Politics

ప్ర‌ధాని రేసులో లేను..విప‌క్షాల ఐక్య‌తే కీల‌కం – TNI నేటి రాజకీయ వార్తలు

ప్ర‌ధాని రేసులో లేను..విప‌క్షాల ఐక్య‌తే కీల‌కం  –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లే ల‌క్ష్యంగా విప‌క్షాలు ఏక‌తాటిపైకి రావాల‌ని ఈ దిశ‌గా త‌న‌కు పెద్ద‌సంఖ్య‌లో ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. మ‌నమంతా ఏక‌మ‌వ్వాలి..ఈ దిశ‌గా తాను ముందుకెళుతున్నాన‌ని, అయితే ముందుగా బిహార్‌లో చక్క‌దిద్దాల్సివ‌ని ఎన్నో ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.త‌దుప‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాను ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేశాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను వ‌దంతులుగా తోసిపుచ్చారు. త‌న‌కు అలాంటి ఆలోచ‌న లేద‌ని విన‌మ్రంగా వెల్ల‌డిస్తున్నాన‌ని, అంద‌రికోసం ప‌నిచేయ‌డమే త‌న ప‌నని, విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగ ప‌నిచేసేలా చూస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. విపక్షాలు ఐక్యంగా ముందుకెళితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్నారు. నితీష్ ఇటీవ‌ల ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కువచ్చి ఆర్‌జేడీ సార‌ధ్యంలోని మ‌హాకూట‌మితో చేతులు క‌లిపి తిరిగి బిహార్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

*సజ్జల ఎందుకు మాట మార్చారు: ఆనంద్ బాబు
ఎంపీ గోరంట్ల మాధవ్చే సిన చిల్లర పనులను చూసి దేశం అసహ్యించుకుంటోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి డీజీపీని నివేదిక అడిగిందన్నారు. మాధవ్ నిస్సిగ్గుగా టీడీపీపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యునిగా ఉండటానికి అనర్హుడన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాడుకుంటున్నారని, ప్రభుత్వ వైఫల్యాలన్ని పక్కదోవ పట్టించారని విమర్శించారు. చరిత్రలో ఏ పార్లమెంటేరియన్ ఇలా ప్రవర్తించలేదన్నారు.

*లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు వెళ్లాలి: మంత్రి కేటీఆర్‌
యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు.

*బీజేపీతో నితీశ్‌ కటీఫ్‌… జేడీయూ మాజీ ఎంపీ టీఎంసీకి రాజీనామా
బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కి రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ మేరకు లేఖ రాశారు. ‘ప్రియమైన మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. నాకు లభించిన సాదర స్వాగతం, మీ ఆప్యాయత, మర్యాదలకు నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలతో పవన్ కె వర్మ’ అని శుక్రవారం ట్వీట్‌ చేశారు.

*బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌
దేశవ్యాప్తంగా రాజీకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీహార్‌లో బీజేపీకి హ్యాండ్‌ ఇస్తూ నితీష్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఇంతకు ముందు బీజేపీతో కలిసి ఉండటాన్ని ఇష్టపడని కొందరు నేతల జేడీయూను వీడారు. తాజాగా బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడంతో నేతలు మళ్లీ నితీష్‌ చెంతకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ శుక్రవారం.. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా.. ‘మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. మీ ఆప్యాయత, మర్యాదలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

*తృణమూల్ కాంగ్రెస్‌కి మాజీ ఎంపీ పవన్ వర్మ రాజీనామా
రాజ్యసభ మాజీ ఎంపీ కే.పవన్ వర్మ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. తన రాజీనామాను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి అందజేశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఆత్మీయ స్వాగతం పలికి అప్యాయత, మర్యాదులు చూపించారంటూ మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. రాజీనామాను ఆమోదించాలని విన్నవించారు. అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే రాజీనామాలకు గల కారణాలను వెల్లడించలేదు.కాగా కే.పవన్ వర్మ దౌత్యవేత్తగా దేశానికి సేవలు అందించారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో జేడీయూ తరుపున పనిచేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కి సలహాదారుగా పనిచేశారు. పలు కీలక నిర్ణయాల్లో పవన్ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత నవంబర్ 2021లోనే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పలు పుస్తకాలు కూడా రాశారు. 12కి పైగా పుస్తకాలు మార్కెట్‌లో చక్కగా అమ్ముడయ్యాయి. అంతేకాదు భూటాన్‌ అందించే అత్యున్నత పౌరపురస్కారం ‘డ్రుక్ తుక్సే అవార్డ్’ కూడా ఆయన స్వీకరించారు.

*బీసీలకు లక్ష కోట్లు కేటాయించండి: కృష్ణయ్య
దేశంలో బీసీల సామాజికాభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, కర్రీ వేణుమాధవ్‌తో కలిసి కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడుతూ రూ. 38 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ. 1400 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కాలర్‌షి్‌పనకు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కూడా ఇవ్వడం లేదని తెలిపారు.

*పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ రాజీనామా చేయించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన వారందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. నైతిక విలువలుంటే ఉప ఎన్నికల్లో పోటీకి రావాలని పిలుపునిచ్చారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్‌ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వ్యాట్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.30 దోచుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించాలని ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతులకు రూ.లక్ష రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ వరి వేసి కోటీశ్వరుడయ్యాడని, అదే వరి పండించిన రైతులను బికారులను చేశాడని మండిపడ్డారు. తన ఫాంహౌ్‌సకు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ఖ ర్చు చేశాడన్నారు. ఇక్కడ రూ.700 కోట్లు ఖర్చు చేస్తే ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, పి ల్లాయిపల్లి కాలువలు పూర్తవుతాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలులో పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని, కేటీఆర్‌ అంటే సయ్యద్‌ మక్బూల్‌ అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్‌కు గుర్తుకొస్తాయన్నారు.

*టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే: రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటే అని, ఇరు పార్టీల నేతల మధ్య ఒప్పందం లేకుండానే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను కేవలం 5 నిమిషాల వ్యవధిల్లోనే ఆమోదిస్తారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎ్‌సకు అవసరమైతే, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి అవసరమని, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ప్రతినిధుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ.. అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు అత్యంత పట్టుదలతో ఎన్నికలలో పని చేయాలని కోరారు. ఇక్కడ ఒక కేఏ పాల్‌ ఉండగా, తాజాగా ఆర్‌జీ పాల్‌ (రాజగోపాల్‌) వచ్చారని వ్యాఖ్యానించారు. మునుగోడులో అనుబంధ సంఘాల ప్రతినిధులు.. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలతో పాటు కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లిన వారికి బుద్థి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

*ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌దే విజయం : ఎంపీ ఉత్తమ్‌
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎ్‌సలను ఓడించేందుకు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రె్‌సకు మద్దతివ్వాలని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి 12 కిలోమీటర్ల పాదయాత్రను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య సంస్థల అభివృద్ధికి అద్భుతమైన కృషి చే సిన పార్టీలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, అవినీతి టీఆర్‌ఎ్‌సను ఓడించి, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న తీరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, సామాన్య ప్రజల, విద్యార్థుల బతుకులు అంధకారంగా మారాయన్నారు. రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించకపోవటం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. అంతకుముందు రేపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేపాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు వున్నం వెంకయ్యను ఘనంగా సత్కరించారు.

*జగనన్న విద్యా దగా: నిమ్మల రామానాయుడు
ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్నది జగనన్న విద్యా దీవెన కాదు.. దగా దీవెన అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఒక విద్యార్థికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపేసింది. ఆ విద్యార్థి రూ.4 వేలు కట్టుకునే స్థోమత లేక ఇనుప సామాన్ల అంగట్లో చేరాడు. ప్రభుత్వం అర్థంతరంగా రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేయడం వల్ల ఇటు ఇంజినీరింగ్‌ చదువుకోవడానికి, అటు బీఏ, బీఎస్సీ డిగ్రీలో చేరడానికి అవకాశం లేకుండా పోయిందని వాపోయాడు. తెల్లరేషన్‌కార్డు ఉన్న పేద విద్యార్థులు అర్హులు కాదంటూ పక్కనబెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

*విశాఖలో స్వామీజీకి ఎవరి సొమ్ము ఇస్తున్నారు?: శైలజానాథ్‌
దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ర్టాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి అమ్మేస్తున్నారని పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. ఆజాదీ కా గౌరవ యాత్రను ఆయన అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండల కేంద్రంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో… కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తుంటే… ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మేపనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. గ్రేటర్‌ విశాఖపై జగన్‌ కళ్లు పడటమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. విశాఖలో ఓ స్వామీజీకి 15 ఎకరాల భూమిని చదునుచేసి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. స్వామీజీకి ఎవరి సొమ్ము ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోదీ, జగన్మోహన్‌రెడ్డి పోలీసులు, ఈడీ, బీడీ, సీడీలతో పరిపాలన ఎన్నాళ్లో కొనసాగించలేరని అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. అప్పుడు దాక్కోవడానికి కూడా స్థలం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

*బీసీలకు లక్ష కోట్లు కేటాయించండి: కృష్ణయ్య
దేశంలో బీసీల సామాజికాభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, కర్రీ వేణుమాధవ్‌తో కలిసి కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడుతూ రూ. 38 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ. 1400 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కాలర్‌షి్‌పనకు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కూడా ఇవ్వడం లేదని తెలిపారు.

*కేసీఆర్‌ చిత్రపటానికి ఆడబిడ్డల అభ్యున్నతికి అనేక చర్యలు: కేటీఆర్‌
ఆడబిడ్డ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాంటి తెలంగాణ ఆడబిడ్డల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. రాఖీ పండగను పురస్కరించుకుని 33 జిల్లాలకు చెందిన ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో గురువారం ఆయన జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 14 లక్షల మంది ఒంటరి మహిళలు, వితంతువులతోపాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. గర్భిణుల కోసం ‘అమ్మ ఒడి’ పథకంలో భాగంగా ప్రత్యేకంగా 300 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 13.30 లక్షల మంది బాలింతలకు నగదు పారితోషికంతో పాటు కేసీఆర్‌ కిట్లు అందజేశామని తెలిపారు. కేసీఆర్‌ కిట్ల వల్ల సిజేరియన్లు తగ్గాయని, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 50 శాతానికి పెరిగాయని, మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వివరించారు.

*కేసీఆర్‌ చిత్రపటానికి ఆడబిడ్డల అభ్యున్నతికి అనేక చర్యలు: కేటీఆర్‌
ఆడబిడ్డ బాగుంటేనే కుటుంబం బాగుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాంటి తెలంగాణ ఆడబిడ్డల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. రాఖీ పండగను పురస్కరించుకుని 33 జిల్లాలకు చెందిన ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో గురువారం ఆయన జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 14 లక్షల మంది ఒంటరి మహిళలు, వితంతువులతోపాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. గర్భిణుల కోసం ‘అమ్మ ఒడి’ పథకంలో భాగంగా ప్రత్యేకంగా 300 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 13.30 లక్షల మంది బాలింతలకు నగదు పారితోషికంతో పాటు కేసీఆర్‌ కిట్లు అందజేశామని తెలిపారు. కేసీఆర్‌ కిట్ల వల్ల సిజేరియన్లు తగ్గాయని, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 50 శాతానికి పెరిగాయని, మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వివరించారు.

*అప్పుల కోసమే క్యాబినెట్‌ మీటింగ్‌: షర్మిల
అప్పులు ఎలా తెద్దామని క్యాబినెట్‌ మీటింగులు పెడుతున్నారని, కమీషన్లు మింగడానికే అప్పులు తెస్తున్నారని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం ఆమె కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి మండలంలోని హకీంపేట, సర్జఖాన్‌పేట, తోగాపూర్‌ గేటు, కోస్గి పట్టణాల్లో పాదయాత్ర నిర్వహించారు. కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. అనంతరం కోస్గి పట్టణంలో మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ భాగస్వామి అయిన బడా కాంట్రాక్టర్‌కే 80ు ప్రాజెక్టులిస్తున్నారని, వారికి దోచిపెట్టడానికే, ఇద్దరూ కలిసి కమీషన్లు మింగడానికే అప్పులు తెచ్చే ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు కమీషన్ల రూపంలో దోచుకుతింటుంటే ప్రశ్నించాల్సిన కాంగ్రెస్‌, బీజేపీ మిన్నకుండిపోయాయని విమర్శించారు.