Movies

కూతురును రంగంలోకి దింపిన మాలాశ్రీ

కూతురును రంగంలోకి దింపిన మాలాశ్రీ

తెలుగులో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి మాలాశ్రీ. ఆమె కుమార్తె రాధానా రామ్ కథానాయికగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ఇటీవల బెంగళూరులో ప్రారంభమైంది. ఈ చిత్రంలో దర్శన్ హీరోగా నటిస్తున్నారు. రాక్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తరుణ్ సుధీర దర్శకుడు. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ ‘రాధానాకు చిన్నప్పటి నుంచే నటన ఇష్టం. ముంబయిలో యాక్టింగ్, డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నా కూతురు స్వయంకృషితో పరిశ్రమలో రాణించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.