NRI-NRT

డాక్టర్ ముక్కామల ఔదార్యం.అనాథ యువతికి వివాహం.

Dr. Mukkamala Apparao Helps Orphan Vimala To Get Married

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు, దాత, డాక్టర్.ముక్కామల అప్పారావు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక అనాథ యువతికి తానే పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ వివాహం జరిపిస్తున్నారు. డాక్టర్ ముక్కామల అప్పారావు ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కాజా గ్రామంలో చిన్మయ విజయ పేరుతో చాలా సంవత్సరాల నుండి ఒక అనాథ్ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలో బాల్యము నుండి విమల అనే అనాథ బాలిక విద్యను అభ్యసిస్తోంది. విమలకు యుక్తవయస్సు రావటంతో ఆమెకు పెళ్లి చేసే బాధ్యతను డాక్టర్ అప్పారావు దంపతులు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆశ్రమం ఆవరణలో రమేష్ అనే యువకుడితో విమల వివాహం పెద్ద ఎత్తున నిర్వహించడానికి డాక్టర్ అప్పారావు ఏర్పాట్లు చేశారు. తమ సొంత కుమార్తె వివాహం లాగానే విమల వివాహం కూడా డాక్టర్ అప్పారావు దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి పత్రికలను రూపొందించి బంధువులు, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు. చిన్మయ మిషన్ కు చెందిన ప్రముఖ స్వామీజీలు ఈ పెళ్లి వేడుకలకు హాజరు అవుతున్నారు.
డాక్టర్ ముక్కామల ఔదార్యం.అనాథ యువతికి వివాహం.