NRI-NRT

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం!

భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం!

అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమతికి యూఎన్ఏ (యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్)- యూఎస్ఏ 11వ యూత్ అబ్జర్వర్‌గా భారత సంతతికి చెందిన హిమజా నాగిరెడ్డి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ఏ-యూఎస్ఏ తాజాగా ప్రకటించింది. ఏడాదిపాటు హిమజ ఐక్యరాజ్య సమితి(UN)లో యూత్ అబ్జర్వర్‌గా పని చేస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలపై యువత తరఫున ఆమె తన గళాన్ని వినిపించటంతోపాటు.. వాటికి పరిష్కారాలను సూచిస్తారని పేర్కొంది.
దక్షిణ భారతదేశ మూలాలు కలిగిన హిమజా నాగిరెడ్డి.. జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)లో హెల్త్ ఈక్విటీ రీసెర్చ్ ఫెల్లో‌గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె ఎన్విరాన్‌మెంటల్ ఎపిడెమియాలజి విభాగంలో హర్వార్డ్ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. ఇదే సమయంలో 2021 ప్రెసిడెన్షియల్ పబ్లిక్ సర్విస్ ఫెల్లో‌గా సెలక్ట్ అయ్యారు. కాగా.. UNA-USA Youth Observer‌గా ఎంపిక కావడం అనేది హిమజా నాగిరెడ్డి చిరకాల స్వప్నం. ఈ క్రమంలో ఆమె సంతోషం వ్యక్తం చేస్తు్నారు