DailyDose

7.3% భారతీయుల వద్ద డిజిటల్‌ కరెన్సీలు

7.3% భారతీయుల వద్ద డిజిటల్‌ కరెన్సీలు

గత ఏడాది భారత జనాభాలో 7.3 శాతం మంది డిజిటల్‌ కరెన్సీలు కలిగి ఉన్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) తాజా నివేదిక వెల్లడించింది. క్రిప్టో కరెన్సీలు వినియోగిస్తున్న జనాభాపరంగా భారత్‌ ఏడో స్థానంలో నిలిచిందని నివేదిక తెలిపింది. 12.7 శాతం జనాభాతో ఉక్రెయిన్‌ అగ్రస్థానంలో ఉండ గా.. రష్యా (11.9 శాతం), వెనిజులా (10.3 శాతం), సింగపూర్‌ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), అమెరికా (8.3 శాతం) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. కరోనా సంక్షోభ కాలంలో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోల వినియోగం అసాధారణ స్థాయిలో పెరిగిందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగమైన యూఎన్‌సీటీఏడీ నివేదిక పేర్కొంది. క్రిప్టోలు వినియోగించే జనాభా పరంగా టాప్‌-20 దేశాల్లో 15 వర్థమాన ఆర్థిక వ్యవస్థలే కావడం గమనార్హం.