Movies

రహస్యాల్ని దాచను!

రహస్యాల్ని దాచను!

సినీ తారల ప్రేమ, పెళ్లి వ్యవహారల గురించి ఆరా తీయడం మానుకోవాలని, పర్సనల్‌ లైఫ్‌ గురించి పదేపదే ప్రశ్నలు అడగడం మంచిది కాదని హితవు పలికింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. విజయ్‌ దేవరకొండతో మీ అనుబంధం ఎలాంటిదనే ప్రశ్నకు రష్మిక మందన్న పై విధంగా స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంత సేపైనా మాట్లాడతా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండటం సహజమే. దానిని నేను తప్పుబట్టను కానీ పదేపదే అవే ప్రశ్నలు వేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో అభిమానులు పుకార్లను అస్సలు నమ్మొద్దు. నేను ఏ రహస్యాల్ని దాచను. ఏ విషయాన్ని అయినా నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పింది.