Politics

అమరావతిపై మరో పోరుకు రైతులు సిద్దం – TNI నేటి రాజకీయ వార్తలు

అమరావతిపై మరో పోరుకు రైతులు సిద్దం –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* ఈ సారి అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేసేందుకు అమరావతి ఐకాస నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో పాదయాత్ర ప్రతిపాదనను సభ్యులంతా ఆమోదించారు.\ సెప్టెంబర్ 12 నాటికి అమరావతి ఉద్యమం వెయ్యి రోజుల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున పాదయాత్ర ప్రారంభిస్తామని స్టీరింగ్ కమిటీ వెల్లడించింది. అమరావతి ఆవశ్యకతను మరోసారి ఇతర ప్రాంతాలకు తెలియజేసేందుకు సిద్ధమని అమరావతి రైతులు ఉద్ఘాటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అరసవిల్లి పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాజధాని నుంచి పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదనను స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున పాదయాత్ర ప్రారంభించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. గతంలో తిరుమలకు పాదయాత్ర చేసినందున.. ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకూ పాదయాత్ర చేసినట్లు అవుతుందన్నారు. పాదయాత్ర విషయంలో సభకు హాజరైన వారంతా ఆమోదం తెలిపారు. గతంలో ఐకాస కన్వీనర్గా ఉన్న పువ్వాడ సుధాకర్ పాదయాత్ర ప్రారంభం విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజుల సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించటం బాగుంటుందని సూచించారు. హైకోర్టు తీర్పు అమరావతికి అనుకూలంగా వచ్చిన తర్వాత పాదయాత్ర చేసే విషయంలో కూడా సరైన ఆలోచన చేయాలన్నారు. పాదయాత్ర విషయంలో అందరూ సహకరించాలని సీనియర్ నాయకులు బెల్లంకొండ నరసింహరావు కోరారు. అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రైతులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పాటు.. లీగల్ కమిటీ, మహిళా ఐకాస, దళిత ఐకాస నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

* విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. ఈ మేరకు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో మాట్లాడటానికి నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగండి. నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి.నేను ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు. నాకేం అర్థం కాలేదు. నా సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌కే తెలియాలి. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు.

* శశిధర్‌రెడ్డి మనస్తాపంతో ఉన్నారు.. రేవంత్‌రెడ్డే సర్దుకుపోవాలి: రేణుకా చౌదరి
మర్రి శశిధర్‌రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయన్న మాజీ మంత్రి.. నితిన్‌ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్‌ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

* పేద ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి త‌ల‌సాని
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఆర్‌డీవో కార్యాలయంలో నూతనంగా పెన్ష‌న్ మంజూరైన‌ లబ్ధిదారులకు ఆస‌రా కార్డుల‌ను మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్ ను ఇచ్చే వారని, అవి తీసుకొనేందుకు కూడా లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర‌ ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని వృద్ధులు, వితంతువులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయని, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న శుభ తరుణంలో 57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి ఆగస్టు15 నుండి అందిస్తున్నట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ మండలాల పరిధిలో ప్రస్తుతం 30 వేల మందికి ఆసరా పెన్షన్ లను అందిస్తుండగా, నూతనంగా 16 వేలకు పైగా పెన్షన్ లు మంజూర‌య్యాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు.

* ఎంపీ వీడియో కాల్‌ వ్యవహారంలో టీడీపీ నాయకులపై కేసు : పేర్ని నాని
ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో కాల్‌ వ్యవహరాన్ని సృష్టించిన టీడీపీ, ప్రచారం చేసిన సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ఈ మేరకు వైసీపీ పార్టీ తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేయను న్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.తప్పుడు ప్రచారంతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లు తెలిపారు. ఎంపీ మాధవ్‌ వీడియో కాల్‌ వ్యవహారం ఫేక్‌ అని ఏపీ సీబీఐ చీఫ్‌ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్పు అని ఏపీ సీబీఐ వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు.తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై, ప్రభుత్వంలోని వ్యక్తులపై బురద చల్లడమే టీడీపీ ఆనవాయితీగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సంస్థ నివేదిక ఇచ్చిందంటూ ఫేక్‌ రిపోర్ట్‌ను ప్రచారం చేశారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని , అశ్లీలాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్నాడని ఆరోపించారు.

* తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న : ఎర్రబెల్లి దయాకర్‌రావు
స‌ర్వాయి పాప‌న్న తెలంగాణ వీరుడు, ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అతి సామాన్యమైన జీవితం నుంచి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. స‌ర్వాయి పాప‌న్న జ‌యంతి సంద‌ర్భంగా మంత్రి ఆయ‌న‌కు పుష్పాంజ‌లి ఘ‌టించారు. జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథ‌ప‌ల్లి మండ‌లం ఖిలాషాపూర్‌లో ఉన్న నాటి స‌ర్వాయి పాప‌న్న రాజభ‌వ‌నాల‌ను కాపాడే పనిని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదన్నారు. వాటి సంరక్షణకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు.

* పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : టీడీపీ నాయకుడు బొండా ఉమ
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ నాయకుడు బొండా ఉమ డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ సీఎం అయ్యాక పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందని ఆరోపించారు. వరదలు వస్తాయని తెలిసినా సర్కారు నిర్లక్ష్యమేమిటని నిలదీశారు. అవగాహన లేని మంత్రి వల్లే పోలవరం అధ్వానంగా ఉందని వ్యాఖ్యనించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

*ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది మేమే.. జగనే ముఖ్యమంత్రి : ఏపీ మంత్రి రోజా
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశా‌ఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న నారా లోకేష్‌కు అభివృద్ధి కనపడటం లేదంటే ఆయన నేత్ర వైద్యుడ్నిసంప్రదిస్తే మంచిదని మంత్రి రోజా సలహా ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలు చెప్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంబానీ, అదానీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుండగా.. టీడీపీ మాత్రం ప్రజల మనసుల్ని దోచుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లే పనిలో నిమగ్నమై ఉన్నదని ఎద్దేవా చేశారు.

*బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న: మంత్రి ప్రశాంత్‌ రెడ్డి
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడని చెప్పారు. హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్న మొగల్‌ పరిపాలన తాలూకు భూస్వాముల గుండెల్లో గునపమయ్యాడని, వ్యక్తిగా మొదలై ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన బహుజన బందూక్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని కొనియాడారు. తెలంగాణ గడ్డపై పోరాటం మొదలుపెట్టి రాజ్యాన్ని ఏలిన తొలి బహుజన రాజుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. వరంగల్‌-గోల్కొండ మధ్య 21 కోటలను స్థాపించిన నెలకొల్పారని చెప్పారు.

*జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: జీవీఎల్
హామీలు నెరవేర్చని సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎంపీ జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో 22ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. 15 రోజుల్లో పరిష్కరించకుంటే బాధితుల పక్షాన ఆందోళన చేపడతామని ప్రకటించారు. టీచర్లకే ఎందుకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టారు? అని జీవీఎల్ ప్రశ్నించారు. మిగిలిన కార్యాలయాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ప్రభుత్వ టీచర్లపై కక్ష సాధింపు చర్యలా ఉందన్నారు. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు పూర్తి చేయలేదు? అని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.

*ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్జ
గన్‌ వైరస్‌కు భయపడి పరిశ్రమలు పారిపోతున్నాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భయపడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు కూడా కష్టాలు పడుతున్నారని చెప్పారు. చెత్తపై పన్ను వేసినందుకు మహిళలు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

*బీహార్‌లో ఏదో జరిగింది! : గులాం నబీ అజాద్‌
బీహార్‌లో మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ ఏర్పాటు స్వాగతించదగినదే అయినా.. తమ పార్టీ ఏదో లోపాయికారీ ఒప్పందం చేసుకొందని విమర్శించారు. కాంగ్రెస్‌ మినహా సంకీర్ణంలోని ప్రతీ పార్టీ తగు సంఖ్యలో పదవులను దక్కించుకొందని చెప్పారు. జనతాదళ్‌(యూ)రి 46 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. సీఎంతోసహా 13 మందికి మంత్రి పదవులు దక్కాయని.. హిందూస్థానీ అవామ్‌ మోర్చాకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఒక మంత్రి పదవి వచ్చిందన్నారు.

*టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: విష్ణు
టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ మిగిలిన వారిని నిబంధనల పేరుతో వేధించడం తగదు. విశాఖలో ‘22 ఏ’ సమస్య ఉందని ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టేశారు. దీనివల్ల 30 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదిహేను రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం. త్వరలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటివారే ఆ పార్టీకి అవసరం’’ అని వ్యాఖ్యానించారు.

*కాంగ్రెస్‌ కల్లోలానికి బాధ్యుడు రేవంతే: మర్రి శశిధర్‌రెడ్డి
రాష్ట్ర కాంగ్రె్‌సలో ఇంత గందరగోళ పరిస్థితులను తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహార శైలే కారణమన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తదనంతర పరిణాలతో పలువురు సీనియర్లు పార్టీకి దూరమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెప్‌ కల్లోలాలనికి రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ అధిష్ఠానానికి సరైన నివేదికలు అందించకుండా రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్ఠానం ఎందుకు మందలించడం లేదని ప్రశ్నించారు.

* ఎమ్మెల్యేలు, ఎంపీలనూ ట్రాక్‌ చేస్తాం: పవన్‌కల్యాణ్‌
‘ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందులో హాజరు నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తోంది. అదే తరహాలో పౌరులు కూడా ఒక యాప్‌ సిద్ధం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్‌ చేసేలా అది ఉంటుంది. బాధ్యత ఎప్పుడూ ఒకరికే ఉండకూడదు. అందరికీ అది ఉండాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనికి ఒక కార్టూన్‌ కూడా జోడించారు. ఉపాధ్యాయులంతా యాప్‌ సిగ్నల్‌ కోసం అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా ఆ కార్టూన్‌లో ఉంటుంది. అందులో స్కూలు అటెండర్‌ మాట్లాడుతూ ‘పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్లు. అదేదో యాపట… దాని సిగ్నల్‌ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్‌’ అని వేరే ఎవరికో చెబుతున్నట్లు ఉంది.

*కేసీఆర్‌ పాలనలో దోపిడీ: షర్మిల
సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దోపిడీ రాజ్యం, దొరల ప్రభుత్వంలా మారిందని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆదివారం నారాయణపేట జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో పాదయాత్ర చెపట్టారు. ఈ సందర్భంగా దామరగిద్దలో నిర్వహించిన మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని నమ్మబలికి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, తన కుటుంబాన్ని, తన బినామీల కుటుంబాలను మాత్రమే బంగారుమయం చేశారు. ప్రజలను నట్టేట ముంచారు’’ అని షర్మిల అన్నారు.

*బీసీల ఆత్మగౌరవం పెంచిన కేసీఆర్‌: గంగుల
హైదరాబాద్‌లో బీసీ కులాలకు రూ.కోట్ల విలువైన స్థలాలను ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బీసీలకు రాష్ట్ర రాజధానిలో ఆత్మగౌరవ భవనాలుంటేనే వారి సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందనే దూరదృష్టితోఉప్పల్‌ భగాయత్‌లో అన్ని బీసీ కుల సంఘాలకు స్థలాలు కేటాయించారని తెలిపారు. ఆదివారం ఉప్పల్‌ భగాయత్‌లో తెలంగాణ పట్కర్‌ కులస్థులకు కేటాయించిన భూమిలో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి బీసీల గురించి ఆలోచించలేదని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.

*అసమర్ధ పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: సోము వీర్రాజు
అసమర్ధ, అవినీతి పాలన కారణంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ఎలా పని చేయాలి? అనే దాన్ని కూడా వివరిస్తూ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం రూ. వేల కోట్ల ఇస్తుందని, ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ వల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు.

*ఎంపీ గోరంట్ల నిర్వాకంపై సీఎం జగన్ ఉలకడు..పలకడు : రామకృష్ణ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని ర్వాకంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. తిరుపతిలో జరుగుతున్న పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి అధికార పార్టీ నాయకులు పాలాభిషేకం చేయడం ఏమిటని? ప్రశ్నించారు. ఆంబోతులా బట్టలు విప్పి కనపడిన హిందూపురం ఎంపీ వీడియోలో ఉన్నది తానుకాదని నిరూపణ చేసుకోకుండా..కులాలను దూషించడం సరైంది కాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక 21 రోజులైందని, ముంపు బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

*ఏపీ సర్కార్‌ యువత భవితను నాశనం చేసింది: నాదెండ్ల మనోహర్ఏ
పీ సర్కార్‌ యువత భవితను నాశనం చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు. మంగళగిరిలో జనసేన ఐటీ వింగ్‌‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో సోషల్‌ మీడియాది కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అక్టోబర్‌ 5 నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ యాత్ర ప్రారంభింస్తారని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం అంటూ అభివృద్ధిని మరిచిందని ధ్వజమెత్తారు. జగన్‌ సర్కార్‌ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తోందని మండిపడ్డారు. దావోస్ వెళ్లి ఫొటోలకు ఫోజులిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీరంగం దూసుకెళ్తుంటే.. ఏపీలో దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ అభివృద్ధికి ప్రత్యేకస్థానం కల్పిస్తామని నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

*నివాసయోగ్య ప్రదేశంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో కాటసాని ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. 2013లో ఆయన పంపిణీ చేసిన 3386 ఇళ్ల పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నివాసానికి అనువైన చోట ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోర్టుకు వెళ్తే..హిందూ శ్మశాన వాటిక, జురెరు వాగులో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అడ్డుపడుతున్నట్లు ఎమ్మెల్యే కాటసాని అసత్య ప్రసారం చేయిస్తున్నాడని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

*ఒక తరాన్ని మేల్కొల్పడానికి పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్ఒ
క తరాన్ని మేల్కొల్పడానికి, బాధ్యత గుర్తు చేయడానికే పార్టీ పెట్టానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పవన్ హాజరై ప్రసంగించారు. ‘‘ఫ్రీడమ్ ఫర్ మిడ్ నైట్ పుస్తకాన్ని చదివాక దేశం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. నేను పార్టీ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు బాధ్యత తెలపడానికే జనసేన పెట్టా. ఒక్క ఎన్నిక కోసమే అయితే ఎవరూ జనసేనలోకి రావద్దు. కోట్లాది మందికి నిర్దేశం‌‌ చేయడమే మన లక్ష్యం. పదవి మనల్ని వెతుక్కుని రావాలి.. మనం దాని వెంట పడకూడదు.’’ అని ఉద్వేగంగా మాట్లాడారు.

*పిచ్చోడి చేతికి ఏకే 47 ఇచ్చినట్టుంది: తులసిరెడ్డి
ఏపీలో మూడేళ్ళ వైసీపీ పరిపాలన చూస్తే పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినవిధంగా ఉందని పీసీసీ వర్కింగ్‌కమిటీ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఈనెల 11న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరులో పాదయాత్ర ప్రారంభించి బంగారుపాాళ్యం, చిత్తూరు మీదుగా గంగాధరనెల్లూరు వరకు 80కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా జరిగిన పాదయాత్ర ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీలంక కంటే ఈరాష్ట్రం అప్పులో ఎక్కువగా ఉన్నాయన్నారు. వైసీపీని దిగంబర పార్టీ అనాలా, రాసలీల పార్టీ అనాలా, కామాంధుల పార్టీ అనాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

*వైసీపీవి పోంజీ స్కీమ్‌లు..ఏపీలో త్వరలో శ్రీలంక పరిస్థితులు: పవన్‌ కల్యాణ్‌
‘‘మనుషుల్ని అత్యాశకు గురి చేసి, ముంచేసే పోంజీ స్కీమ్‌లను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలన్నీ పోంజీ స్కీమ్స్‌ తరహాలోనివే. అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధం చేస్తామని, వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని, యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉచితంగా ఇసుక అందిస్తామని హామీలు గుప్పించారు. ప్రజల ఆశలతో ఆటలాడుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పోంజీ స్కీమ్‌లను నడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘నేను ఏదో అద్భుతాలు జరిగిపోతాయని పార్టీ పెట్టలేదు. దెబ్బలు తిన్నా ప్రజల కోసం నిలబడాలని రాజకీయాల్లోకి వచ్చా. మనల్ని వెతుక్కుంటూ పదవి రావాలి తప్ప… దాని వెంట మనం పడకూడదు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని.. సంక్షేమం పేరుతో అభివద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, మరో తరాన్ని మేల్కొల్పడానికి జనసేన పార్టీని స్థాపించా. ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దు. ఒకవైపు సుప్రీం కోర్టు.. మరోవైపు కాగ్‌ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అతి త్వరలో ఏపీలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు. అక్కడ వరకూ రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఐటీ అభివద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. విభజన తర్వాత సీమ యువత హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలసపోతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏ ఒక్కరూ బయటకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. ఐటి పరిశ్రమను ఇక్కడే అభివద్ధి చేస్తాం’’ అని పవన్‌ అన్నారు.

*అసమర్ధ పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: సోము వీర్రాజు
అసమర్ధ, అవినీతి పాలన కారణంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ఎలా పని చేయాలి? అనే దాన్ని కూడా వివరిస్తూ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం రూ. వేల కోట్ల ఇస్తుందని, ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ వల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు

*ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదు: జగదీష్‌రెడ్డి
ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈడీని బీజేపీ జేబు సంస్థగా మార్చుకుందని దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్‌ కే ఉందని చెప్పారు. వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని జగదీష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ను కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక ఎన్నిక అయినందున.. ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తాను కొంత దూరంగా ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్‌.. మరోసారి దానిని పునరావృతం కానివ్వొద్దని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అసంతృప్తులను బుజ్జగించడం నుంచి ప్రచార పర్వం దాకా అన్నింట్లోనూ ఆయనే ముందుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై వస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు

*ఎంపీ గోరంట్ల వ్యవహారంలో ఎందుకీ మౌనం?: టీడీపీ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. తక్షణమే ఎంపీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.గోరంట్ల వీడియోను పరిశీలించాక అందులో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ జిమ్స్ స్టెఫర్డ్ రిపోర్టు ఇచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక కూడా ఎంపీ మాధవ్‌పై ఎస్పీ ఫక్కీరప్ప ఎందుకు కేసు రిజిష్టర్ చేయలేదని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మౌనం వహించడంలో అర్థమేమిటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఓ వైపు దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే.. ఏపీ రాష్ట్ర ప్రజలను ఎంపీ మాధవ్ నగ్న వీడియో వెంటాడుతోందని, మహిళలంతా సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్‌‌‌కు రేపు స్వాతంత్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకులు బరితెగించిన మాధవ్‌ను రక్షించడం కోసం పడుతున్న తపన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎంపీపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర: నాదెండ్ల మనోహర్జ
నసేన నిర్వహించిన ఐటీ సమ్మిట్‌లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు. ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

*పోటీపై నిర్ణయం పార్టీదే: కోదండరాం
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్నిపార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, అవినీతి, అక్రమాలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన రణదీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ నాయకుల స్వార్థం కోసమే ఉప ఎన్నిక తీసుకువచ్చారన్నారు.

*ఎంపీ చేసింది తప్పో, ఒప్పో జగన్‌ చెప్పాలి: రామకృష్ణ
‘‘రాష్ట్రంలో బరి తెగించిన వెధవలు రాజ్యమేలుతున్నారు. వీరికి తల్లి, చెల్లి భేదం లేదు. సంస్కారం లేదు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం జరిగిన సీపీఐ ప్రథమ మహాసభలో రామకృష్ణ మాట్లాడారు. ‘‘అనంతపురంలో ఓ ఎంపీ బ్లూఫిల్మ్‌ చూపిస్తున్నాడు. ఆయనేమో కమ్మ కులాన్ని తిడతాడు. ఎవరైనా ఆయన్ని బట్టలిప్పుకుని తిరగమని చెప్పారా? రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌ బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడడు. ఎంపీ చేసిన అసహ్యకర పనితో రాష్ట్ర ప్రజలంతా సిగ్గు పడుతున్నా జగన్‌ ఎందుకు మాట్లాడరు?’’ అని రామకృష్ణ ప్రశ్నించారు.

*మాధవ్‌పై చర్యలు తీసుకోవలసిందే: రఘురామ
వైసీపీని కాపాడుకోవానే ఉద్దేశం మీకుంటే.. అభినవ వీరేశలింగంగా బిరుదాంకితుడైన గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామరాజు స్పష్టం చేశారు. లేదంటే ఒక్క మహిళ కూడా పార్టీకి ఓటేసే పరిస్థితి లేదని, వారే పార్టీకి వ్యతిరేకంగా బటన్‌ నొక్కుతారని వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘మాధవ్‌పై చర్యలు తీసుకుని పార్టీ ఇమేజ్‌ను కాపాడుకుందాం. ఆయన ఆంధ్రుడని, అందులోనూ కమ్మవాడనే కథలు చెప్పే ప్రయత్నాలు చేయొద్దు. నగ్న వీడియోలో ఉన్నది మాధవే అని నిర్ధారణ అయ్యాక కూడా 500 వాహనాలతో రాయలసీమలో ఊరేగిస్తే, రానున్న ఎన్నికల్లో వస్తాయనుకుంటున్న 30, 35 స్థానాలు కూడా రావు’ అని స్పష్టం చేశారు.

*ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదు: జగదీష్‌రెడ్డి
ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈడీని బీజేపీ (BJP) జేబు సంస్థగా మార్చుకుందని దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్‌ కే ఉందని చెప్పారు. వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని జగదీష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

*అలాగైతే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరు: బండి సంజయ్
బీజేపీ ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పారిపోయాయని విమర్శించారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీదన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఎప్పుడూ విమర్శించలేదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని తానెప్పుడూ చెప్పలేదన్నారు. వెంకట్‌రెడ్డి మంచి పొలిటికల్ లీడర్ అని కొనియాడారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే, రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తోందన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.