DailyDose

భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త

భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త

చైనాలో విద్యనభ్యసిస్తూ కోవిడ్‌ కారణంగా స్వదేశంలో ఆగిపోయిన భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురు చెప్పింది. ‘వీలైనంత త్వరగా భారతీయ విద్యార్థులను చైనాకు తిరిగి రప్పించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే భారత్‌ నుంచి విద్యార్థుల తొలి బ్యాచ్‌ ఆగమనం మీరు చూస్తారు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం బీజింగ్‌లో మీడియాతో అన్నారు.విదేశీ విద్యార్థుల కోసం ప్రభుత్వం నూతన వీసా విధానాన్ని తెస్తోందన్న వార్తల నేపథ్యంలో వాంగ్‌ స్పష్టతనిచ్చారు. భారతీయ రాయబార కార్యాలయం ఇచ్చిన విద్యార్థుల జాబితా పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చైనాలో దాదాపు 23వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం వైద్య విద్యార్థులే. కోవిడ్‌ ఉధృతికాలంలో నిలిచిపోయిన చైనా, భారత్‌ మధ్య విమాన రాకపోకలు ఇంకా మొదలుకాలేదు. సర్వీసుల పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతున్నాయి.