NRI-NRT

అమెరికా గ్రీన్ కార్డు కోసం గోట‌బ‌య ద‌ర‌ఖాస్తు

అమెరికా గ్రీన్ కార్డు కోసం గోట‌బ‌య ద‌ర‌ఖాస్తు

శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్ష .. అమెరికా గ్రీన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆ దేశ ప్ర‌జ‌లు ఉద్య‌మించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో రాజ‌ప‌క్ష దేశాన్ని విడిచి పారిపోయారు. ప్ర‌స్తుతం థాయిలాండ్‌లో ఉన్న రాజ‌ప‌క్ష‌.. గ్రీన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు ఓ రిపోర్ట్ వెల్ల‌డైంది. భార్య‌, కుమారుడు కూడా గ్రీన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు. వాస్త‌వానికి న‌వంబ‌ర్ వ‌ర‌కు గోట‌బ‌య థాయ్‌లాండ్‌లో ఉండాల‌నుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆయ‌న తిరిగి ఈనెల‌లోనే శ్రీలంక‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. గోట‌బయ రాజ‌ప‌క్ష భార్య ఐవోమా రాజ‌ప‌క్ష అమెరికా పౌరురాలు. ఈ నేప‌థ్యంలో గ‌త నెల‌లోనే గ్రీన్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం.