Politics

‘మోడీ నాతొ ఏమి మాట్లాడారంటే?’- చంద్రబాబు

‘మోడీ  నాతొ ఏమి మాట్లాడారంటే?’- చంద్రబాబు

ప్రధాని మోదీనే నా దగ్గరకు వచ్చారు – ఏం మాట్లాడారంటే : వెల్లడించిన చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పలకరింపులు రాష్ట్రంలో రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. బీజేపీ – టీడీపీ మరోసారి కలుస్తున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే, ప్రధాని కేంద్రం ఆహ్వానించిన ప్రముఖులు అందరినీ పలకరించారని..ఆ క్రమంలోనే చంద్రబాబుతోనూ మర్యాద పూర్వకంగా పలకరింపులు జరిగాయని మరో వాదన. ఈ సమయంలో అసలు ఆ సమయంలో ఏం జరిగిందీ.. ప్రధాని ఏం మాట్లాడారనేది స్వయంగా చంద్రబాబు వెల్లడించారు.

ప్రధాని తన వద్దకు వచ్చారంటూ
ప్రధాని – చంద్రబాబు పలకరింపుల పైన వైసీపీ నేతలు స్పందించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ నేతలకు ఆ పలకరింపుల సమయంలో ఏం జరిగిందో వివరించారు. తాను కేంద్రం ఆహ్వానం మేరకే ఆ సమావేశానికి వెల్లానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి భవన్ లో ఆ కార్యక్రమ సమయంలో తాను ఇరుతలతో మాట్లాడుతున్న సమయంలో..ప్రధాని కార్యక్రమానికి హాజరైన ఒక్కొక్కరినీ పలకరిస్తూ తన వద్దకు వచ్చారని వివరించారు ప్రధాని తన వద్దకు రాగానే..మనం కలిసి చాలా రోజులైందని..ఢిల్లీకి రావటం లేదా అంటూ ప్రశ్నించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనికి తాను స్పందిస్తూ..ఢిల్లీలో తనకు పనేమీ లేదని, రావటం లేదని చెప్పానన్నారు

మరోసారి కలవాలన్నారు
దీంతో..మీతో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి.. మరోసారి మనం కలవాలని అన్నారని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. దీంతో తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని ప్రధానితో చెప్పినట్లు వెల్లడించారు. దీనికి స్పందించిన ప్రధాని ఢిల్లీకి వీలు చూసుకొని రావాలని, వచ్చే ముందు తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని..తనకు వీలుగా ఉండే సమయం చెబుతానని ఆయనే చెప్పారంటూ చంద్రబాబు వివరించారు. దీనికి తాను సరే అన్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. ఆ సమయంలోనే ఇద్దరి ఆరోగ్యం..కుశల ప్రశ్నలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ప్రధాని – చంద్రబాబు మధ్య కొన్ని నిమిషాల పాటే మాటలు జరిగినా, రాజకీయంగా అది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకంపనల కు కారణమైందంటూ పార్టీ నేతలు టీడీపీ అధినేతతో చెప్పారు

నెలఖారులో మరోసారి ఢిల్లీకి
దీనికి చంద్రబాబు కేవలం నవ్వుతో సరిపెట్టారు. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యల గురించి చర్చ జరిగింది. ప్రధాని – చంద్రబాబు పలకరింపుల తో ఆ పార్టీలో భయం మొత్తం సజ్జల మాటల్లోనే కనిపించిందని పార్టీ నేతలు చంద్రబాబుతో వ్యాక్యానించారు. జగన్‌రెడ్డిని ప్రధాని గంటసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని సజ్జల చెప్పారని, అయితే..ఆ భేటీ ద్వారా రాష్ట్రానికి ఏం జరిగిందో మాత్రం చెప్పలేదని మరి కొందరు నేతలు పోలిట్ బ్యూరో సమావేశం సందర్బంలో వ్యాఖ్యానించారు.

అయితే, ప్రధాని సమయం తీసుకొని మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని, ఈ నెల 15వ తేదీ తరురువా టీడీపీ అధినేత సమయం కోసం ప్రయత్నించే ఛాన్స్ ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయ పడుతున్నారు.