Business

విప్రో ఉద్యోగులకు భారీ ఆఫర్లు – TNI వాణిజ్య వార్తలు

విప్రో ఉద్యోగులకు భారీ ఆఫర్లు – TNI వాణిజ్య వార్తలు

* సెప్టెంబర్‌ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్‌పై ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్‌ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్‌ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్‌ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇవ్వడం
ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్‌ నేజ్‌మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది’ అని విప్రో తెలిపింది.

* ధరల సెగతో బ్రిటన్‌ వణికి పోతోంది. బుధవారం నాటికి ఆ దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 10.1 శాతానికి చేరింది. బ్రిటన్‌ జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) బుధవారం ఈ వివరాలు విడుదల చేసింది. దీంతో ధరల కట్టడి కోసం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీరేట్లు మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఏ వస్తువుల ధర చూసినా వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఆహార ఉత్పత్తుల ధరల సెగ, రిటైల్‌ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం. జూన్‌, 2022లో 9.8 శాతంగా ఉన్న వార్షిక ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 12.7 శాతానికి చేరింది

* స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 120 పాయింట్లు.. నిఫ్టీ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ పవర్ గ్రిడ్ హీరోఐటీసీకంపెనీలు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ సన్ ఫార్మా ఓఎన్‌జీసీవిప్రో, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల గిరాకీ పెరగనుంది. గత ఏడాదితో పోలిస్తే ఒపెక్7.73 శాతం పెరగనుంది. పెట్రో ఉత్పత్తుల గిరాకీ వృద్ధి ప్రపంచంలోనే అధికంగా ఉంది. అమెరికా కంపెనీ ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్‌జీసీఒప్పందం చేసుకుంది. దేశం సముద్ర జలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణను ముమ్మరం చేశారు. ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గ్రాన్యూల్స్ ఇండియా ప్రకటించింది. డైసియాండియామైడ్ తయారీ కోసం గ్రాన్యూల్స్ ఇండియాకు అనుమతి లభించింది.

*ఆంధ్రప్రదేశ్‌ తీరంతో సహా దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల అన్వేషణ మరింత ముమ్మరం చేయాలని ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పనిచేసే బహుళజాతి ఆయిల్‌ కంపెనీ ఎగ్జాన్‌మొబిల్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

*ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని గ్రాన్యూల్స్‌ ఇండియా భావిస్తోంది. గతంలో మూడేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించామం టూ గత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లు పెట్టామని, మిగిలిన రూ.600 కోట్లు 2023-24 చివరి నాటికి పూర్తి కాగలవని భావిస్తున్నట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.

*ప్రభుత్వ రంగంలోని జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ రద్దయిన పాలసీల పునరుద్ధరణకు కస్టమర్లకు అవకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 21 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. లేటు ఫీజులో రాయితీతో నాన్‌ యూలిప్‌ హోల్డర్లందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. తొలిసారిగా ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదేళ్ల లోపు పాలసీలన్నింటినీ కస్టమర్లు పునరుద్ధరించుకోవచ్చునని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలకు మాత్రం లేటు ఫీజులో నూరు శాతం మినహాయింపు ఇస్తారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఎయిర్‌ కండీషనర్ల తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని హావెల్స్‌ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని హావెల్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెం ట్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఏడాదికి 15 లక్షల యూని ట్ల తయారీ సామర్థ్యంతో ఏసీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఎయిర్‌ కండీషనర్ల తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేయాలని హావెల్స్‌ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని హావెల్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెం ట్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఏడాదికి 15 లక్షల యూని ట్ల తయారీ సామర్థ్యంతో ఏసీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

*బంగారం, వెండి ధరలు న్యూఢిల్లీ మార్కెట్లో భారీగా తగ్గాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ఇందుకు కారణమని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ తెలిపింది మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములు రూ.764 తగ్గి రూ.52,347 పలుకగా కిలో వెండి ధర రూ.1592 తగ్గి రూ.58,277 వద్ద స్థిరపడింది. ఎంసీఎక్స్‌లో కూడా ఈ లోహాల ధరలు తగ్గాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1755 డాలర్లు, వెండి ధర 20.13 డాలర్ల వద్ద గత ముగింపు స్థాయి కన్నా దిగువనే ట్రేడవుతున్నాయి.

*అదానీ గ్రూప్‌ మరో భారీ కొనుగోలు జరిపింది. నవకర్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో ‘ఐసీడీ తుంబ్‌ (వాపీ)’ను రూ.835 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ (ఏఎల్‌ఎల్‌) ప్రకటించింది. అదానీ గ్రూప్‌ ప్రధాన సంస్థల్లో ఒకటైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) లిమిటెడ్‌ పూర్తి అనుబంధ విభాగమే అదానీ లాజిస్టిక్స్‌. అనుసంధానిత రవాణా సదుపాయాలతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌ వసతుల ఏర్పాటు వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోలు జరిపినట్లు కంపెనీ తెలిపింది. అదానీ లాజిస్టిక్స్‌ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఏడు మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులున్నాయి. తాజాగా ఐసీడీ తుంబ్‌ కూడా ఈ జాబితాలోకి చేరనుంది.