DailyDose

ఏపీలో నూతన కోర్టులకు జస్టీస్ రమణ చేత.. – TNI – నేటి తాజా వార్తలు

ఏపీలో నూతన కోర్టులకు జస్టీస్ రమణ  చేత.. –  TNI  – నేటి  తాజా వార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో నూతన కోర్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. విజయవాడలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న కోర్టు స‌ముదాయాల‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.ఈ నెల 20న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్, ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్.. చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. నూతన భవనంలో ఇప్పటికే 6 అంతస్తులు పూర్తయ్యాయి. మిగతా ప్లోర్లు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొత్త కోర్టు భవనాలను 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది ప్రభుత్వం. నూతన భవనంలో మొత్తం 29 కోర్టులు ఏర్పాటవుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నూతన హైకోర్ట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం తాత్కాలిక భవనం నిర్మించింది. అందులోనే ఇప్పటి వరకూ కార్యకలాపాలు సాగాయి. ఇక నుంచి కొత్త బిల్డింగ్‌ నుంచి పనులు చేపట్టనుంచి ఏపీ హైకోర్ట్. అత్యాధునిక సాంకేతికత, హంగులతో కొత్త బిల్డింగ్ రూపుదిద్దుకుంది.

* ప‌రిపాల‌నా సౌల‌భ్యం – సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధుల‌తో వారి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ లు తెలిపారు.

* టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్‌. దీనిపై కొందరు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్‌ చేశారు. మూడో వ్యక్తి షూట్‌ చేసిన వీడియోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్‌ తీసుకున్నారు.

* బందోబస్తు, భద్రత కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్‌ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఏమరుపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఆడిటోరియంలో బుధవారం తొలి సన్నాహాక, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9న నిమజ్జనం చేయనున్నారు.

*అణచివేతపై తిరుగుబాటుచేసిన విప్లవవీరుడు సర్వాయి పాపన్న అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. గీతవృత్తిని నమ్ముకుని జీవిస్తూ సైనికుల ఆగడాలపై ఎదురుదాడి చేసిన ధీరుడన్నారు. సొంతంగా సైనిక బలగాన్ని ఏర్పరచుకుని జనగామ నుండి గోల్కొండ వరకు 20 కోటలను జయించాడని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అక్రమ శిస్తులను కొల్లగొట్టి పేదలకు పంచిన మానవతావాది సర్వాయి పాపన్న అని చెప్పారు.

*రాజకీయాలను వ్యాపారంగా మలచుకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ దిట్ట అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. వారికి ఏ పార్టీ కాంట్రాక్టులు ఇస్తే ఆ పార్టీలోకి వెళతారని ఆరోపించారు. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోదీ, అమిత్‌షాల వద్ద రాజగోపాల్‌రెడ్డి తాకట్టు పెట్టారన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, చౌటుప్పల్‌ మండలాల్లో ఆసరా పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేయాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ హక్కులను ఆంధ్రా రాజకీయ నేతల వద్ద వారు అమ్ముకున్నారని, నల్లగొండ జిల్లా ప్రజల నీటి వాటాను వైఎస్‌కి అమ్మిన ద్రోహులని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఖాళీ అయిందని తెలిసే బీజేపీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకే టీఆర్‌ఎస్‌ ఉప ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించిందని తెలిపారు. రాజీనామా చేసిన వారంతా తిరిగి టీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేశారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారే టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు.

*సత్రశాలలోని నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్ట్‌ 17 క్రస్ట్‌గేట్ల ద్వారా పులిచింతలకు బుధవారం 3,33,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువున ఉన్న సాగర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి 3,31,623 క్యూసెక్కుల నీరు వస్తోంది. రిజర్వాయర్‌లో 5.335 టీఎంసీల నీరు ఉంది

*మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్ దీక్ష భగ్నం చేశారు. అర్ధరాత్రి టీడీపీ ఎస్సీ సెల్ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రికి 11 మంది ఎస్సీ సెల్ నేతలను తరలించారు. రెండ్రోజులుగా చేస్తున్న దీక్షను మంగళగిరి పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు బలవంతంగా తరలించే క్రమంలో టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ నేతల డిమాండ్ చేస్తున్నారు. దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ మైనర్‌బాబు దీక్ష కొనసాగిస్తున్నారు.

*అమరావతి రాజధాని రైతులు మరో మహా పాదయాత్ర-కు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని రైతు జేఏసీ కమిటీలతో తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో గతేడాది తిరుపతి వరకు పాదయాత్ర చేసిన రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతోనైనా మూడు ముక్కలాటకు ప్రభుత్వం తెరదించుతుందనుకుంటే, అదే పాట పాడుతోందని, ఈ క్రమంలో మరో మహా పాదయాత్ర నిర్వహించాలని నాయకులు తీర్మానించారు. సెప్టెంబరు 12వ తేదీకి రైతుల ఉద్యమం 1000వ రోజుకు చేరుకుంటుందని, ఆ రోజే మహా పాదయాత్రను ప్రారంభించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అమరావతి నుంచి శ్రీకాళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. మూడు రాజధానులంటూ ఇంకా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించడం పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు.

*న్యూడ్‌ వీడియోలతో అడ్డంగా దొరికపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ని పార్టీ నుంచి సీఎం ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు నిలదీశారు. గతంలో అనేక మంది పార్లమెంట్‌ సభ్యులు తెలుగువారి ప్రతిష్ఠను నలుదిశలా వ్యాప్తి చేయగా, గోరంట్ల మాధవ్‌ ఏపీ పరువుని మంట గలిపారని మండిపడ్డారు.

* రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వైసీపీ నేతలకు ఏటీఎం మెషీన్లుగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికారులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై నకిలీ రైతులను నమోదు చేసి ఽధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే రూ.వందల కోట్లు కాజేశారని ఆరోపించారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు తీస్తే ఎన్ని రూ.వేల కోట్లు కాజేశారో తేలుతుందన్నారు. దాన్యం బస్తాపై రూ.200 వరకు కమీషన్‌ గుంజుతున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఆర్బీకేల్లో ఎరువులన్నీ దొరకవు. అధిక ధరలకు అమ్ముతారు. ధరల స్థిరీకరణకు రూ.3,000 కోట్లు, విపత్తులకు రూ.6,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వేటికీ దిక్కులేదు. ఆర్బీకే భవనాలకు అద్దెలు కూడా సరిగా చెల్లించరు’’ అని అచ్చెన్న విమర్శించారు.

* వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 754 ప్రొసీజర్‌లు రానున్నాయని, మొత్తం ఆరోగ్య శ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు అమలు కావాలన్నారు. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు అమల్లోకి రానున్నట్లు సీఎం వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ కార్యకలాపాలు మెడికల్ కాలేజీలోనే ఉండాలని సూచించారు.

*కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ-2-బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌) విచారణ సెప్టెంబరు 21, 22, 23 తేదీలకు వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ను ఖరారు చేయాలని కోరుతూ తెలంగాణ వేసిన అఫిడవిట్‌పై ఈ విచారణ జరగాల్సి ఉంది. దీనికి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పూర్వ డైరెక్టర్‌ చేతన్‌ పండిట్‌ను తెలంగాణ సాక్షిగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అంతరాష్ట్ర విభాగం సలహాదారుడు ఇటీవలే చనిపోవడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. విచారణ ప్రక్రియలపై కొత్త అధికారులకు అవగాహన పెరగడానికి కొంత గడువు అవసరమని, విచారణను వాయిదా వేయాలని ఏపీ చేసుకున్న విజ్ఙప్తితో బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణను వాయిదా వేసింది.

*నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత అన్నారు. ఆదివారం ఆమె జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 87మందికి రూ.32,23,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే రూ.కోటి 14లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.

*బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్‌దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి కూడా. రిజర్వు బ్యాంక్‌ రెపోరేటును అర శాతం పెంచడంతో అటు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్‌లు..మరోవైపు డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను సవరిస్తున్నాయి.

*అడవుల్లో వన్యమృగాల కదలికలు, స్మగ్లర్ల చొరబాట్లు, అడవుల్లో మంటలు చెలరేగడం, అడవుల్లో మూలమూలన ఎవరెవరూ సంచరిస్తున్నారనే సమాచారం క్షణాల్లో తెలుసుకొనేందుకు తెలంగాణ అటవీశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నది. వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల్లో ప్రతి కదలికను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ సంస్థ థింక్‌ ఎవాల్వ్‌ కన్సల్టెన్సీతో ఇటీవల ఒప్పందం చేసుకొన్నది. ఈ ఒప్పందం ద్వారా అడవుల్లోని మొత్తం జంతువుల సంఖ్యను లెక్కించడంతోపాటు వివిధ కారణాలతో గాయపడిన వన్యమృగాలను గుర్తించి, వాటికి తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

*సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
*త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని చెప్పారు. గాంధీజీ, చంద్రబోస్‌, అంబేద్కర్‌ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు.

*పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కి కరోనా సోకింది. ఆయన శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలుగా అనుమానం రావడంతో నమూనాలను పరీక్షలకు పంపారు. పరీక్షలో ఆయనకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రేవంత్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌ లో ఉన్నారు. కరోనా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారందరూ టెస్ట్ చేసుకోవాలని రేవంత్ సూచించారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా ఆయన వెల్లడించారు. టెస్ట్ రిపోర్ట్‌ను ట్విటర్‌లో వెల్లడించారు. నిన్నటి నుంచి కరోనా లక్షణాలు బయటపడడంతో ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పాదయాత్రను ఆయన రద్దు చేసుకున్నారు.

*చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలో నివాసముంటున్న చుండి కోటేశ్వరరావు (33) తన ఎలక్ర్టిక్‌ బైక్ (మ్యాక్‌ కంపెనీ)కు శనివారం రాత్రి తన ఇంట్లో చార్జింగ్‌ పెట్టాడు. అయితే చార్జింగ్‌ను చెక్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనంలోని బ్యాటరీ భారీ శ బ్దంతో పేలి మంటలు చెలరేగాయి. దీంతో కోటేశ్వర రావు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని వారు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.

*మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను విశ్లేషించి సీపీఎం మద్దతు ఎవరికివ్వాలో నిర్ణయించి ప్రకటిస్తామని వెల్లడించారు. ముసలిమడు గులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

*కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వస్తోంది. ఆదివారం సాయంత్రానికి జలాశయం నీటి మట్టం 404. 80 అడుగులకు చేరుకుంది. ఆళ్లపల్లి, మర్కోడు, గుండాల తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరదనీరు కిన్నెరసాని జలాశయానికి వస్తోంది. ఇన్‌ఫ్లో సైతం 14వేల క్యూసెక్కులుగా నమోదు కావడంతో అప్రమత్తమైన డ్యాం అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

*నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్వి చ్చలవిడిగా కొనసాగుతోందని టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ కు గతంలో ఫిర్యాదు చేశానన్నారు. అయినా అక్రమ మైనింగ్ ఆగడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అండతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తక్షణమే ఆపకపోతే టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు.

*కుమరం భీం మనవడు సోనేరావును ఢిల్లీలో ఆదివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సన్మానించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించింది. ఇందులో భాగంగానే తనను కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్‌ ఢిల్లీలో సన్మానించినట్లు కుమరం సోనేరావు ఫోన్‌లో తెలిపారు. కుమరం సోనేరావును కేంద్ర ప్రభుత్వం సన్మానించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* బహుజన్‌సమాజ్‌ పార్టీ(బీఎ్‌సపీ) అధికారంలోకి వస్తే ప్రవాస తెలంగాణ బిడ్డల కోసం బడ్జెట్‌లో ఏటా ప్రత్యేకంగా రూ.5000 కోట్ల నిధులు కేటాయిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. తద్వారా వారి ఉపాధి కల్పన, అభివృద్థి, సంక్షేమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. దుబాయ్‌ వేదికగా గల్ఫ్‌ కార్మికులతో జరిగిన బీఎస్పీ ఆత్మీయ అలయ్‌బలయ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్‌ కార్మికుల కోసం దుబాయి డిక్లరేషన్‌ను ఆయన ప్రకటించారు. వివిధ కారణాలతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రత్యేక వసతితో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన చదువును అందిస్తామని తెలిపారు.

*హైదరాబాద్ పోలీసులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సైబర్ దుండగులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు బీహార్ వెళ్లారు. బీహార్‌ లోని నవాడాలో దాడులు నిర్వహించారు. దీంతో పోలీసులపై సైబర్ ముఠా కాల్పులు జరిపింది. అయితే చాకచక్యంగా తప్పించుకుని నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ తప్పించుకున్నాడు. నిందితుల నుంచి కోటి 22 లక్షల 77 వేల రూపాయల నగదుతో పాటు 3 లగ్జరీ వాహనాలు, 5 స్మార్ట్ ఫోనులను స్వాధీనం చేసుకున్నారు.

* దేశంలోని 13 బంగారం గనులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ గనులు ఆంధ్రప్రదేశ్ (10), ఉత్తరప్రదేశ్ (3) రాష్ర్టాల్లోనే ఉన్నాయి. జాతీయోత్పత్తిలో (జీడీపీ) మైనింగ్‌ రంగం వాటా పెంచాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు.

*బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మెడిక్లెయిమ్‌ విభాగంలో తిరిగి ప్రవేశించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి స్పష్టత రాగానే తాము ఆ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నామని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. తాము ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణ, గ్యారంటీడ్‌ ఆరోగ్య ఉత్పత్తుల ను నిర్వహిస్తున్నామని, వీటి విషయంలో ఐఆర్‌డీఏఐ ఇటీవల చేసిన సూచనలు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ పాలసీలకు డిమాండ్‌ అధికంగా ఉంది. జీవితబీమా రంగంలోని కంపెనీలు నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య రక్షణ ప్లాన్లను ఉపసంహరించుకోవాలని 2016 సంవత్సరంలో ఐఆర్‌డీఏఐ సూచించింది. నష్టపరిహారం ఆధారిత ప్లాన్లలో అయితే పాలసీదారులు వైద్య చికిత్సల కోసం చేసిన వ్యయాన్ని బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఫిక్స్‌డ్‌ ప్రయోజన బీమా ప్లాన్లలో అయితే హామీ మొత్తంలో నిర్దేశిత మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తాయి. 2030నాటికి దేశ పౌరుల్లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యబీమా పాలసీ కలిగి ఉండాలనే ధ్యేయంతో జీవిత బీమా కంపెనీలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు అనుమతించనున్నట్టు ఐఆర్‌డీఏఐ కొత్త చైర్మన్‌ దేబాశిష్‌ పాండా ఇటీవల ప్రతిపాదించారు.

*రిజిస్ర్టేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ విభాగం సబ్‌ రిజిస్ర్టార్ల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా నల్లపాడు సబ్‌ రిజిస్ర్టార్‌ ఎ.గోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా విజయవాడ గుణదల సబ్‌ రిజిస్ర్టార్‌ ఎం.కృష్ణప్రసాద్‌, కోశాధికారిగా విశాఖ జిల్లా ఆనందపురం సబ్‌ రిజిస్ర్టార్‌ ఎన్‌.ఆనంద్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా ఎండీ అజీజుల్లా, ఉప కార్యదర్శిగా డీవీ నారాయణ ఎన్నికయ్యారు.

*దేశ రాజ్యాంగానికి ప్రమాదం రాబోతుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ అరాచకాలను అణచాలంటే పోరాటం చేయకతప్పదు. ఆ ప్రయత్నానికి సీపీఐ సిద్ధమవుతోంది’’ అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు ఆదివారం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడారు. ‘‘ఆజాదీ కా అమృతోత్సవంలో ఇంటింటికీ జెండా పేరుతో జాతీయ పతాకాన్ని వెలకట్టి అమ్మేశారు. 12 మందిని హత్యచేసిన అమిత్‌షా హోం మంత్రిగా ఉండడం సిగ్గుచేటు. క్రిమినల్స్‌ నాయకత్వంలో దేశం ఎటుపోతుందో వేరే చెప్పక్కర్లేదు’’ అని అన్నారు.

*నాలుగు సింహాలతో కూడిన జాతీయ ముద్రను తెనాలి శిల్పులు ఐరన్‌ స్ర్కాప్‌తో రూపొందించారు. పట్టణానికి చెందిన సూర్యశిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ జాతీయ చిహ్నానికి మెరుగులు దిద్దారు. పార్లమెంట్‌పై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి నాయకులు ఆర్డర్‌ ఇచ్చారని శిల్పులు తెలిపారు. రెండు టన్నుల ఐరన్‌ స్ర్కాప్‌తో 21 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు.

*స్వాతంత్య్ర సమరయోధుల ఉద్యమ ఘట్టాలను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బందరు లాకుల సెంటర్‌లో స్వాతంత్య్ర సమరయోధుల భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ 30 అడుగుల విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయని, వాటి స్ఫూర్తితో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు దేశ ప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
*శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని కళ్లేపల్లిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా స్టెప్పులేశారు. కళ్లేపల్లిలో సంప్రదాయ గురుకులంలో హంసధ్వని పేరిట మూడురోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో స్టేజీపై ‘చామంతి పువ్వా పువ్వా’ పాటకు ఆమె స్టెప్పులేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

*నాలుగు సింహాలతో కూడిన జాతీయ ముద్రను తెనాలి శిల్పులు ఐరన్‌ స్ర్కాప్‌తో రూపొందించారు. పట్టణానికి చెందిన సూర్యశిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ జాతీయ చిహ్నానికి మెరుగులు దిద్దారు. పార్లమెంట్‌పై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి నాయకులు ఆర్డర్‌ ఇచ్చారని శిల్పులు తెలిపారు. రెండు టన్నుల ఐరన్‌ స్ర్కాప్‌తో 21 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు.

*సీఎస్‌ సమీర్‌శర్మ కు పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం రూల్స్‌ అమలు కావట్లేదని విమర్శించారు. పథకాల వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో ఉండాలనేది శాసనమని, ఏపీ సర్కార్‌ సమాచారాన్ని అందుబాటులో ఉంచట్లేదని తప్పుబట్టారు. సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. నిబంధనలు పాటించాలన్న హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, తక్షణమే సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో ఉండేలా చూడాలని లేఖ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

*నెల్లూరు: జిల్లాలోని పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరులోనూ 2 సెకండ్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో భయంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు.

*ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాఫ్టో అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, సీహెచ్‌ మంజుల ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నెట్‌ సదుపాయం, డివైజ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల యాప్‌ల నిర్వహణ సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం చూడాలని కోరారు. జీవికే కిట్స్‌ పిల్లల అటెండెన్స్‌, బేస్‌లెన్‌ టెస్ట్‌ ఫలితాలు అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులను వేధించడం సరికాదని, అప్లోడ్ చేయని ఉపాధ్యాయులకు షోకాజ్‌‌లు ఇవ్వడం‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవికే కిట్స్‌ పిల్లల అటెండెన్స్‌, బేస్‌లెన్‌ టెస్ట్‌ ఫలితాలు అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులను వేధించడం సరికాదని, అప్లోడ్ చేయని ఉపాధ్యాయులకు షోకాజ్‌‌లు ఇవ్వడం‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా ఆలయ అధికారులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటలు సమయం పడుతోంది.

* ఇంద్రకీలాద్రి పై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. మూడ్రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసీ తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా.. అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆలయంలోని దేవతామూర్తులకు ధరింప చేసిన పవిత్రాలను ప్రజలు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మకమని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేదోక్తంగా గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌, ఆర్‌.శ్రీనివాసశాస్త్రి తదితరులు ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువచ్చారు. ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పవిత్రాల పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.

*తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు టీ.సుబ్బిరామిరెడ్డి , చింతా మోహన్ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ…. టీటీడీ పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి , ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అన్నారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

*రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టరుగా నాగరాణి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్‌ నియమితులయ్యారు. అలాగే ఎం. ఎం నాయక్‌కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశించారు.

* ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో ఉద్యోగ సంఘాలతో కూడ చర్చించనుంది. విధులకు గైర్హాజరు కావాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగుల డిమాండ్లపై వైద్యశాఖ సమావేశం ఏర్పాటు చేసింది.

*అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోలు/డీజిల్‌ ధరలు పెంచుకున్నట్లే ఇక కరెంట్‌ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు డిస్కమ్‌లకే స్వయంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్‌ ధరలు ఏ రోజుకు ఆరోజే పెరిగితే కరెంట్‌ చార్జీలు మాత్రం ఏ నెలకు ఆ నెల పెరగనున్నాయి. ఇందుకుగాను డిస్కంలకు వెసులుబాటు కల్పిస్తూ ‘ముసాయిదా విద్యుత్తు నిబంధనలు(సవరణ)-2022ను కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

*హైదరాబాద్‌కు చెందిన కేఎస్‌కే మహానంది పవర్‌ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన మొండి బాకీ(ఎన్‌పీఏ) పద్దును ఆదిత్య బిర్లా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఏఆర్‌సీ)కి రూ.1,622 కోట్లకు విక్రయించినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. తద్వారా బ్యాంక్‌కు రావాల్సిన మొత్తం బకాయిలో 42 శాతం వసూలైంది. ఎందుకంటే, ఎస్‌బీఐకి కేఎస్‌కే మహానంది పవర్‌ రూ.3,815 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేఎస్‌కే మహానందిపై ప్రస్తుతం దివాలా పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయి.

*‘టీడీపీ పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. టీడీపీ దేశ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఉండి తీసుకువచ్చే పాలసీలు ప్రజల జీవితాలను మార్చాలి. దేశంలో అసమానతలు తొలగించే ఆర్థిక వ్యవస్థ కావాలి. ఇందుకోసం పార్టీలు పాలసీలు మార్చుకోవాలి’’ అని మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం, ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. హర్‌ ఘర్‌ తిరంగా ఒక మంచి కార్యక్రమమన్నారు. ఇప్పుడు గర్వంగా జెండా చేతపట్టుకుని తిరుగుతున్నాం అంటే ఎందరో చేసిన త్యాగాలే కారణమన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కొమరం భీం వరకు అందరినీ స్మరించుకుందామన్నారు. నేషన్‌ ఫస్ట్‌ నినాదాన్ని గట్టిగా వినిపిద్దామని పిలుపునిచ్చారు.

*పాఠశాలల విలీన నిర్ణయంతో ప్రాథమిక విద్య అనిశ్చితి స్థితిలోకి వెళ్లిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు అన్నారు. పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పాఠశాలల విలీనంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు గత నెల 25-31 మధ్య ఏడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘బడి కోసం బస్సు యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. శనివారం విజయవాడలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, వై.శ్రీనివాసరెడ్డి, షేక్‌ సాబ్జీలతో పాటు పాఠశాల పరిరక్షణ వేదిక నాయకులు క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను వివరించారు.

* ఎంప్లాయిస్‌ హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్‌) కింద వైద్య సేవలను విస్తృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో ఇప్పటి వరకూ లేని, ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అవుతున్న 565 వైద్య సేవలను కొత్తగా ఈహెచ్‌ఎ్‌సకూ కూడా వర్తింప చేస్తూ శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈహెచ్‌ఎస్‌ కార్డు ద్వారా వైద్య సేవలు పొందవచ్చు. ఈహెచ్‌ఎస్‌ డ్వారా వైద్యం పొందిన వారికి బిల్లులను ఆరోగ్య శ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుల సమన్వయం కోసం ఆరోగ్య మిత్రలకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

*పెనుమంట్ర మండలం మార్టేరులో జాతీయ జెండా స్థూపం నిర్మాణం విషయమై వివాదం తలెత్తింది. గ్రామ ప్రజలు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి జెండా స్థూపం నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణం చెయ్యొద్దంటూ రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ అధికారులు పనులు నిలిపి వేయించారు.దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం చేశారు. జాతీయ జెండా స్తూపం విషయంలో రాజకీయం ఏంటని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని గ్రామ ప్రజలు అంటున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

*గోదావరి వరద (Godavari flood) పోటెత్తి గ్రామాలను ముంచెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక లంక గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో పాటు ప్రధాన రహదారులన్నీ మునిగిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. సముద్రంలోకి పెద్దగా దిగకపోవడంతో ఈపరిస్థితి నెలకొంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లోని సుమారు 40కుపైగా లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కాజ్‌వేలన్నీ నీట మునిగాయి. అప్పనపల్లి, కనకాయలంక, ఎదురుబిడియం, కె.ఏనుగుపల్లి, అప్పనరామునిలంక కాజ్‌వేలు నీట మునగడంతో ప్రయాణాలు స్తంభించాయి. కోటిపల్లి, నర్సాపురం రేవుల్లో పంట్ల రాకపోకలు నిలిపివేశారు. అయినవిల్లి, పి.గన్నవరం మండలాల్లో 67మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందుగా మోహరించాయి.

*స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్‌ డేగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్మల్‌ జిల్లా మంగ్లీ ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గేష్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన పేరిట ఒక ప్రకటన విడుదలైంది. దే శాన్ని, రాష్ర్టాన్ని దోచుకునే వారు ఉన్నంతకాలం దేశానికి స్వాతంత్య్రం రానట్టేనని పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరిట హిందుత్వ శక్తులు, మతవాద శక్తులు దేశాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు.

*తెలంగాణ గిరిజన ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్ (ట్రైకార్‌) చైర్మన్‌గా ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్‌ బాధ్యతలు చేపట్టారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, జగదీశ్‌ రెడ్డి, పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో మాసబ్‌ట్యాంక్‌ సంక్షేమ భవన్‌లో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, టి. రవీందర్‌ రావు, పల్లారాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* సల్మాన్‌రష్దీపై జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు ఖండించాలని ప్రముఖ తత్వవేత్త కంచ ఐలయ్య కోరారు. ఆయనపై జరిగిన క్రూరమైన దాడి తనను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు.

*తెలంగాణ గిరిజన ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్ (ట్రైకార్‌) చైర్మన్‌గా ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్‌ బాధ్యతలు చేపట్టారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, జగదీశ్‌ రెడ్డి, పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో మాసబ్‌ట్యాంక్‌ సంక్షేమ భవన్‌లో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, టి. రవీందర్‌ రావు, పల్లారాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా న్యాయవాది ఎర్రం రచనారెడ్డి (కామారెడ్డి) నియమితులయ్యారు. ఈ నెల 2న ఆమె పార్టీలో చేరారు. టీఎ్‌సపీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్‌ విఠల్‌(సంగారెడ్డి), కట్టా సుధాకర్‌(నాగర్‌కర్నూలు)లను కూడా అధికార ప్రతినిధులుగా, కాసం వెంకటేశ్వర్లు యాదవ్ (యాదాద్రి భువనగిరి)ను ఉపాధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియమించారు.

* సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి అంతం బీజేపీతోనే సాధ్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. నల్లగొండ జిల్లా చండూరులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. దీన్ని ఓర్వలేని కొందరు తనపై ఆరోపణలు చేస్తూ చౌటుప్పల్‌, నారాయణపురం మండలాల్లో దొంగచాటుగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టులేక అమ్ముడుపోయానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్‌రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. బ్లాక్‌మనీ దాచుకునే దొంగలకు నిలయం బీజేపీ అని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.

* గోవా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 186 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 140 స్థానాల్లో గెలుపొందింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం వెల్లడించారు. ఈ విజయాన్ని తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా అభివర్ణించారు. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్‌ షేట్‌ తనవాడే మాట్లాడుతూ.. గోవా పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఓ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. కాగా, గోవాలో ఈ నెల 10న మొత్తం 186 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 78.70 శాతం పోలింగ్‌ నమోదైంది.

*తమిళనాడులోని ఫెడ్ బ్యాంక్‌ ను కొందరు సాయుధ దొంగలు శనివారంనాడు కొల్లగొట్టారు. చెన్నైలోని అరుంబాక్కంలో ఈ దోపిడీ జరిగింది. ఆయుధాలతో బ్యాంకులోకి అడుగుపెట్టిన అగంతకులు క్షణాల్లోనే కోట్లాది రూపాయలు విలువచేసే నగదు, బంగారం చేజిక్కించుకుని వచ్చినంత వేగంగా పరారయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. దోపిడీ అనంతరం దొంగలు మెరుపువేగంతో పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

*నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజ్టెకు 3.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తివేసి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్తాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.60 అడుగుల వద్ద ఉన్నది. సాగర్‌ గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు. ఇప్పుడు 298.98 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

*కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నిక సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మౌనం కొనసాగుతుండటంపై చర్చ జరుగుతున్నది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కూడా సోనియాగాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నుకునే అవకాశం కనిపిస్తున్నదని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశానికి అశోక్‌ గెహ్లాట్‌ను, దక్షిణ భారతదేశానికి పి చిదంబరాన్ని ఉపాధ్యక్షులుగా చేయాలని సోనియా అభిప్రాయపడుతున్నారని తెలిపాయి. కర్ణాటక సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమించి, సిద్ధరామయ్యను కర్ణాటక సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

*గ్రామంలో నాకు డబ్బులు రావాల్సి ఉంటే.. మన పార్టీకి చెందిన నాయకులే రాకుండా అడ్డుకుంటున్నారు. కార్యకర్తలకేం చేశారు. గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేశారా?’ అంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని వైకాపా కార్యకర్త షేక్‌ రఫీ నిలదీశారు. ఆ సమయంలో రఫీ పక్కన నాలుగో వార్డు సభ్యుడు గణేష్‌ ఉన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కొన్నిచోట్ల నిరసనలు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు విసిరారు. ‘గేదెలు చనిపోతే పరిహారం రాలేదు. పశు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు’ అని గ్రామ ఉప సర్పంచి తుమ్మల ప్రసాద్‌ చిన్నాన్న శీనయ్య ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఉప సర్పంచి ప్రసాద్‌.. ‘‘ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా?’’ అంటూ తన చిన్నాన్నను కొట్టుకుంటూ తీసుకెళ్లడం గమనార్హం. వెన్ను వైష్ణవి ఇంటికి వెళ్లగా జగనన్న విద్యాదీవెన అందలేదని తెలపగా.. తన జేబులో నుంచి రూ.10 వేలు తీసి అందించారు.

*విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలం కాపు సోంపురంలోకి పులి చొరబడినట్లు స్థానికులు గుర్తించారు. పులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు హడలెత్తుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వద్దామంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రావాల్సిందే. పొలంలోకి పోవాలంటే రైతులు వణికిపోతున్నారు. పులి తిరుగుతుందని అటవీ శాఖకు గ్రామస్తులు సమాచారమిచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని అధికారులు ఆ పులిని బంధించాలని వారు కోరుకుంటున్నారు.

*వైసీపీలో దళిత మహిళా ప్రజా ప్రతినిధికి అవమానం జరిగింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పై బాపట్ల జిల్లా, కర్లపాలెం వైసీపీ ఎంపీపీ యరం వనజా ఆరోపణలు చేశారు. కోన రఘుపతి తనను మానసికంగా వేదిస్తున్నారని, దళిత మహిళా ఎంపీపీగా ఉండటం ఆయనకు ఇష్టంలేదని అన్నారు. తనను పలు మార్లు కులం పేరుతో దూషించారని, రెడ్లకు ఎంపీపీ పదవి కట్టపెట్టేందుకు తనను వేదిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను ఎన్నో రకాలుగా, మానసికంగా అవమానపరిచారన్నారు. బాపట్లకు సీఎం జగన్ రెడ్డి వచ్చినా.. తనకు ఆహ్వానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటున్నా.. దళితులకు అవమానాలు తప్పడం లేదని వాపోయారు. తనతో పాటు చాలా మంది ప్రజా ప్రతినిధులు కోన రఘుపతి తీరుతో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ వనజా పేర్కొన్నారు.

*నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్వి చ్చలవిడిగా కొనసాగుతోందని టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ కు గతంలో ఫిర్యాదు చేశానన్నారు. అయినా అక్రమ మైనింగ్ ఆగడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అండతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తక్షణమే ఆపకపోతే టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు.

* ఎగువన వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. జలాశయంలోకి 2,35,000 క్యూసెక్కుల వరద జలాలు వస్తున్నాయి. దీంతో అధికారులు 44 గేట్స్ ఎత్తివేసి 2,40,835 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు.ప్రస్తుతం 8.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 318.516 మీటర్లకుగాను ఇప్పుడు 317.690 మీటర్లు ఉన్నది.*తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా మరోసారి తిరుమల ఆలయంలో అనుచరులతో కలిసి హంగామా చేశారు.వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్‌ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరో ఏపీ మంత్రి మంత్రి ఉషా శ్రీచరణ్‌ కూడా ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే.

*సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో జీతాల పెంపు విష‌యంలో నిర్ణ‌యాన్ని మార్చేది లేద‌ని పేర్కొన్న‌ది. సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి య‌ధావిధిగా జీతాల‌ను పెంచ‌నున్న‌ట్లు ఆ కంపెనీ వెల్ల‌డించింది. క్వార్ట‌ర్లీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా తొలి ద‌శ పూర్తి అయిన‌ట్లు ఆ సంస్థ చెప్పింది. జీతాల‌ను పెంపు విష‌యంలో ఎటువంటి మార్పు లేద‌ని, పెంచిన జీతాల‌ను సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఇవ్వ‌నున్న‌ట్లు విప్రో తెలిపింది. వేరియ‌బుల్ పే విష‌యంలో కామెంట్ చేసేందుకు ఆ సంస్థ నిరాక‌రించింది.

*ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద వరద ప్రవాహం పెరుగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక ను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ వద్ద 15.70 అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతుం ది. డెల్టా కాల్వలకు 11 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 15.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడు దల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది .జలాశయం 7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1,94,284 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడు దల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.77 లక్షల క్యూసెక్కుల ప్రవా హం వస్తుంది . శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.30 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు 211.47 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 32,983 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

* కేంద్ర ప్ర‌భుత్వం 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు బ్లాక్ చేసింది. దీంట్లో ఏడు భార‌త్‌కు చెందినవి కాగా, మ‌రో పాకిస్థానీ ఛాన‌ల్ ఉంది. ఈ ఛాన‌ళ్లు నకిలీ, భార‌త్‌కు వ్య‌తిరేక కాంటెంట్‌ను ప్ర‌సారం చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో గ‌త డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ చేసిన ఛాన‌ళ్ల సంఖ్య 102కు చేరుకున్న‌ది. ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టుల‌ను కూడా బ్లాక్ చేసిన‌ట్లు కేంద్ర స‌మాచార, ప్ర‌సార‌శాఖ తెలిపింది. 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు మొత్తం 86 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నార‌ర‌ని, సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోల‌ను చూశార‌ని, అయితే ఆ ఛాన‌ళ్లు విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త వ్య‌తిరేక ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఐబీ శాఖ తెలిపింది.

*బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆఫ్జ‌ల్‌ అన్సారీ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ఆస్తుల‌పై ఈడీ త‌నిఖీ నిర్వ‌హిస్తోంది. ల‌క్నో, ఘాజిపూర్ న‌గ‌రాల్లో ఉన్న ప్రాప‌ర్టీల‌పై ఈడీ సోదాలు చేప‌డుతోంది. మొత్తం 11 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ప్ర‌స్తుతం యూపీలోని బాండా జైలులో ఉన్నాడు. ముక్తార్ స్వ‌స్థ‌లం మొహ‌మ్మ‌దాబాద్‌. ఎంపీ అఫ్జ‌ల్ అన్సారీకి చెందిన ఢిల్లీ నివాసంలోనూ సోదాలు జ‌రుగుతున్నాయి. గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద అన్సారీ సోద‌రుల‌కు చెందిన సుమారు 14 కోట్ల ఆస్తుల‌ను గ‌త నెల‌లో యూపీ పోలీసులు అటాచ్ చేశారు. వారం క్రితం ఘాజిపూర్‌లో అన్సారీకి చెందిన రెండు ప్లాట్ల‌ను ప్ర‌భుత్వం సీజ్ చేసింది. ఆరు కోట్ల ఖ‌రీదైన ఫ్లాట్ల‌ను ముక్తార్ అక్ర‌మ రీతిలో కొనుగోలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

*సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరరావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి (ఆగస్ట్ 18) సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం అన్నారు.

*భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. గురువారం ఉదయం 53.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 53 అడుగులకు తగ్గింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బుధవారం భద్రాచలం వద్ద 54.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అయితే వరద కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించే ప్రవహిస్తున్నది.

*దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

* ఏపీలో సంచలనం రేపిన కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని ఇదివరకు రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టుకు పిటిషన్‌ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. మూడో పిటిషన్‌ దాఖలు చేయగా ఈరోజు విచారించిన కోర్టు ఈనెల 22న తిరిగి విచారణ చేపడుతామని వాయిదా వేసింది.

* మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే47 ఆయుధాలు కలిగిన పడవ కనిపించడం కలకలం రేపింది. సముద్ర తీరంలో ఈ బోటు కనిపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో మూడు ఏకే 47 ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు.