DailyDose

కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం?- TNI నేటి నేర వార్తలు

కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం?- TNI   నేటి నేర వార్తలు

*అన్నమయ్య జిల్లా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ అత్త.. తన కోడలి తల నరకడం సంచలనంగా మారింది. అనంతరం తలపట్టుకుని పోలీసు స్టేష్టన్‌కుఉ వెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. కత్తితో తన కోడలి తల నరికింది. అనంతరం వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కాగా, కవర్‌లో ఉన్న వసుంధర తలను చూసి పోలీసులు షాకయ్యారు.ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాల ప్రకారం.. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో, ఆమె పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం.

*మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా రూ.58 కోట్ల నగదు, 38 కిలోల బంగారం, వజ్రాభరణాలు, ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు గుర్తించారు. మొత్తంగా రూ.390 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

*ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో.. ప్రమాద వశాత్తూ మున్నేరు కాలువలోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో ఆటోను తప్పించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. వేమవరం నుంచి పెనుగంచిప్రోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

*శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం గుడదహళ్ళిలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతిచెందారు. గుడదహళ్లికి చెందిన రాజు అనే వ్యక్తికి హరీష్, భరత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 8, చిన్న కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. మంగళవారం పశువులను మేతకు తీసుకెళ్లిన చిన్నారులు.. పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. ఈ ఉదయం కుంట నుంచి మృతదేహాలు బయటికి తేలాయి. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.

* యూపీలోని బందా జిల్లాలో దారుణం జ‌రిగింది. య‌మునా న‌దిలో గురువారం ప‌డ‌వ బోల్తా ప‌డ‌టంతో 20 మంది మ‌ర‌ణించారు. ప‌డ‌వ బోల్తా ప‌డిన స‌మ‌యంలో అందులో దాదాపు 40 మంది ప్ర‌యాణిస్తున్నారు.
ప్ర‌యాణీక‌యులు న‌దిని దాటి ఫ‌తేపూర్ చేరుకునేందుకు ప‌డ‌వ‌లో వెళుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌హాయ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని అధికారులు తెలిపారు.

*బాలికతో సహా నలుగురు కుటుంబ సభ్యులను భార్యాభర్తలు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా సమీపంలో ఈ దారుణం జరిగింది. దేబ్రాజ్ ఘోష్, అతడి సోదరుడు దేబాసిస్ ఘోష్ కలిసి హౌరాలోని పూర్వీకులకు చెందిన రెండస్తుల మేడలో తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. అయితే ఆస్తుల విషయంపై ఈ రెండు కుటుంబాల మధ్య తరచుగా గొడవ జరిగేది.కాగా, బుధవారం కూడా ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తాగు నీరు పట్టుకునే విషయంపై పల్లవి, రేఖ మధ్య గొడవ మొదలైంది. ఇది రెండు కుటుంబాల మధ్య కోట్లాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో దేబ్రాజ్ ఘోష్, అతడి భార్య పల్లవి కలిసి దేబాసిస్ ఘోష్, అతడి భార్య రేఖ, వారి 13 ఏళ్ల కుమార్తెతోపాటు తల్లిపై కత్తితో దాడి చేశారు. కత్తి పోట్ల వల్ల తీవ్రంగా గాయపడిన వారంతా రక్తం మడుగుల్లో పడి మరణించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పల్లవిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న దేబ్రాజ్‌ ఘెష్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

*ఉస్మానియా యూనివర్సిటీ మంజీరా హాస్టల్ మెస్‌లో వంట పని చేస్తున్న కవిత(45) కాంట్రాక్టు వర్కర్ పాముకాటు తో మృతి చెందింది. నిన్న విధి నిర్వహణలో ఓయూ మంజీరా హాస్టల్ మెస్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాముకాటుతో అస్వస్థతకు గురైన కవితను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కవిత మరణించింది. ఓయూ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షమే తన భార్య మృతికి కారణమని కవిత భర్త ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కవితకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

*హైదరాబాద్: నగరంలోని నాచారంలో ఆర్టీసీ బస్సు (RTC bus)కు పెను ప్రమాదం తప్పింది. ఈసీఐఎల్ నుంచి అప్జల్‌గంజ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద అకస్మాత్తుగా భారీ వృక్షం (Heavy tree) కూలింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు వృక్షాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

*మేడ్చల్: జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్‌పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి స్నేహితుల ద్వారా సంజీవరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి పలుమార్లు బ్యూటిసియన్‌పై సంజీవరెడ్డి అత్యాచారం చేశారు. బుధవారం యువతి పుట్టినరోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*హైదరాబాద్ నగర శివార్లలో డ్రగ్స్ (Drugs) ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా (Gang)ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తోంది. గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేసి.. ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*మానసిక స్థితి బాగోలేక బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ హృదయవిదారక ఘటన వివరాలు కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ నాయుడు కథనం మేరకు ఇలావున్నాయి. మండలంలోని తడిగిరి పంచాయతీ కేంద్రంలో అరిసేల వాసుదేవ్‌ భార్య రాధిక (30) మంగళవారం సాయంత్రం ఇంటిలో నాలుగు నెల చిన్నారిని చంపి తాను దూలానికి చీరతో ఉరివేసుకుని మృతి చెందింది.

*ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్‌ నియోజక వర్గం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లావణ్యగౌడ్‌ భర్త ప్రసాద్‌ గౌడ్‌ ఈ నెల 1వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసించే ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కత్తి, గన్‌ చూపించి బెదరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

*తన చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరులు దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సింగిదాస్‌ కృష్ణ (24) అదే గ్రామానికి చెందిన యువతి నందిని (17) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో మరింత దగ్గరయ్యారు.ఈ విషయం సదరు యువతి సోదరులు సింగిదాస్‌ మోహన్, సింగిదాస్‌ విజయ్‌కి తెలిసింది. కాగా, మంగళవారం రాత్రి మొహర్రం వేడుకల్లో అందరూ నిమగ్నమైన సమయంలో గ్రామశివారులోని మొక్కజొన్న చేనులో కలుసుకోవడానికి కృష్ణ, నందిని వెళ్లారు. ఇది గమనించిన ఆమె సోదరులు అక్కడకు చేరుకుని కృష్ణ కడుపులో కత్తితో పొడవడంతో పేగులు, అవయవాలు బయటకు వచ్చాయి. తనను ఎలాగైనా కాపాడాలని కృష్ణ వేడుకోవడంతో వారే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, వెంటనే చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ సమీపంలోని ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు.