NRI-NRT

మహాకుంభాభిషేకానికి ముస్తాబైన వరసిద్ధుని ఆలయం 

మహాకుంభాభిషేకానికి ముస్తాబైన వరసిద్ధుని ఆలయం 

ప్రవాసాంధ్రులు గుత్తి కొండ శ్రీనివాస్, ఐకా రవిల భారీ విరాళంతో పునర్నిర్మాణం సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం వరసిద్ధుని వినాయక ఆలయం మహాకుంభాభిషేకానికి ముస్తాబయింది. ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవిలు ఇచ్చిన 10 కోట్ల రూపాయల భారీ విరాళంతో ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. సోమవారం నుండి పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు ప్రారంభం అవుతున్నాయి. 21వ తేదీన భారీ ఎత్తున మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.
IMG-20220814-WA0075
ఈ నెల 21న నిర్వహించనున్న చతుర్వేహ వన సహిత మహా కుంభాభిషేకానికి కాణిపాకం శ్రీవరసిద్దిస్వామి వినాయక సిద్ధమైన యాగశాల ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం నుంచి వారం రోజులు పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, చతుర్వేద పారాయణం, హవనం తదితర కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన యాగశాల నిర్మాణం పూర్తిచేసుకుంది. గతంలో అభిషేక సమయంలో స్వామివారి ఆలయంలోకి భక్తులను అనుమతించేవారు కాదు. నూతన ఆలయంలో అభిషేక సమయంలో భక్తులు దర్శనం చేసుకునేలా నిర్మించారు. కుంభాభిషేకం సహా బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని కోరుతూ ఆలయం తరుపున ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. రాజగోపురం, వెనుక గోపురాలకు పంచ వర్ణాలు వేశారు. కుంభాభి షేకానంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
IMG-20220814-WA0070
IMG-20220814-WA0073
IMG-20220814-WA0074