DailyDose

20న మునుగోడులో సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌ – TNI నేటి తాజా వార్తలు

20న మునుగోడులో సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌   – TNI  నేటి  తాజా వార్తలు

* మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్ర‌జా దీవెన స‌భ కోసం మునుగోడులో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వార్థం కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశార‌ని తెలిపారు. ఆత్మ‌గౌర‌వాన్ని బీజేపీ వ‌ద్ద తాక‌ట్టుపెట్టిన నీచుడు రాజ‌గోపాల్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ వైఖ‌రి దొంగే దొంగా అన్న‌ట్లుగా ఉంద‌న్నారు. ఎనిమిదేళ్లుగా ప్రజ‌ల‌కిచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసింది,ఇంకా చేస్తూనే ఉందని తెలిపారు. దేశ ద్రోహానికి పాల్పడుతున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని చెప్పారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ విజయం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండో స్థానానికి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. దేశ పరిస్థితుల దృష్ట్యా వామపక్షాలు టీఆర్ఎస్‌కే మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

*కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై వైసీపీ కౌన్సిలర్లు లేవనెత్తిన్న అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాజ్యానికి విచారణార్హత ఉందని తేల్చి చెప్పిం ది. ప్రధాన వ్యాజ్యం పై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎంపీ కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థా నం ఆదేశాలతో ఆయన ఓటు హక్కు నియోగించుకున్నారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. పిటిషన్‌కు విచారణార్హత లేదని, ఆ విషయంలో నిర్ణయం వెల్లడించిన తరువాతే ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరపాలని వైసీ పీ కౌన్సిలర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వ్యాజ్యం విచారణార్హతపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఎంపీ కేశినేని నాని వేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందని తేలుస్తూ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, చైర్మన్‌ ఎన్నిక ఫలితాల ప్రకటన ఇప్పటికీ పెండింగ్‌ లోనే ఉంది.

*తిరుపతి సమీపంలోని ఎ.రంగంపేట వద్ద మోహన్‌బాబు యూనివర్సిటీ పక్కన నిర్మించిన ఆలయంలో షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. గతంలో బాబా ఆలయాన్ని నిర్మించాలన్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రస్తుతం నిర్మించిన ఆలయం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలో బాబా చిరునవ్వుతో కనిపిస్తారని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని ఆయన కోరారు. ధ్యాన మందిరాన్ని అద్భుతంగా నిర్మించామని మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న తెలియజేశారు. కాగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి షిండే, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, మోహన్‌ బాబు తనయులు మనోజ్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

* శ్రీశైలం జలాశయాని కి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,35,149 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,39,037 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుతం 212.9198 టీఎంసీలగా కొనసాగుతోంది. అటు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

*జాతీయ జెండాకు అవమానం జరిగింది. 45వ డివిజన్ కార్పొరేటర్ మాధురీ లావణ్య ఆఫీసు ఎదుట జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. కార్పొరేటర్‌ మాధురీ లావణ్య తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జాతీయ జెండాను రివర్స్ చేసికట్టినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్‌ఘర్‌ తిరంగాలో భాగంగా కార్పొరేటర్ ఆఫీసు ఎదుట జెండాను ఏర్పాటు చేశారు.

*అనంతపురం: జిల్లాలోని జేఎన్టీయూను ముట్టడించేందుకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యత్నించారు. జేఎన్టీయూ గేట్ల పైకెక్కి యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జేఎన్టీయూ సూపరింటెండెంట్ ఎండీ నాగభూషణం పట్ల కక్ష సాధింపు ధోరణికి నిరసనగా వీసీ ఛాంబర్ ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెడ్ల రాజ్యంలో బీసీలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కులాల చిర్చు రేపితే ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి దారుణంగా ఉంటుందని వైసీపీ రెబల్ నాయకుడు సుబ్బారావు గుప్తా హెచ్చరించారు. గోరంట్ల న్యూడ్ వీడియో విషయంలో తప్పైపోయిందని ఒక్క మాట చెబితే సరిపోయేదని అన్నారు. ఎంపీగా పనిచేస్తే అందరూ దండం పెడతారని, వెధవ వేషాలు వేస్తే కుదరదని చెప్పారు. గోరంట్ల మాధవ్ ఢిల్లీలో భయంతో బతుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో గోరంట్లకు ఓటమి తప్పదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కు ఎంపీ గోరంట్ల క్షమాపణలు చెప్పాలని సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు.

*ఇక నుంచి ఇలా రోడ్ల పక్కన ఇళ్లను నిర్మించుకునేవారు ప్రస్తుతం వసూలు చేస్తున్న లైసెన్స్‌ ఫీజులు, ఇతర ఛార్జీలతో పాటు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
*నొయిడాలోని 40 అంతస్తుల సూపర్‌టెక్ ట్విన్‌ టవర్స్ కూల్చివేత గడువును సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. జంట టవర్ల కూల్చివేత సన్నాహాలకు సంబంధించిన స్థాయీ నివేదికను నొయిడా అధికారులు అత్యున్నత న్యాయస్థానానికి గురువారం సమర్పించారు. ఈ నేపథ్యంలో కూల్చివేత గడువు తేదీని ఈనెల 21 నుంచి 28వ తేదీకి సుప్రీంకోర్టు పొడిగించింది.

*సోషల్ మీడియా ప్రముఖులకు వేధింపులు తప్పడం లేదు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. గత కొంత కాలంగా శ్రీకాంత్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడంటూ నైనా జైశ్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రీకాంత్ ఇలాగే నైనా జైశ్వాల్‌‌ను వేధిస్తుండగా.. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ (Counseling) ఇచ్చి పంపించారు. అయినా తీరు మార్చుకోని శ్రీకాంత్.. ట్విట్టర్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి నైనా జైశ్వాల్‌‌ను వేధిస్తున్నాడు. దీంతో ఆమె తండ్రి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శ్రీకాంత్ కోసం దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
* పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్‌ హాల్‌ వద్ద డ్రోన్‌ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్‌ వద్ద డ్రోన్‌ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది దానిని కూల్చివేశారు. దానిని ఆపరేట్‌ చేస్తున్న ఇద్దరు బంగ్లా దేశీయులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు డ్రోన్‌ కెమెరా సాహాయంతో విక్టోరియా మెమోరియల్‌, దాని పరిసరాలను ఫొటోలు తీస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహికి చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. డ్రోన్‌ను ఎగురవేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు. రహస్యంగా ఫొటోలు తీయడం వెనుక కుట్ర ఏమైనా దాగిఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
* దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ కేఎన్‌వీ.ప్రసాదరావు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాసరావులు ఉన్నారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు వీరంతా సీఎం జగన్‌ను సన్మానించారు.
*నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన సెక్యూరిటీ, తనయుడిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని వేసిన రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. శుక్రవారం డిస్మిస్‌ చేసింది.
*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. అదే సమయంలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ సూచించారు.
*ప్రకాశం బ్యారేజి కి పోటెత్తింది వరదనీరునాగార్జున సాగర్ నుండి 4 లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు చేరుకుందిమరింత పెరగనున్న వరద నీటి ఉదృతి సాయంత్రానికి 5 లక్షల కూసెక్లకు పైగా రానునాన వరద
ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన అదికార యంత్రాంగం
*యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి గురువారం సాయంత్రం ఉభయ జోడు సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గరుడ వాహన సేవ, అమ్మవారికి తిరుచ్చి సేవ చేపట్టారు. రాత్రి 7 నుంచి 7:45 గంటల వరకు సాయంకాలపు ఆరాధన జరిగింది.ఆ తర్వాత స్వామివారికి సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారిని సుమా రు 10 వేల మంది దర్శించుకొన్నారు. శ్రావణమాసం సందర్భంగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఖజానాకు రూ.12,35,905 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు
స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ముస్లిం మైనారిటీ వర్గం నేతలను విస్మరించిందని కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కి ఆయన బహిరంగ లేఖ రాశారు. ముస్లింలపై సీఎం కేసీఆర్‌కి ఉన్న వివక్ష, ద్వేషం దీంతో స్పష్టమైందన్నారు.
*ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తల్లి, వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మికి గురువారం ప్రమాదం తప్పింది. ఓ వివాహానికి హాజరై అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కర్నూలు నగర సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్‌ చాకచక్యంతో కారును వెంటనే ఆపేయడంతో ప్రమాదం తప్పింది. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విజయలక్ష్మి కర్నూలు నగరంలోని ఓ డాక్టరు ఇంట్లో పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత అనంతపురంలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలు నగర సమీపంలోకి రాగానే రెండు టైర్లు ఒకేసారి పంక్చర్‌ అయ్యాయి. విజయలక్ష్మి స్థానిక పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని కారు సిద్ధం కాగానే హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.
* ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన వారందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. నైతిక విలువలుంటే ఉప ఎన్నికల్లో పోటీకి రావాలని పిలుపునిచ్చారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్‌ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వ్యాట్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.30 దోచుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించాలని ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతులకు రూ.లక్ష రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ వరి వేసి కోటీశ్వరుడయ్యాడని, అదే వరి పండించిన రైతులను బికారులను చేశాడని మండిపడ్డారు. తన ఫాంహౌ్‌సకు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ఖ ర్చు చేశాడన్నారు. ఇక్కడ రూ.700 కోట్లు ఖర్చు చేస్తే ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, పి ల్లాయిపల్లి కాలువలు పూర్తవుతాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలులో పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని, కేటీఆర్‌ అంటే సయ్యద్‌ మక్బూల్‌ అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్‌కు గుర్తుకొస్తాయన్నారు.
*మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌కు పోలీసు భద్రత కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ తదితరులకు సూచించింది. ఈడీ కేసు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ప్రవీణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లలిత ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్‌ దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని, వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
*తిరుపతి సమీపంలోని ఎ.రంగంపేట వద్ద మోహన్‌బాబు యూనివర్సిటీ పక్కన నిర్మించిన ఆలయంలో షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. 1975లో సినీ రంగ ప్రవేశం చేసిన తాను 1990లో షిర్డీ క్షేత్రాన్ని దర్శించానని తెలిపారు. ఆ తరువాతే వరుసగా 8 చిత్రాలు విజయవంతం అయ్యాయని గుర్తు చేసుకున్నారు. గతంలో బాబా ఆలయాన్ని నిర్మించాలన్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రస్తుతం నిర్మించిన ఆలయం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలో బాబా చిరునవ్వుతో కనిపిస్తారని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని ఆయన కోరారు.
*కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై వైసీపీ కౌన్సిలర్లు లేవనెత్తిన్న అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాజ్యానికి విచారణార్హత ఉందని తేల్చి చెప్పిం ది. ప్రధాన వ్యాజ్యం పై విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎంపీ కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థా నం ఆదేశాలతో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. పిటిషన్‌కు విచారణార్హత లేదని, ఆ విషయంలో నిర్ణయం వెల్లడించిన తరువాతే ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరపాలని వైసీ పీ కౌన్సిలర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వ్యాజ్యం విచారణార్హతపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఎంపీ కేశినేని నాని వేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందని తేలుస్తూ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, చైర్మన్‌ ఎన్నిక ఫలితాల ప్రకటన ఇప్పటికీ పెండింగ్‌ లోనే ఉంది.
* శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. గడిచిన 35 రోజుల్లో భక్తులు స్వామి, అమ్మవార్లకు హుండీ ద్వారా రూ.3,68,22,723 నగదు సమర్పించారు. 184.300 గ్రాముల బంగారం, 5.860 కిలోల వెండి కానుకలుగా లభించాయి.
*అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలపరిధిలోని వాడ నరసాపురం మత్స్యకార సహకార సంఘం మేనేజింగ్‌ కమిటీ ఎన్నికను సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. చేతులెత్తడం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌లో పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న జరగాల్సిన ఎన్నికలను చేతులెత్తే విధానంలో నిర్వహిస్తామని ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌లో పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ ఆ గ్రామానికి చెందిన సీహెచ్‌ ఆనందరావు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. సొసైటీలో 540 మంది సభ్యులు ఉన్నారని, 50మందికి మించితే బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలని చట్ట నిబంధల్లో స్పష్టంగా ఉందన్నారు.
*చదవటమే కాదు.. నేర్చుకున్న విజ్ఞానంతో మంచి ఉద్యోగం సాధించటమే అంతిమ లక్ష్యం కావాలని విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ వర్సిటీలో బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. రత్తయ్య ప్రసంగిస్తూ.. నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఎన్‌ఈపీ-2020ను అమలు చేస్తున్నామన్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు.
*దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అజాదీకా అమృత్‌ మహోత్సవాలను ఘనంగా జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుఇచ్చారు. ఆ తేదీల్లో ప్రతి టీడీపీ కార్యకర్త తమ ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేసి దేశభక్తిని, దేశంపై బాధ్యతను చాటాలని పేర్కొన్నారు. కాగా, 15న ఉదయం 8.30కు గుంటూరులో జరిగే వేడుకల్లో చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. గుంటూరులో కార్యక్రమానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ వాహనాలకు పార్టీ జెండాను కాకుండా జాతీయ జెండాలను మాత్రమే కట్టుకుని రావాలని బాబు ఓ ప్రకటనలో సూచించారు. కుటుంబ అనుబంధాలకు, ఆత్మీయతలకు రాఖీ ప్రతీక అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ గురువారం ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ స్ఫూర్తిగా సమాజంలోని ప్రతి ఆడపడుచుకు రక్షణగా నిలిచేందుకు, ఆమె గౌరవాన్ని కాపాడేందుకు అందరం సంకల్పిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.
*రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌కు సంబంధించి ఫీల్డ్‌లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది ప్రధాన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గురువారం విధులను బహిష్కరించారు. దీంతో పలు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగింది. తమ సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓను గతంలో రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేసింది. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో గురువారం అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. తమను ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలోకి తీసుకురావాలని, కేడర్‌, కనీస వేతనం, జీఓ నెం.28 సవరణ, పీహెచ్‌సీ మిత్రలను అక్కడే కొనసాగించాలని, నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని వారు ప్రభుత్వానికి పలు దఫాలు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
* రోడ్డు ప్రమాదంలో దూరమైన అక్కను.. నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆ తమ్ముడు పరితపించాడు. తోబుట్టువు విగ్రహాన్ని తయారు చేయించి.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆవిష్కరించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు రాజా సోదరి మణి గతంలో బైక్‌ ప్రమాదంలో మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తుండగా వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కుని ఆమె ప్రమాదం బారిన పడింది. ఆమె మృతిని జీర్ణించుకోలేని రాజా తన సోదరిలా ఎవరికీ జరగకూడదని సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహించాడు. అలాగే తన అక్కను నిత్యం కళ్లెదుటే చూసుకోవాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో శిల్పివద్ద ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కత్తిపూడిలో ఊరేగింపు నిర్వహించి తన సోదరి ఇంటి వద్దే విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
*కర్నూలు నగరంలో గురువారం జిల్లా పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. పాత కంట్రోల్‌ రూం నుంచి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన వాక్‌ను మేయర్‌ బీవై రామయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి బీ వెంకటేశ్వర్లు, సెట్కూర్‌ సీఈవో రమణ ప్రారంభించారు. కార్యక్రమంలో భారీసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
*స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం ఈ నెలలో రెండో శనివారం అన్ని పాఠశాలలు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇది అన్ని పాఠశాలల యాజమాన్యాలకూ వర్తిస్తుందన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2022-23కిగాను 5,6,7,8 తరగతుల్లో మైనార్టీ విద్యార్థులు తమ కేటగిరిలోని ఖాళీల్లో నేరుగా ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఏపీఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి నరసింహారావు ఉత్తర్వులు ఇచ్చారు. మైనార్టీ విద్యార్థులకు రికార్డు షీట్‌, టీసీ, క్యాస్ట్‌, ఇన్‌కం సర్టిఫికెట్లతో నేరుగా ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.
* రాజధాని అమరావతి నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్లు, ఆకృతులను రూపొందించిన లండన్‌కు చెందిన ఫోస్టర్‌ ప్లస్‌ పార్టనర్స్‌ లిమిటెడ్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాద పరిష్కారం, తనకు చెల్లించాల్సిన డబ్బు కోసం ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సిలియేషన్‌ చట్టం(1996)లోని సెక్షన్‌ 11 ప్రకారం అమరావతి మెట్రోపాలిటెన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ-ఏఎంఆర్‌డీఏ(ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ)కు నోటీసులు జారీ చేశామని, అయినా ఆ సంస్థ ఆర్బిట్రేషన్‌కు ముందుకు రాలేదని ఫోస్టర్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఏపీఎంఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
*ఆదర్శ పాఠశాలల్లో ఉద్యోగుల నియామక ప్రాతిపదిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇప్పటివరకూ అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న కొందరిని ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా కాంట్రాక్టులోకి మార్చడంపై ఆ పాఠశాలల్లోని ఇతర ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే… 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో ఉద్యోగుల భర్తీకి అప్పటి ప్రభుత్వం జీవో 254 జారీచేసింది. కొన్ని పోస్టులను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో, మరికొన్నింటిని అవుట్‌సోర్సింగ్‌ లేదా ‘కాంట్రాక్ట్‌ బేసి్‌స’లో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అప్పట్లో కేవలం అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికనే తీసుకున్నారు.
*ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించే ఫీల్డ్‌ అసిస్టెంట్లను గురువారం నుంచి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడం, కూలీల మస్టర్‌ జాబితా రాయడం, జాబ్‌కార్డులు ఉన్నవారంతా ఉపాధి పనులకు వచ్చేలా చూడడం వంటి విధులను నిర్వర్తించే ఫీల్డ్‌ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభు త్వం ఆకస్మికంగా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన 9,600 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేపట్టడం, ప్రభుత్వానికి వినతులివ్వడం వంటివి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
*ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో ‌జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస‌్తున్నారు. ప్రస్తుతం 4లక్షల 10 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. సముద్రంలోకి 3 లక్షల 97 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. పంట కాల్వలకు 13 వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో.. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
*న్యాయస్థానాల్లోని అందరూ విధిగా మాస్కులు ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎన్‌వీ రమణ సూచించారు. ‘‘దయచేసి మాస్కులు ధరించండి. ఇప్పటికే చాలామంది సిబ్బంది, న్యాయమూర్తులకు కరోనా సోకింది. ఇంకా కరోనా బారిన పడుతున్న వాళ్లూ ఉన్నారు’’ అని గురువారంనాడు విచారణ ప్రారంభానికి ముందు ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వికి కరోనా సోకిందని మరో సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా వెల్లడించడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని సీజేఐ ఆకాంక్షించారు.
*ఢిల్లీలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు నెల మొదలైనప్పటి నుంచి రోజుకు సగటున రెండు వేల కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఆగస్టు 1-10 మధ్యలో 19,760 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 17.83గా ఉండటం ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకొంది. ‘మాస్కు తప్పనిసరి’ నిబంధనను మళ్లీ అమల్లోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా విధిస్తామని గురువారం ప్రకటించింది.
*తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌ రాజీవ్ సాగ‌ర్‌తో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి సత్యవతి నివాసంలో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ..గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.