో న‌లుగురు ఇరానియ‌న్లు, ఆరుగురు ఆఫ్ఘ‌న్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాడి చేసిన వ్య‌క్తికి మాన‌సిక రుగ్మ‌తలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇరాన్ పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. ఇరాన్‌లో కొన్ని ద‌శాబ్ధాల నుంచి తీవ్ర క‌రువు ఉంటోంది. నీటి స‌మ‌స్య‌లు పెర‌గ‌డంతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. నీటికి యాక్సెస్ ఉన్న ప్రాంతాల వ‌ద్ద గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి.

*ఐటీబీపీ జవాన్‌ ఓ 13 ఏండ్ల బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవాన్‌ను అరెస్టు చేశారు. సిక్కింలోని పాక్యాంగ్‌ జిల్లా రంగ్పో టౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.

* పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. అస్సామ్‌ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మలీ్టఫ్లెక్స్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేస్తోంది.

*తిరుపతిలో టీటీడీ రిటైర్ట్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుపతిలోని ఎంఆర్‌ పలెల్లో అర్ధరాత్రి నారాయణస్వామిని దుండగులు కొట్టి చంపారు. తన గోల్డ్‌చైన్‌ పోయిందని ఇటీవల స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో నారాయణస్వామి మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నారాయణస్వామి ఇంటిపక్కన ఉండేవారిని ప్రశ్ని స్తున్న సమయంలో నిన్న రాత్రి దారుణ హత్యకు గురికావడం సంచలనం కలిగించింది.

*ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు బజార్ వెనుక వైపున ఖాళీగా ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకోని వెంకటేశ్వరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై తల్లితో ఓ యువకుడు పలుమార్లు గొడవకు దిగాడు. అనంతరం ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగామ నేతాజీ నగర్ చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

*ప్రకాశం: జిల్లాలోని కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనుక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మృతులు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. వీరంతా మాచర్ల నుంచి తిరుమల కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో అమ్మిరెడ్డి(60), గురవమ్మ(60), అనంతమ్మ(55), మృతులు ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి(24)ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన హౌరా జిల్లాలోని బగ్నాన్‌ వద్ద సోమవారం తెల్లవారు జరిగింది.

*యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మ‌హిళ‌పై స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త అనుచితంగా వ్య‌వ‌హించాడు. ఆమెను దూషించి దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇవాళ అధికారులు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వ‌ద్ద ఉన్న అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చివేశారు. బుల్డోజ‌ర్‌తో అక్ర‌మ నిర్మాణ క‌ట్ట‌డాన్ని తొల‌గిస్తున్నారు. నోయిడా హౌజింగ్ సొసైటీకి బుల్డోజ‌ర్ రావ‌డంతో.. అక్క‌డ ఉన్న స్థానికులు సంతోషంగా చ‌ప్ప‌ట్లు కొట్టారు. సీఎం యోగి నిర్ణ‌యం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని స్థానికులు అన్నారు. నోయిడా సెక్ట‌ర్ 93బీలో నివ‌సిస్తున్న ఓ మ‌హ‌ళ‌తో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ ఘ‌ట‌న‌లో ఐపీసీ కింద కేసు బుక్కైంది. ప్ర‌స్తుతం శ్రీకాంత్ త్యాగి ప‌రారీలో ఉన్నాడు. త్యాగిపై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద కేసు బుక్ చేశారు. శ్రీకాంత్ త్యాగి అక్ర‌మంగా సొసైటీ పార్క్‌ను క‌బ్జా చేశాడు. దీంతో స్థానికులు ఆగ్ర‌హానికి లోన‌య్యారు. నోటీసులు ఇచ్చినా ప‌ట్టించుకోకుండా.. అక్ర‌మ నిర్మాణాన్ని చేప‌ట్టాడు.

*అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామ వలంటీరు గోపాల్‌ తన ద్విచక్ర వాహనంలో బళ్లారి నుంచి 55 మద్యం బాటిళ్లను తెస్తూ దొరికాడని పాల్తూరు పోలీసులు తెలిపారు.

*అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామ వలంటీరు గోపాల్‌ తన ద్విచక్ర వాహనంలో బళ్లారి నుంచి 55 మద్యం బాటిళ్లను తెస్తూ దొరికాడని పాల్తూరు పోలీసులు తెలిపారు.

*వైసీపీ పాలనను ప్రశ్నించిన ప్రతివారిపై కేసులు పెట్టాలనుకొంటే రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల మంది ప్రజలపైనా పెట్టాల్సి వస్తుంది… పెడతారా..? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పూతలపట్టు ఘటనపై శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘వైసీపీ ప్రభుత్వ పాలనపై గడప గడప కార్యక్రమంలో ప్రతి చోటా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలు కాలర్‌ ఎగరేసుకొని తిరగడం కాదు… ప్రజలు కాలర్‌ పట్టుకొని నిలదీస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి లోపించడంపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనానికి లోనవుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైసీపీ ఎమ్మెల్యేను విద్యా దీవెనపై ప్రశ్నించిన ఇంజనీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్టు చేయడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యం. విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా? వేపనపల్లి గ్రామంలో జరిగిన ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థిపైనా, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలి. వెంటనే అందరినీ విడుదల చేయాలి. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

*సౌత్ ఇండియా ఆయిల్ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలో విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మురళీకృష్ణ మృతిచెందాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై ముత్తుకూరు ఎస్ఐ కృష్ణారెడ్డి సెటిల్‌మెంట్ మొదలు పెట్టారు. పరిహారం ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. మృతుడి కుటుంబం వైపు కాకుండా, కంపెనీ వైపు మాట్లాడుతున్నారని డ్రైవర్లు ప్రశ్నించారు. దీంతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు ఎస్ఐ. అరెస్ట్ చేస్తానంటూ డ్రైవర్లను బెదిరించాడు. ఆగ్రహించిన డ్రైవర్లు ఎంత మందిని అరెస్ట్ చేస్తావంటూ మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. మృతుని కుటుంబానికి రూ.25లక్షలు పరిహారం చెల్లించాలని టీడీపీ, డ్రైవర్లు డిమాండ్ చేశారు.

*బిహార్‌లో ఘోరం జరిగింది. అనుమానాస్పద స్థితిలో ఏడుగురు మృతి చెందగా.. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందుకు కల్తీ మద్యమే కారణమని భావిస్తున్న అధికారులు.. బాధిత కు టుంబాలు మాత్రం వివరాలు వెల్లడించడం లేదంటున్నారు. సరన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్‌.. తక్షణమే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని కల్తీ మద్యం అమ్మకందారులపై దృష్టిపెట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె సైతం రెయిలింగ్‌ పైకి ఎక్కి కొద్ది సేపు అలాగే నిలబడింది. అది చూసి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి ఆమెను వెనక్కి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ ఘటనలో తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. బాలిక బధిరురాలని.. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. నిందితురాలు దంత వైద్యురాలు కాగా.. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. ‘అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. తల్లి మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆరా తీస్తున్నాం’ అని సీనియర్ పోలీసు అధికారి శ్రీనివాస్ గౌడ తెలిపారు.

*మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌ తో 11 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి (30) మృతి చెందాడు. మల్లంపేట్ డ్రీమ్ వెల్లి కాలనీలో నీటి సంపు‌ శుభ్రం చేస్తుండగా బాలుడు భవానీ ప్రసాద్ ప్రమాదం జరిగింది. నీటి సంపులో ఎలక్ట్రిక్ సబ్ మెర్సిబుల్ మోటర్ విద్యుత్ ఘాతానికి బాలుడు భవానీ ప్రసాద్, గాదె జానా రెడ్డి బలయ్యారు. సమాచారం అందిన వెంటే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ప్రతీక్ అలియాస్ సూర్య రాజేంద్ర పవార్ (23)పై ఆదివారం 14 మంది దుండగులు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా వదిలేసి వెళ్లిపోయారు. అతడు సోషల్మీడియాలో నుపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెడుతుండడమే ఈ దాడికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని, దాడికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

*కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు వాసులు. వీరంతా కారులో సిరిగిరిపాడు నుంచి తిరుపతిలో దైవ దర్శనం కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులను అమ్మిరెడ్డి(60), గురువమ్మ(60), అనంతమ్మ(55), ఆదిలక్ష్మి(58), నాగిరెడ్డి(24)గా గుర్తించారు.

*స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోవా నుంచి (లైసెర్జిక్ యాసిడ్ డైథైల్ అమైడ్) ఎల్ఎస్డీ బ్లాట్స్ నగరానికి తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు, యాంటీ నార్కోటిక్ సెల్, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడారు.

*సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

*తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరన్న అనుమానంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి మృతిచెందగా, యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గారపెంట గిరిజన గూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గారపెంటకు చెందిన చావడి వెంకటేశ్వర్లు, జోజ్జ పుష్పవతి (19) మేకలు కాస్తుంటారు. అక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఆదివారం అడవికి వెళ్లి అత్యంత విషపూరితమైన ముష్టికాయ రసం తాగారు. కొద్దిసేపటికే వికారం, వాంతులు ఎక్కువడంతో భయంతో గూడెంలోని ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో గూడెం వాసులు వారిద్దరినీ ఎర్రగొండపాలెం వైద్యఽశాలకు తరలిస్తుండగా పుష్పవతి మార్గమధ్యంలో మృతి చెందింది. వెంకటేశ్వర్లు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ వేముల సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరన్న అనుమానంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి మృతిచెందగా, యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గారపెంట గిరిజన గూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గారపెంటకు చెందిన చావడి వెంకటేశ్వర్లు, జోజ్జ పుష్పవతి (19) మేకలు కాస్తుంటారు. అక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఆదివారం అడవికి వెళ్లి అత్యంత విషపూరితమైన ముష్టికాయ రసం తాగారు. కొద్దిసేపటికే వికారం, వాంతులు ఎక్కువడంతో భయంతో గూడెంలోని ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో గూడెం వాసులు వారిద్దరినీ ఎర్రగొండపాలెం వైద్యఽశాలకు తరలిస్తుండగా పుష్పవతి మార్గమధ్యంలో మృతి చెందింది. వెంకటేశ్వర్లు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ వేముల సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*వృద్ధురాలిని చంపుతానని బెదిరించి ఆమెపై దాడిచేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లా పర్చూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఓ కాలనీకి చెందిన వృద్ధురాలు (55) శనివారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన పిల్లి నాగేంద్రబాబు అలియాస్ మోజెస్ లోపలికి ప్రవేశించాడు. ఆమెకు స్ర్కూడ్రైవర్ చూపించి చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఎ.లక్ష్మీభవానీ ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

*విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నెలరోజుల కిందట 61 ఎల్ఎ్సడీ బోల్డ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, తాజాగా గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టుచేశారు.

*అప్పులబాధతో అనంతపురం జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన శంకర్ (34)కు ఎకరాకన్నా తక్కువ భూమి ఉంది. దీంతో పాటు పుట్లూరు మండలం శనగలగూడూరు, కడవకల్లు గ్రామాల్లో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కరివేపాకుకు డిమాండ్ ఉంటుందనీ అప్పులు తెచ్చి, పంట సాగుచేశాడు. ఎకరాకి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తెగుళ్ల నుంచి పంట కాపాడుకునేందుకు దొరికిన చోటల్లా అధికవడ్డీలకు అప్పులు తెచ్చాడు. అయినా తెగుళ్ల కారణంగా పంట దెబ్బతింది. పంట కొనడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో చేసేదిలేక అతి తక్కువ ధరకు విక్రయించాడు.

*రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రైతు పొలంలోకి వరద నీటి కోసం రెవెన్యూ అధికారులు గండి కొట్టారు. అడ్డుకున్న రైతులను అధికారులు పోలీసులతో నెట్టివేయించారని వాపోతున్నారు. అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు కిషోర్ మృతి చెందాడు. రెవెన్యూ అధికారుల తీరుపై బాధిత కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

*ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ను అటకాయించిన దుండగులు కత్తితో పొడిచి హత్యచేశారు. కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నారు. అయితే రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు దుండగులు సురేంద్రను అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు.

*ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు కారులో తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో వారి కారు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అనిమిరెడ్డి, గురవమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న పారిశ్రామక సెజ్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అచ్యుతాపురంలో విషవాయువు లీకై వందమంది కార్మికులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఇవాళ జిల్లాలోని పరవాడ పారిశ్రామిక పార్కులోని ఫెర్రో కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.