NRI-NRT

ప్రవాసులకు ఎయిరిండియా బంపరాఫర్

ప్రవాసులకు ఎయిరిండియా బంపరాఫర్

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా యూఏఈలోని భారత ప్రవాసులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రవాసులు అతి తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది. యూఏఈ నుంచి భారత్‌లోని ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్‌వే టికెట్ ధర కేవలం 330 దిర్హమ్స్‌గా(రూ. 7,147) నిర్ణయించింది. ‘వన్ ఇండియా వన్ ఫేర్’ లో భాగంగా ఎయిరిండియా ఎయిర్‌లైన్ అన్ని గల్ఫ్ స్టేషన్‌ల నుండి (ఒమన్ మినహా) భారతదేశంలోని ఏ గమ్యస్థానానికి అయినా అన్ని డైరెక్ట్ విమానాలలో ఆకర్షణీయమైన వన్-వే ఛార్జీలను అందిస్తుంది. ఇక ఈ ప్రమోషన్ పీరియడ్‌లో భాగంగా అక్టోబరు 15, 2022 వరకు విక్రయించే అన్ని టిక్కెట్‌లపై ప్రయాణికులకు చెక్ ఇన్ బ్యాగేజీ అలవెన్స్‌గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ లగేజీని తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
air-india-1
*ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ పీపీ సింగ్ మాట్లాడుతూ ఎయిరిండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో కలిపి వీక్లీ 81వేల సీట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ‘వన్ ఇండియా వన్ ఫేర్’ పథకంలో భాగంగా మాత్రం పరిమిత సంఖ్యలో సీట్లు ఉంటాయని వెల్లడించారు. మొదట బుక్ చేసుకున్నవారికి ఇది పొందే వీలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఛార్జీలు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్/మొబైల్ యాప్‌లో, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయని సింగ్ తెలిపారు.
air-india-2