NRI-NRT

బ్రిటన్‌ పార్లమెంట్‌లో తొలి భారతీయుడు!

బ్రిటన్‌ పార్లమెంట్‌లో తొలి భారతీయుడు!

‘గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుచుకునే దాదాబాయి నౌరోజీ 1825, సెప్టెంబర్‌లో ముంబయిలో పార్శీ కుటుంబంలో జన్మించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన మొదటి భారతీయ సభ్యుడిగా పేరుపొందారు. ఎల్ఫిన్‌సన్‌ కళాశాలలో చదువుకున్నారు. నౌరోజి మొదట బరోడా సంస్థాన దివాన్‌.తర్వాత బొంబాయి నగర పాలక సంస్థ సభ్యునిగా రాజకీయ అనుభవం గడించారు. ఈయన కృషి ఫలితంగా 1873లో ప్రభుత్వం ఆర్థికస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది.భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్‌ని స్థాపించిన ఏఓ హ్యూవ్‌ుకు రాజకీయ గురువు. అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు మూడుసార్లు అధ్యక్షత వహించారు. ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’, ‘రాష్ట్ర గోఫ్తర్‌’ పత్రికలు నడిపారు. 1892 లో బ్రిటన్‌ పార్లమెంట్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు లిబరల్‌ పార్టీ అభ్యర్థ్ధిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన కృషి ఫలితంగానే 1895లో లార్డ్‌ వెల్బీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఐసీఎస్‌ పరీక్షలు బ్రిటన్‌, భారత్‌లో ఒకేసారి జరుపాలని బ్రిటిష్‌ ప్రభుత్వం 1893లో నిర్ణయించింది.