NRI-NRT

విదేశీ విద్యార్థులకు బ్రిటన్ తీపి కబురు

Auto Draft

అంతర్జాతీయ విద్యార్థులకు (International student) బ్రిటన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. విదేశీ విద్యార్థులు లోకల్ పోలీసుల వద్ద తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలనే తప్పనిసరి నిబంధనను తాజాగా ఎత్తివేసింది. ఆరు నెలలకు మించి యూకేలో ఉండే అంతర్జాతీయ విద్యార్థులు తప్పనిసరిగా తాము నివాసం ఉంటున్న చోటు, చదువుతున్న విద్యాసంస్థ వివరాలతో స్థానిక పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండేది. దీనికి కొంత ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్‌ను ఆగస్టు 4న నుంచి బ్రిటన్ ఎత్తివేసింది. వెంటనే ఇది అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా హోం కార్యాలయం (Home Office) వెల్లడించింది. ఈ నిర్ణయం పోలీసులకు తమ వివరాలను సమర్పించిన ప్రస్తుత విద్యార్థులకు, యూకే వదిలి వెళ్లడానికి లేదా ఉండడానికి పోలీసుల వద్ద నమోదు చేసుకోవాల్సిన షరతు ఉన్నవారికి కూడా వర్తిస్తుందని అధికారికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హోంఆఫీస్ వెల్లడించింది. యూకే ప్రభుత్వం (UK Government) తీసుకున్న నిర్ణయంపట్ల విదేశీ విద్యార్థులతో పాటు విశ్వవిద్యాలయాలు హర్షం వ్యక్తం చేశాయి.