Devotional

తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభం –TNI ఆధ్యాత్మి క వార్తలు

తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభం –TNI  ఆధ్యాత్మి క వార్తలు

1. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపుచేశారు.ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మ వార్లకు విశేష సమర్పణ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తామని వివరించా రు. కాగా పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.

2. యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు.అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
11-13
3. శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిధిలో రెండో రోజు పవిత్రోత్సవాలు
కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అయిన నేడు అగ్ని ప్రతిష్ట, అష్టోత్తర శత కలశావాహనము, పవిత్రాధివాసం పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు.

4. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 81,903 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 39,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

5. యాదగిరి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం, వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దర్శనాలు, మొక్కుపూజల క్యూలైన్లలో భక్తుల సంచారంతో కోలాహలం నెలకొంది. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.25,83,728 ఆదాయం సమకూరింది. యాదగిరి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఆదివారం నిత్యారాధనలు, కోటికుంకుమార్చన పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ప్రధానాలయ ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. కుంకుమార్చనపూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు.

6. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 81,903 మంది భక్తులు దర్శించుకోగా 39,594 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 4.74 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
7. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఇవాళ ఉదయం ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఏపీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.