Politics

జగన్‌ అక్రమ సంపాదనను వెలికి తీయాలి.. – TNI నేటి రాజకీయ వార్తలు

జగన్‌ అక్రమ సంపాదనను వెలికి తీయాలి.. –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* ఏపీ సీఎం జగన్‌ అవినీతి, అక్రమ సంపాదనను వెలికితీసే పనిపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. స్వలాభం, పార్టీ ప్రయోజనాలపైనే దృష్టి సారించారని, వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రజాతీర్పును కాలరాసేందుకే జగన్‌ రెడ్డి అవినీతి కుంభకోణాలకు అక్రమార్జనకు తెగబడ్డాడని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కేంద్రం ఇంకెన్నాళ్లు హెచ్చరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే ప్రకటలకే ఏపీ సీఎం జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఏపీలో అధికారంలోకి రాలేననే అనుమానంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. ఉపాధి కల్పన శూన్యమని ఎద్దేవా చేశారు. బాధిత వర్గాల ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై జగన్‌కు ఆసక్తి లేదని విమర్శించారు.

* బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోండి: సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ
బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ‘2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం వారిని రిమిషన్‌కి అనర్హులుగా ప్రకటించవచ్చు. రేప్ వంటి నేరాలు మన సామాజిక స్పృహను కుదిపేస్తాయి. శిక్ష పడిన రేపిస్టులు స్వతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రతీ పౌరుడుకు వెన్నులో వణుకు పుడుతోంది’ అని పేర్కొన్నారు.ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని ప్రస్తావించారు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని తెలిపారు.

* తల్లీబిడ్డల క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గంగుల
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నాడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన పండ్లు, స్వీట్లు పంచారు. ఆ సమయంలో ఆయనతోపాటు నగర మేయర్, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.వార్డుల్లో కలియతిరిగి అందుతున్న వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నరు. ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. రజిని అనే మహిళకు ఒకే కాన్పులో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కవల పిల్లలు జన్మించడంతో వారికి రెండు సీఎం కేసీఆర్ కిట్లతో పాటు 5000 రూపాయలను బహుమతిగా అందించారు.

* తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అన్నిరంగాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జిలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రహదారుల అభివృద్ధి, లింక్ రోడ్ల నిర్మాణం, ఫుట్ పాత్ ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నూతనంగా ప్లై ఓవర్ లు, అండర్ పాస్ లను నిర్మించినట్లు చెప్పారు

*ఇంటికో డాక్టర్‌ అంటూ మరో మోసం: అచ్చెన్న
‘‘ఇంటికో డాక్టర్‌ అంటూ జగన్‌రెడ్డి మరో మోసానికి తెరతీశారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగలేదు. ప్రజల సంఖ్య తగ్గలేదు. మరి ఇంటికో డాక్టర్‌ అంటూ జగన్‌రెడ్డి ఎవరిని మోసం చేస్తున్నాడు?’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. గురువారం ఆయన వరుస ట్వీట్‌లతో స్పందించారు. ‘‘కొత్తగా వైద్య ఉద్యోగాలు ఇచ్చి డాక్టర్‌ పేషెంట్స్‌ నిష్పత్తిని ఏమన్నా తగ్గించారా? గ్రామాల్లో ఇప్పటికీ వైద్యులు సరిగా అందుబాటులో ఉండని విషయం నిజం కాదా? పట్టణాల్లో సైతం సిబ్బంది విధులకు ఆలస్యంగా వస్తున్న పరిస్థితి లేదా? కొత్తగా ఒక్క ఆసుపత్రి అయినా నిర్మించారా? నూతన వైద్య పరికరాలు సమకూర్చారా? సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో వారిపై ఒత్తిడి పెరుగుతున్న విషయం వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ముందు సదుపాయాలు, సిబ్బంది, ప్రమాణాలు మెరుగుపర్చండి. కనీసం ఆసుపత్రికి వచ్చే రోగులకైనా ఉత్తమ సేవలందించండి. 2016లో మా ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్‌ క్లినిక్‌లకి పేరు మార్చి ఫ్యామిలీ డాక్టర్‌, ఇంటికో డాక్టర్‌ అంటూ జగన్‌రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు’’ అని అచ్చెన్న విమర్శించారు

*రాష్ట్రం అధోగతి మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. మండలంలోని బాది నేనిపల్లి గ్రామ పంచాయతీలోని క్రిష్టంపల్లి గ్రామంలో బాదుడే బాదు డు కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. భారీ ర్యాలీగా వచ్చిన టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచుతున్న పన్నులు, ధరలు, చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నీటి ప్రాజెక్టులను విస్మరించి ఎడారిగా మా ర్చారన్నారు. అభివృద్ధి కావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి కనిపి స్తుందంటే అది టీడీపీ హయాంలో జరిగినదేనని అశోక్‌రెడ్డి గుర్తు చేశారు. వైసీపీ వచ్చిన మూడేళ్లలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రజలపై వైసీపీ బాదుడుకు అడ్డుకట్ట పడాలంటే జగన్‌రెడ్డిని ఇంటికి పంపాలని అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, నాయకులు బిజ్జాల తిరుమలరెడ్డి, ముత్తుముల సంజీవరెడ్డి, ఓబుల్‌రెడ్డి, గోపా లకృష్ణ యాదవ్‌, బద్రి లక్ష్మిరంగారెడ్డి, హనుమంతు, యాల్లారెడ్డి, బద్రి నాగేశ్వర్‌రెడ్డి, రామాంజ నేయులు, రంగయ్య, వెంకట్రామిరెడ్డి, షేక్‌ నభి, బాలిరెడ్డి, గుర్రం కృష్ణబాబు పాల్గొన్నారు.

*వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే కందులమాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి
వైసీపి పాలన లో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మాదాలవారిపాలెం గ్రామంలో బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజల నెత్తిన జగన్‌రెడ్డి రోజుకో ధరల పిడుగును వేస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలపై పన్నుల భారం మోపమని, చార్జీలు పెంచమని నమ్మించిన జగన్‌రెడ్డి ప్రజ లను చార్జీలతో బాదేస్తున్నారని కందుల ధ్వజ మెత్తారు. టీడీపీ హయంలో ప్రజల బాగో గులతోపాటు సంక్షేమ పథకాలు అందరికీ అం దేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్య లు తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ప్రజలు క్షేమంగా రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందని కందుల పేర్కొ న్నా రు. మూడేళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకో క పోవడంతోపాటు అప్పుల ఊబిలోకి నెట్టార న్నారు. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా చేసిన పాపం వైసీపీదేనన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. దీంతో నిరుద్యోగులు మరింత ఎక్కువై ఉపాధి కోసం వలస పోతున్నారని కందుల ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బందిలేకుండా జరిగిపో తు న్న గృహ నిర్మాణ రంగానికి ఇసుక పాలసీని తెచ్చి అస్తవ్యస్తం చేసిన ఘనత జగన్‌రెడ్డి దేనని అన్నారు. దీంతో భవన నిర్మాణ కార్మి కులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ఏర్పాటు చేసిన కా ర్పొరేషన్‌ లన్నీ నిధులు లేక నిర్వీర్యమయ్యా యన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కులాల కార్పొరేషన్‌ల ద్వారా యువతను ఆదు కుంటామన్నారు. వైసీపీ అసమర్ధ పాలన తో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీపీ సానుభూతి పరులకు పథకాలు అందకుండా చేయడం అన్యాయమన్నారు. వైసీపీ పాలకుల తీరుతో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అభద్ర తాభావం పెరిగిపోయిందన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కందుల పిలుపునిచ్చారు. కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌, చినబాబు, పెదబాబు, రసూల్‌ పండు అనిల్‌, ఎస్‌ఎం బా షా, షబ్బీర్‌, కాటూరి శ్రీను, మౌళాలి, యాసిన్‌, ఖల్‌నాయక్‌, నరేష్‌, ఠాగూర్‌, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి టీడీపీ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

*బండి సంజయ్‌ది టైం పాస్ యాత్ర: ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ది టైం పాస్ యాత్రని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామన్నారు. తమ కార్యకర్తలు అనుకుంటే గేటు కూడా దాటలేరని అన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే ఢిల్లీ మీద దండయాత్ర చెయ్యాలన్నారు. కుల, మత ద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర ఎందుకు?.. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచినందుకా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బండి సంజయ్ ముందు చెప్పాలని శంబీపూర్ రాజు డిమాండ్ చేశారు.

*సీబీఐ ద‌ర్యాప్తును స్వాగ‌తిస్తున్నాం: కేజ్రీవాల్
ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త ఎక్సైజ్ పాల‌సీని ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విధానం అమ‌లులో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. త‌న ట్విట్ట‌ర్‌లో అత‌ను రియాక్ట్ అయ్యారు. సీబీఐని స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పిన కేజ్రీ.. ఆ ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు వెల్‌రడించారు. ఈ విచార‌ణ ద్వారా ఏమీ బ‌య‌ట‌కురాదు అని ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

*రెచ్చిపోయిన కాషాయ నేత : టీఎంసీ నేత‌ను చెప్పుతో కొడ‌తార‌న్న‌ దిలీప్ ఘోష్
బీజేపీ నేత‌ల నోటిదురుసు వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. తాజాగా తృణ‌మూల్ కాంగ్రెస్ నేత (టీఎంసీ)పై బెంగాల్ నేత‌, బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ నోరుపారేసుకున్నారు. త‌మ పార్టీ విమ‌ర్శ‌కుల‌పై టీఎంసీ నేత సౌగ‌త రాయ్ చేసిన విమ‌ర్శ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌ను చెప్పుతో కొడ‌తార‌ని దిలీప్ ఘోష్ అన్నారు.ఘోష్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన రాయ్ బీజేపీ నేతకు క‌నీస విద్యార్హ‌త లేద‌ని మండిప‌డ్డారు. కాషాయ శిబిరంలో విశ్వాసం కోల్పోయిన దిలీప్ ఘోష్ టీఎంసీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని అన్నారు. త‌మ నేత‌లు పార్ధ ఛ‌ట‌ర్జీ, అనుబ్ర‌త మొండ‌ల్‌ను వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన నేప‌ధ్యంలో త‌మ పార్టీపై విపక్షాలు బురుద‌చ‌ల్ల‌డం స‌రికాద‌ని అంత‌కుముందు సౌగ‌త రాయ్ అన్నారు.నిరసన ముసుగులో పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డం ద్వారా తప్పించుకుంటామని నమ్మే వారి చర్మం ఒలిచి బూట్లు తయారు చేస్తారని రాయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌కు గాను త‌ర్వాత రాయ్ క్ష‌మాప‌ణ చెప్పారు. ఇక రాయ్ విమ‌ర్శ‌ల‌ను దిలీప్ ఘోష్ ప్ర‌స్తావిస్తూ సౌగ‌త రాయ్ సీనియ‌ర్ నేత‌ని, గ‌తంలో ప్రొఫెస‌ర్‌గానూ ప‌నిచేశార‌ని విప‌క్షాన్ని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌కు విస్మ‌యం క‌లిగించాయ‌ని అన్నారు. సౌగ‌త రాయ్‌ను ప్ర‌జ‌లు చెప్పుల‌తో కొట్టే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని ఘోష్ హెచ్చ‌రించారు.

*జువైనెల్‌ చ‌ట్టంలో లోపాలున్నాయి: మంత్రి కేటీఆర్‌
జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్ ఘ‌ట‌న కేసులో రేపిస్టుల‌ను శ‌ర‌వేగంగా అరెస్టు చేశామ‌న్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపిన‌ట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల త‌ర్వాత హైకోర్టు ఆ రేపిస్టుల‌కు బెయిల్ మంజూరీ చేసిన‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. చ‌ట్టం ప్ర‌కారం రేపిస్టుల‌కు శిక్ష‌ప‌డే వ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం పోరాడుతుంద‌ని ఆయ‌న అన్నారు.జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న‌ను త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తావించిన మంత్రి కేటీఆర్‌.. జువైనెల్‌ చ‌ట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అందుకే రేపిస్టులకు బెయిల్ ఇవ్వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని తాను డిమాండ్ చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్య‌క్తి తుదిశ్వాస విడిచే వ‌ర‌కు జైలులో ఉండాల‌న్నారు. జీవిత ఖైదు శిక్ష‌ను నిజ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

*జువెనైల్ చ‌ట్టంలో లోపాలున్నాయి: మంత్రి కేటీఆర్‌
జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్ ఘ‌ట‌న కేసులో రేపిస్టుల‌ను శ‌ర‌వేగంగా అరెస్టు చేశామ‌న్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపిన‌ట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల త‌ర్వాత హైకోర్టు ఆ రేపిస్టుల‌కు బెయిల్ మంజూరీ చేసిన‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. చ‌ట్టం ప్ర‌కారం రేపిస్టుల‌కు శిక్ష‌ప‌డే వ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం పోరాడుతుంద‌ని ఆయ‌న అన్నారు.జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న‌ను త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తావించిన మంత్రి కేటీఆర్‌.. జువెనైల్ చ‌ట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అందుకే రేపిస్టులకు బెయిల్ ఇవ్వ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని తాను డిమాండ్ చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్య‌క్తి మ‌ర‌ణం వ‌ర‌కు జైలులో ఉండాల‌న్నారు. జీవిత ఖైదు శిక్ష‌ను నిజ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

* దేశం గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు: మంత్రి తలసాని
దేశ గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్‌పేటలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడిందన్నారు. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు15 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

* సీబీఐ ద‌ర్యాప్తును స్వాగ‌తిస్తున్నాం: కేజ్రీవాల్
ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త ఎక్సైజ్ పాల‌సీని ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విధానం అమ‌లులో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. త‌న ట్విట్ట‌ర్‌లో అత‌ను రియాక్ట్ అయ్యారు. సీబీఐని స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పిన కేజ్రీ.. ఆ ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విచార‌ణ ద్వారా ఏమీ బ‌య‌ట‌కురాదు అని ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు.