NRI-NRT

డాలస్ లో తానా యోగా శిక్షణ

డాలస్ లో  తానా యోగా శిక్షణ

డాలస్ లో తానా ఆధ్వర్యంలో ఆగస్టు 7న ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాలస్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘కిరణ్ చుక్కపల్లి’ యోగా అంటే ఎమిటి? ఎలా మనతరం వారికి వచ్చింది అనే విషయాలను గురించి వివరించారు.
tana1-6
నన్ను చాలా మంది వెస్టరన్ వారు మీరు ఏరకమైన యోగి, హఠ యోగా లేక అష్టాంగ యోగా అని ప్రశ్నించేవారని, కాని దానికి సమాధానం చాలా క్లిష్టమైనదని అన్నారు. నిజానికి హఠ యోగి కావాలంటే అంత సులువు కాదని, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇంద్రియాలు, ఊపిరిపై 8 రకాలైన నియంత్రణ వుండాలి, అటువంటి నియంత్రణను ప్రదర్శించిన వారిలో సాయిబాబా, రమణ మహర్షి, స్వామి రామ వంటి వారు అని, ఈ ఆధునిక చరిత్రలో అలాంటి పట్టు సాధించిన వారు అరుదు అని అన్నారు. హఠ యోగ చాలా క్లిష్ట మైనదని, దానికి సరళీకృతమైన సంస్కరణ అయిన ‘అష్టాంగ యోగ’ ను పతాంజలి మహర్షి మనకు అందించారు. అన్ని గ్రంథాల సారం స్థిరం, సుఖం, ఆసనం అని, యోగా ద్వారా ఇది సాధ్యం అవుతుందని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. తరువాత మేము ఈ యోగా ప్రక్రియను 7 మండలాలుగా రూపొందించాము అని… విన్యాస ఆసనాలను (అధర్ముఖ), శ్వాస ప్రక్రియ మెళుకువలను అందరికీ నేర్పించారు.
tana1-5
*తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మరియు తానా కార్యవర్గ బృందం ‘కిరణ్ చుక్కపల్లి’ని పుష్పగుచ్చం, దుశ్శాలువ మరియు సన్మాన పత్రికతో ఘనంగా సత్కరించారు. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, కమ్మ్యూనిటీ ఎట్ లార్జ్ సభ్యులు లోకేష్ నాయుడు, ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, కోశాధికారి అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి మరియు తానా డాలాస్ టీం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు అట్లాంటా నుంచి డాలస్ రావడం ఆనందదాయకం అని, వారిని పుష్పగుచ్చం, దుశ్శాలువతో సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఇలా డాలస్ టీం అందరితో కలసి ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా వుందని, తానా టీం అందరు కలసి వన్ టీం లా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు.
tana1-4
tana1-3