Politics

సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రమాణస్వీకారం – TNI నేటి రాజకీయ వార్తలు

సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రమాణస్వీకారం –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* బీహార్‌లో ‘మహా ఘట్బంధన్’ ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మరింత మంది మంత్రులను తదుపరి క్రమంలో నితీష్ తన క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వికి నితీష్ అభినందనలు చెప్పారు. నితీష్‌ పాదాలకు తేజస్వి నమస్కరించే ప్రయత్నం చేయడంతో ఆయన వారించి నవ్వుతూ కరచాలనం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మహా కూటమి నేతలు హాజరయ్యారు. బీహార్ సీఎంగా నితీష్ పగ్గాలు చేపట్టడం ఇది ఎనిమిదో సారి. ప్రమాణస్వీకారం అనంతరం తేజస్వి యాదవ్‌ను నితీష్ అభినందించారు. నితీష్‌ పాదాలకు అభివందనం చేయడానికి తేజస్వి ప్రయత్నించగా, నితీష్ నవ్వుతూ ఆయనతో కరచాలనం చేశారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

*అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలి: రాజాసింగ్
అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈడీ కేసుల గురించి.. టీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని ప్రకటించారు. ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సభలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని రాజాసింగ్ వెల్లడించారు.

*జెండా కోసం పేదల తిండి లాక్కుంటారా?: వరుణ్‌గాంధీ
జాతీయ జెండా కోసం పేదల తిండి లాక్కోవద్దని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. రేషన్ షాప్ కోసం వెళ్లిన తమతో బలవంతంగా రూ.20 వసూలు చేసి జాతీయ జెండా కొనిపించారని పలువురు వ్యక్తులు ఆరోపించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ ఘాటుగా స్పందించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు పేదలకు భారంతా మారితే అంతకంటే దురదృష్టం ఉండదని ఆయన అన్నారు. ”జాతీయ జెండా కొంటేగానీ రేషన్ ఇవ్వమంటూ బలవంతం చేస్తున్నారు. జాతీయ పతాకం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. పేదల తిండి గింజలు లాక్కొని త్రివర్ణ పతాకం ధరలు వసూలు చేస్తుండటం సిగ్గుచేటు” అని ఆయన వ్యాఖ్యానించారు.

* మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌.. ఇలా జరిగిందేంటి!
ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ అంతా మునుగోడుపైనే ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్‌ పెట్టాయి. ఉప ఎన్నికల బరిలో ఎవరిని పోటీలో నిలపాలి అని కసరత్తులు చేస్తున్నాయి. ఇక, అధికార టీఆర్‌ఎస్‌ ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతుండగా ఊహించని అసమ్మతి సెగ తగిలింది. కాగా, మంత్రి జగదీష్‌రెడ్డి ఇంట్లో మునుగోడు నియోజకవర్గ నేతలు బుధవారం భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. క్రమంలో టీఆర్‌ఎస్‌ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొదని వారు అసమ్మతి గళం వినిపించారు. కూసుమంట్లకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో సపోర్టు చేసేదిలేదంటు తేల్చి చెప్పారు. ఈ విషయంపై వారం క్రితమే సీఎం కేసీఆర్‌కు అసమ్మతి నేతలు లేఖలు రాసినట్టు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీష్‌ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

*కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు
నితీష్ కుమార్ సారథ్యంలోని మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీతో సంబంధాలు తెంచుకున్న నితీష్ ఆ వెంటనే ఆర్జేడీ కూటమితో చేతులు కలిపి మహాగఠ్బంధన్ ప్రభుత్వాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేశారు. సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ శాసనసభా పక్ష నేత తేజస్వి యాదవ్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణను త్వరలోనే నితీష్ చేపట్టనున్నారు. నితీష్ క్యాబినెట్‌లో నాలుగు మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని కాంగ్రెస్ ఆశించింది. అయితే, స్పీకర్ పదవిని ఇచ్చేందుకు నితీష్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఆర్జేడీకి అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కనుంది. మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎంకు ఒక మంత్రి పదవి దక్కనుంది. జేడీయూ దాదాపు గత మంత్రివర్గంలో ఉన్న మంత్రులనే కొనసాగించే అవకాశాలున్నాయి. నితీష్ వద్దే హోం శాఖ ఉండనుంది. గత ప్రభుత్వంలో బీజేపీ నిర్వహించిన మంత్రి పదవులు ఆర్జేడీకి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా, జేడీయూకు 43, ఆర్జేడీ 79, సీపీఐ (ఎంఎల్)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

*అందుకే చంద్రబాబుకు నిధులిచ్చాం.. కానీ జగన్కు ఇవ్వడం లేదు: సోము వీర్రాజు
చంద్రబాబు దార్శనికుడు కాబట్టే రాజధాని నిర్మాణానికి నిధులిచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భూములను ఆక్రమించడానికే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రం వల్ల కాదంటే.. పోలవరాన్ని కేంద్రమే కడుతుందని తెలిపారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు దార్శనికుడు కాబట్టే నాడు కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వివిధ రూపాల్లో రూ.8,500 కోట్ల నిధులివ్వడానికి సిద్ధపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్‌ దార్శనికుడు కాదు కాబట్టే ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడు రాజధానులంటూ జగన్‌ కనీసం మూడు రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. రాజధానిని నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. భూములను ఆక్రమించడానికే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. చివరికి రాజధాని లేకుండా చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేశారు. కాబట్టే రాజధాని కోసం రైతులు, భాజపా యాత్రలు చేయాల్సి వస్తోంది. అమరావతిని నిర్మించుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తే కేంద్రం రహదారులు నిర్మిస్తుంది. మౌలిక వసతులు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మిస్తాం’’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*వర్సిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చేశారు: నారా లోకేశ్
వర్సిటీలను జగన్‌ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వేధింపులతో ఉద్యోగి రాజీనామా… అరాచక పాలనకు అద్దంపడుతోందని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీలను జగన్ వైకాపా కార్యాలయాలుగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని హితవుపలికారు. సూపరింటెండెంట్ నాగభూషణం స్పందన వీడియో ను తన ట్విట్టర్కు లోకేష్ జత చేశారు.

*పనిగట్టుకొని ప్రచారం.. పవన్‌ పార్టీ మారతారా? – బాలినేని
తాను జనసేనలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్కు స్పందించానని చెప్పారు.తాను జనసేన పార్టీలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే.. పార్టీ కేడర్‌ మధ్య కొంత సమన్వయ లోపం ఉందని.. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.బాలినేని శ్రీనివాసరెడ్డిదీన్ని వక్రీకరించి.. తాను జనసేనలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. చేనేత వస్త్రాల విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించి.. చేనేత వస్త్రాలు ధరించానన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలోగానీ.. ఇప్పుడు జగన్ రెడ్డి హయంలోగానీ.. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్‌ ట్వీట్కు సమాధానం ఇచ్చానని చెప్పారు. దీనికి తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ను పవన్‌ స్వీకరించారని.. అంతమాత్రాన పవన్‌ పార్టీ మారతారని అనుకోవాలా? అని బాలినేని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖరరెడ్డి అని.. తాను ఎప్పుడూ వైఎస్‌ఆర్ పార్టీలోనే ఉంటానని.. జగన్ వెంట నడుస్తానని తేల్పిచెప్పారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు.

*జనసేనతో టచ్‌లో లేను.. అది దుష్ప్రచారమే : మాజీ మంత్రి బాలినేని
చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వైసీపీ మాజీ మంత్రికి చేసిన ట్విట్‌ ఏపీలో రాజకీయం దుమారం రేపుతుంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ విసిరిన చేనేత సవాలును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్వీకరిస్తూ రీట్విట్‌ చేశారు. దీంతో బాలినేని పార్టీ మారుతున్నాడని ప్రచారం వస్తుండడంతో తీవ్రంగా ఖండించారు. తాను జనసేన పార్టీతో టచ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్షతో ఎమ్మెల్యేను అయ్యానని, వైఎస్సార్‌సీపీ వీడేది లేదని, రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే నడుస్తానని వెల్లడించారు. జగన్‌ తనకు అప్పగించిన పనిని నెరవేర్చడంలో నిమగ్నమయ్యాయని, పారీ సమన్వయం కోసం కష్టపడుతున్నానని తెలిపారు. ఇటీవల గిద్దలూరులో వైసీపీ సమావేశం పెడితే జనసేనకోసమే సమావేశం పెట్టానని వక్రీకరించారని ఆరోపించారు.చేనేతల కోసం గతంలో చాలా కార్యక్రమాలు చేశామని , గతంలో మాదిరిగానే ఇప్పుడూ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తాను ఊసరవెళ్లి రాజకీయాలు చేయనని వెల్లడించారు. తనకు ఎన్ని కష్టాలున్నా జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్ తో మాట్లాడుతానని బాలినేని పేర్కొన్నారు.

*నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ
ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకున్న బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని బీజేపీ ఆరోపించింది. ఆర్‌జేడీతో తాజాగా పొత్తు పెట్టుకోవడం ద్వారా బిహార్‌ను అశాంతి, అవినీతి అగాథంలోకి నితీశ్‌ నెట్టివేస్తున్నారని విమర్శించింది. వేగంగా మారిన సమీకరణాల నేపథ్యంలో మంగళవారం పట్నాలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది.నితీశ్‌ నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లాల్లో మహాధర్నాలు చేపడతామని, బుధవారం బ్లాక్‌ స్థాయిలో నిరసనలకు దిగుతామని అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది.

*వైసీపీ కార్యాలయాలుగా యూనివర్సిటీలు: లోకేష్
యూనివర్సిటీలను జగన్ రెడ్డి వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్విమర్శలు గుప్పించారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బిసి ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతుందన్నారు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. వైసీపీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలని లోకేష్ హితవుపలికారు.

*కేసీఆర్‌కే కాదు.. మాకూ ఉపాయం ఉంది: ఈటల
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ 5 నిమిషాల్లో ఆమోదించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో పల్లెగోస- బీజేపీ భరోసా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. వారంతా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాజీనామా చేస్తున్నవారందరిదీ బీజేపీ దారే అన్నారు. కేసీఆర్‌కే కాదు.. తమకూ ఉపాయం ఉందన్నారు. మునుగోడులో మా స్ట్రాటజీని కేసీఆర్‌కు చూపిస్తామన్నారు. కేసీఆర్ హామీలు ఎన్నికలు జరిగే దగ్గరే అమలవుతాయన్నారు.

*రైతుల కష్టాలు పట్టవా కేసీఆర్?
బీజేపీ(BJP) నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటల బీమా, వాతావరణ ఆధారిత బీమా గత మూడేళ్లుగా అమలు కావడం లేదని, అన్నదాతల కష్టాలు కేసీఆర్‌ (CM KCR)కు పట్టడం లేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

*మంత్రులు కాదు.. జనాభా లెక్కలు కావాలి: జాజుల
బీసీలకు 27 మంత్రి పదవులు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పుకోవడం కాదని.. దేశంలో బీసీల జనాభా లెక్కలు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి ఆయన ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీల జనాభా లెక్కలు తీసి దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు

*కేసీఆర్‌కే కాదు.. మాకూ ఉపాయం ఉంది: ఈటల
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ 5 నిమిషాల్లో ఆమోదించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో పల్లెగోస- బీజేపీ భరోసా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. వారంతా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాజీనామా చేస్తున్నవారందరిదీ బీజేపీ దారే అన్నారు. కేసీఆర్‌కే కాదు.. తమకూ ఉపాయం ఉందన్నారు. మునుగోడులో మా స్ట్రాటజీని కేసీఆర్‌కు చూపిస్తామన్నారు. కేసీఆర్ హామీలు ఎన్నికలు జరిగే దగ్గరే అమలవుతాయన్నారు.

*జీఎస్టీతో ప్రజలపై పెనుభారం: రామకృష్ణ
‘‘దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడం వల్ల సామాన్యులకు చేనేత దూరమయ్యే ప్రమాదం ఉంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా అతి చిన్న వస్తువులైన పెన్సిళ్లు, రబ్బర్లపై కూడా కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడం విచారకరం. చివరికి పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధించి దేశ ప్రజలపై పెనుభారాన్ని మోపారు’’ అని సీపీఐ మండిపడింది. చేనేత సహా ప్రజోపయోగ ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, దేశీయ ఉత్పత్తి రంగాలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కాగా.. రాష్ట్రంలో టమోటా రైతులతోపాటు నష్టపోతున్న ఇతర రైతులనూ ఆదుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు.

*వలంటీర్లే జగన్‌ పోలీసులు: సోము వీర్రాజు
‘‘జగన్‌ ప్రభుత్వానికి వలంటీర్లే పోలీసులు. వీరిని అడ్డం పెట్టుకొని ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. తమకు వేయరని అనుకునే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో యువ సంఘర్షణ యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది తోలు మందం ప్రభుత్వం. జగన్‌ తోలును మెత్తపర్చాలని వర్షంలో సైతం బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర చేపడుతోంది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా 22న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం’’ అని వీర్రాజు అన్నారు

*సకాలంలో సాగునీరు అందించాలి: మాజీ మంత్రి పరిటాల సునీత
ప్రాజెక్టుల్లోని నీటిని సాగుకు సరైన సమయంలో విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఏ పంటలు సాగుచేస్తే లాభదాయకమో వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని సూచించారు. జలాశయాలు నిండిన క్రమంలో సకాలంలో సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి, వెంకటాపురం గ్రామాల్లోని తన సొంత పొలంలో మంగళవారం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో కలసి వరినాట్లు వేశారు. టమాటా తోటలో కాయలు తొలగించి, మలి కాపునకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో పెద్ద ఎత్తున టమాటా సాగు చేశారని, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు వాటిని రోడ్లపై పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఏ పంటలు సాగుచేస్తే లాభదాయకమో వ్యవసాయ అధికారులు సూచనలు చేయాలని సూచించారు.

*రైతుల కష్టాలు పట్టవా కేసీఆర్ ?: విజయశాంతి
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటల బీమా, వాతావరణ ఆధారిత బీమా గత మూడేళ్లుగా అమలు కావడం లేదని, అన్నదాతల కష్టాలు కేసీఆర్‌ కు పట్టడం లేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

*మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం: డీకే అరుణ
త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP) లో అనేక మంది నాయకులు చేరుతున్నారని, ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గెలిచే గుర్రాలకే పార్టీ టికెట్‌ ఇస్తుందన్నామని తెలిపారు. హెలీకాప్టర్‌లో తిరిగే మంత్రి కేటీఆర్‌ (KTR) కార్లలో తిరిగితే రోడ్ల దుస్థితి తెలుస్తుందని అన్నారు. ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్‌ (CM KCR) కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చినపుడే కేసీఆర్‌కు పింఛన్లు, దళితబంధులు గుర్తుకు వస్తాయన్నారు. వర్షాలతో ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రకు ఆటంకాలు వస్తున్నా మున్ముందు ఈ యాత్రను కొనసాగిస్తామని అరుణ ప్రకటించారు

*మునుగోడు మాకు సెమీ ఫైనల్స్: జీవన్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్ అని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తృప్తిగానే ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎవరి సొంతం కాదని, పార్టీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పేరు, ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు.

*పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో…: భట్టి
పేరు ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో మేము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తామే కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ కోటను తామే నిలబెట్టామన్నారు. అలాంటి తమపై తప్పుడు కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

*మరో క్విట్‌ ఇండియా ఉద్యమం అవసరం: రాహుల్‌
కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం వంటి ‘డూ ఆర్‌ డై’ ఉద్యమం అవసరమని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా రాహుల్‌ ఫేస్‌బుక్‌లో హిందీలో ఓ పోస్ట్‌ పెట్టారు. నేడు నియంతృత్వ ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడడానికి క్విట్‌ ఇండియా ఉద్యమం వంటి ఓ ‘డూ ఆర్‌ డె’ౖ ఉద్యమం అవసరమని, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాటిని దేశం నుంచి తరిమేయాలన్నారు. ఈ రోజు క్విట్‌ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం సందర్భంగా, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

* డెబ్బై ఐదు మందితో.. డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర: భట్టి
కాంగ్రెస్పా ర్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా, కూసుమంచిలో పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ పేరుతో పాదయాత్ర చేపట్టామన్నారు. పాదయాత్ర డెబ్బై ఐదు మందితో డెబ్బై ఐదు కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. యాత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళ త్యాగాలను ప్రజలకు వివరిస్తూ… వాళ్ళను సన్మానిస్తూ పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా నాయకత్వం పాల్గొంది.

*హర్ ఘర్ తిరంగా”… ఘర్ ఘర్ తిరంగా అవ్వాలి: బండి సంజయ్చౌ
టుప్పల్లో క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా “హర్ ఘర్ తిరంగా” ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని “హర్ ఘర్ తిరంగా” ఘర్ ఘర్ తిరంగా అవ్వాలన్నారు. జాతీయ జెండా గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలని, ఈ నెల 13న ప్రజలందరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపుచ్చారు. 14న ఆయా ప్రాంతంలో ఉన్న దేశ భక్తుల విగ్రహాలను శుభ్రపరచాలన్నారు. ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఒక్క కుటుంబంతో స్వాతంత్ర్యం రాలేదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్యంమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

*గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
గాంధీజీ మార్గం మనందరికీ ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జనగామ పట్టణంలోని దేవీ థియేటర్‌లో గాంధీ చలనచిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఆపై చిన్నారులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి సినిమా చూశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ మన జాతి పిత అని అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని తెలిపారు. పిల్లలు ఆయన జీవితాన్ని చదివి, ఇలా సినిమా రూపంలో చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్ (CM KCR) గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

*టీఆర్ఎస్, బీజేపీ అనైతిక పాలన చేస్తున్నాయి: మహేష్ గౌడ్ఆ
నాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటీష్ వారు పాలించారని… ఈనాడు వెస్ట్ ఇండియా కంపెనీలతో మోదీ దేశాన్ని పాలిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా దినోత్సవంలో భాగంగా మహేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (TRS), బీజేపీ(BJP) అనైతిక పాలన చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఎమ్మేల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో వెస్ట్ ఇండియా కంపెనీ పాలన చేస్తున్న మోదీని.. రాష్ట్రంలో కేసీఆర్‌ను పారద్రోలాలని అన్నారు. క్విట్ బీజేపీ, క్విట్ టీఎర్ఎస్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో ఒకరు, ప్రాంతం పేరుతో ఒకరు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని… వారిని గద్దె దించడానికి కాంగ్రెస్ మరో ఉద్యమానికి సిద్దం కావాలని మహేష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ , రోహిన్ రెడ్డి , కుమార్ రావు , నిరంజన్ , నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు

*పుదుచ్చేరిలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న తమిళిసై: ప్రతిపక్ష నేత ఆర్‌ శివ
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్ష నేత ఆర్‌. శివ ఆరోపించారు. రాజ్‌భవన్‌ రాజకీయాలకు వేదికగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఎన్‌ రంగస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌లా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సూచించారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నల్లఅంగీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. లెఫ్టినెట్‌ గవర్నర్‌ తమిళిసైకి ప్రసంగిస్తుండగా.. సభనుంచి వాకౌట్‌ చేశారు.