DailyDose

జల్లికట్టులో విషాదం – TNI నేటి నేర వార్తలు

జల్లికట్టులో విషాదం –  TNI   నేటి నేర వార్తలు

*త్తూరు జిల్లాలోని గుడిపాల మండలంలోని సి బండపల్లిలో జరిగిన జల్లికట్టు (Jallikattu)లో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టులో ఎద్దులను నివారించే క్రమంలో ఎద్దు పొడవడంతో ఒకరు మృతి చెందగా… పలువురికి గాయాలయ్యాయి. విషాద అనంతరం జల్లికట్టును పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. ముట్టుకురుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ మందడి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

*భార్యను భర్త పిస్తోల్‌ కాల్చి హత్య చేసిన ఘటన కొడగు సోమవారపేట తాలూకా బెట్టళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కిషన్‌ అలియాస్‌ గోపాల్‌–చస్మా దంపతులు గొడవ పడ్డారు. ఆవేశంతో కిషన్‌ తన వద్ద ఉన్న పిస్తోల్‌తో చస్మాపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కుటుంబ విషయాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.

* మెక్సికోలోని జైలులో చోటుచేసుకున్న ముఠా తగాదా, అనంతర హింసాత్మక ఘటనల్లో 11 మంది మృతి చెందారు. నగర సరిహద్దులో ఉన్న జైలులో తొలుత ఓ ముఠా కొట్లాటకు దిగడంతో ఇద్దరు ఖైదీలు చనిపోయారు. విషయం బయటకు రావడంతో పక్కనే ఉన్న సివుదాద్‌ జువారెజ్‌లోని ముఠాలు రెచ్చిపోయి 9 మందిని హతమార్చాయి.

*కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న హమాలీల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ప్రాణహాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

* తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏట్లో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. సుద్దేపల్లిలో గ్రామంలో పాలేరు ఏటిపైనున్న చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి వద్ద గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

* కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అత్తిలి లో వివాహం చేసుకొని వరుడు నివాసానికి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌లో చిన్న ఆవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. క్షతగాత్రులు గాయత్రి (26), రేణుక(23), శివశంకర్(25), సీతారావమ్మ(47), శరత్(27)లుగా గుర్తించారు. అత్తిలిలో వధువు ఇంటి వద్ద వివాహం చేసుకొని హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* ఐరోపాలోని మాంటినిగ్రో దేశంలో ఓ వ్యక్తి (34) విచక్షణారహితంగా కాల్పులు జరిపి 11 మందిని పొట్టనపెట్టుకున్నాడు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతను కూడా మృతిచెందాడు. తొలుత కుటుంబంతో తగాదా పడిన దుండగుడు ఒక్కసారిగా రెచ్చిపోయి వీధిలోకి వచ్చి కనిపించిన వారందరిపైనా కాల్పులకు తెగబడ్డాడు. అప్పటికి వీధిలో చిన్నపిల్లలు సహా పలువురు ఉండగా.. వారిలో 11 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపడంతో మృతి చెందాడు. మాంటొనెగ్రో రాజధాని పొడొగ్రికాకు 36 కి.మీ.ల దూరంలోని సెంటెంజీ నగరంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

*విశాఖ రుషికొండ బీచ్‌ లో జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. నిన్న రుషికొండ తీరానికి ఓ యువకుడి మృతదేహాం చేరుకుంది. మృతుడు నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున యువతి మృతదేహాం రుషికొండ తీరానికి కొట్టుకువచ్చింది. మృతురాలు విజయనగరంకు చెందిన దివ్యగా గుర్తించారు. ఇద్దరు మృతి చెందడం వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. విలీన మండలాల ప్రజలు మూడు రోజులుగా వరద గుప్పెట్లోనే ఉండిపోయాయి. శబరి గోదావరి నదులు శాంతించని పరిస్థితి నెలకొంది. చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాలలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారుల పైకి వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ గ్రామాలు దీవులుగా మారాయి. అటు పునరాస శిబిరాలలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

*తనకు 30 ఏళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేయడం లేదన్న కోపంతో కన్న తండ్రిని పారతో కొట్టి చంపేశాడు ఓ ఉన్మాది. అడ్డు వచ్చిన బాబాయ్‌ని కూడా అదే పారతో అంతం చేశాడు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన అబ్బయ్య(62) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు సతీశ్‌ రెండేళ్ల క్రితమే దుబాయ్‌ నుంచి మోపాల్‌కు తిరిగొచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఖాళీగా తిరుగుతున్నాడు. అయితే పెద్ద కుమారుడు మోహన్‌కు దుబాయ్‌లో మంచి వేతనం ఉండడంతో ఐదేళ్ల క్రితమే అబ్బయ్య అతడి పెళ్లి చేశారు. అప్పటి నుంచి తనకు కూడా పెళ్లి చేయాలని సతీశ్‌ తండ్రిని వేధిస్తున్నాడు. అయితే సతీశ్‌ పనీ పాట లేకుండా ఖాళీగా ఉంటుండటంతో.. అతడికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తనకు ఎందుకు పెళ్లి చేయడం లేదని, సంబంధాలు ఎందుకు చూడడం లేదని నిత్యం తల్లిదండ్రులతో సతీశ్‌ గొడవ పడేవాడు. ఈ విషయంలో శుక్రవారం తెల్లవారుజామున కూడా తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేయాలని, లేకుంటే అంతు చూస్తానని తండ్రిని సతీశ్‌ బెదిరించాడు. పని చేసుకుంటేనే ఎవరైనా పిల్లను ఇస్తారని, లేకుంటే ఎవరిస్తారని అబ్బయ్య ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన సతీశ్‌ పక్కనే ఉన్న పారతో తండ్రిపై దాడి చేశాడు.

*స్వాతంత్య్ర వేడుకలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ తూర్పు జిల్లాలో 2251 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్టు శుక్రవారం అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జీత్‌ సింగ్‌ వెల్లడించారు. రెండు బ్యాగుల్లో వాటిని లఖ్‌నవూకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక క్రిమినల్‌ నెట్‌వర్క్‌ ప్రమేయం ఉందని , అనిల్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్ర ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం మీరట్‌ జైలులో ఉన్న అనిల్‌ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని ఓ గన్‌ హౌస్‌ నుంచి బుల్లెట్లను సమకూర్చినట్టు తెలిపారు. కాగా, కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్‌పై డ్రోన్‌ ఎగురవేసిన ఇద్దరు బంగ్లాదేశ్‌ జాతీయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విక్టోరియా మెమోరియల్‌, పరిసర ప్రాం తాల్లో ఫొటోలు తీసేందుకు డ్రోన్‌కు కెమెరాలు అమర్చినట్టు గుర్తించారు

*జమ్మూ కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతిలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం బండిపోర జిల్లాలో వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బిహర్‌కు చెందిన కార్మికుడు ముహమ్మద్‌ అమ్రె జ్‌(19) ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. ఇదే తరహాలో ఈ నెల 4, 5 తేదీల్లో ఇద్దరు బిహారీ వలస కార్మికులను ఉగ్రవాదులు చంపేశారు. అలాగే, గత ఐదు నెలల్లో తొమ్మిది మంది పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

*యూరప్‌ దేశం మోంటెనెగ్రోలో ఓ ఉన్మాది దారుణానికి తెగబడ్డాడు. ఇంట్లో కుటుంబసభ్యులతో తీవ్రంగా గొడవ పడ్డ ఓ 34 ఏళ్ల దుండగుడు.. రోడ్డు మీదకొచ్చి పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో.. ఏం జరిగిందో తెలిసేలోపే 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

*ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్‌ సురేంద్రను ఒక రౌడీ షీటర్‌ వెంటాడి వేటాడి నడిరోడ్డుపై హత్య చేసిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక సీఐని సస్పెన్షన్‌ చేయగా మరో సీఐతోపాటు, ఏఎస్సైను వీఆర్‌కు పంపారు.విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడంటూ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఎఎస్సై కృష్ణారెడ్డిలను వీఆర్కు పంపారు. రెండో పట్టణ సీఐ రమణను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదంటూ విపక్షాల విమర్శలకు తలొగ్గిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.

*రోడ్లపై ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేయడం మన వాళ్లకు అలవాటు. ప్రభుత్వం మూత్రశాలలు ఏర్పాటు చేసినా.. పాత అలవాటును పోనిచ్చుకోకుండా రోడ్డుపైనే చాలా మంది పని కానిచ్చేస్తున్నారు. ఇలా రోడ్డు వారగా ఓ ఇంటి గోడపై మూత్ర విసర్జన చేయడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. గోడపై మూత్రం పోస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు.. ఆ వ్యక్తిని పట్టపగలే అందరూ చూస్తుండగా దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ బిజీ మార్కెట్లో జరిగి కలకలం సృష్టించింది.

*చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా పలు ఇళ్లలోకి చొరబడి విలువైన అభరణాలతో పాటు నగదును దొంగి లిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు.