DailyDose

చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ – TNI నేటి తాజా వార్తలు

చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ – TNI నేటి  తాజా వార్తలు

*ఫేక్‌ వీడియోపై తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు. ఈ మేరకు అనంతపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.‘టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఓటుకు నోటు కేసుపై ఎల్లో మీడియాలో ఏనాడైనా చర్చలు పెట్టారా?. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారు.

* ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కేసులో ఈ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఢిల్లీలోని సుమారు 20 ప్ర‌దేశాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. సీబీఐ అధికారులు త‌న ఇంటికి వ‌చ్చిన‌ట్లు మ‌నీష్ సిసోడియా ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ద‌ర్యాప్తు సంస్థ‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వాళ్ల‌కు త‌న వ‌ద్ద ఏమీ దొర‌క‌ద‌ని కూడా సిసోడియా వెల్ల‌డించారు. దేశం కోసం మంచి ప‌నులను చేసేవాళ్ల‌ను వేధించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యా రంగంలో తాను చేస్తున్న ప‌నిని ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. నిజం నిల‌క‌డ‌గా తెలుస్తుంద‌ని సిసోడియా ట్వీట్ చేశారు.

* భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.

* ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నాడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన పండ్లు, స్వీట్లు పంచారు. ఆ సమయంలో ఆయనతోపాటు నగర మేయర్, జడ్పీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

* తిరుపతిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించారు. దివంగత గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్జీరంగా, వినోబా భావే వంటి వారి ఆశయాలకు అనుగుణంగా మునిరత్నం పని చేశారని అన్నారు. అనంతరం తిరుచానూరులో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రచించిన సత్యశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ జీవన సందేశం అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. నిజాయితీకి గాంధీజీ నిలువుటద్దంగా నిలిచారని అన్నారు. తిరుపతితో గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉందని సీజేఐ తెలిపారు.

* ప్రముఖ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్‌ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్‌ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు.

* భారతీయ ఐటీ నిపుణులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. టాప్‌ ఐటీ అండ్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచనున్నాయిట. గత కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ రేటు భారీగా ఉండటంతో, ఉద్యోగులను, ముఖ్యంగా ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏకంగా 70 నుంచి 125 శాతం దాకా తమ ఉద్యోగులను జీతాలను పెంచేందుకు నిర్ణయించాయి.

* ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్‌ కాల్‌’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ‘భారత్‌ను నంబర్‌ వన్‌ చేసేందుకు మా నేషనల్‌ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లోనూ ప్రజలకు సూచించారు.

* స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు గురువారం స్వల్ప గాయాలపాలయ్యారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ విద్యార్థులు కొందరు గాంధీ సినిమా చూసేందుకు ఆర్‌కే సినిమ్యాక్స్‌కు వచ్చారు. అయితే, థియేటర్‌లోని ఎస్కలేటర్‌ అతి వేగంగా కదలడంతో దానిపై ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయురాలు అదుపు తప్పి పడిపోయారు. అప్రమత్తమైన నిర్వాహకులు వారిని హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అపోలో ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.

* కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,754 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 64980 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,01,830 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 47 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527253 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,220 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43685535 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.09 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 31 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

* సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. రాస్ బిల్డింగ్ వద్ద ఎన్వీ రమణ కు మేళ తాళాలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పద్మశ్రీ స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఎన్.జీ.రంగ, వివోభాబావే, రాజగోపాలనాయుడు వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి మునిరత్నం అని తెలిపారు. మహిళలు, రైతులకు రాస్ సంస్థ ద్వారా సేవలు అందాయన్నారు. సంస్థ మరింత అభివృద్ది చెందాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.

*చెన్నై నగరంలో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా ఒక విమానం ల్యాండింగ్‌ అవలేకపోవడంతో బెంగుళూరు పంపించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెన్నై సహా పరిసర పాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చెన్నై రావాల్సిన వాటితో పాటు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాల్సిన విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ముంబై నుంచి 132 మంది ప్రయాణికులతో వచ్చిన ఒక విమానం భారీ వర్షం కారణంగా చెన్నైలో లాండింగ్‌ కాకపోవడంతో బెంగుళూరు మళ్ళించారు. అదేవిధంగా భువనేశ్వర్‌, హైదరాబాద్‌(Hyderabad) నుంచి వచ్చిన మరో రెండు విమానాలు కూడా లాండింగ్‌ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సమయం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత పైలట్లు చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

*రాష్ట్రంలో ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగిస్తే బాధ్యులతపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు అన్నారు. మంగళగిరి కమిషన్‌ కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌, సభ్యులు మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ అధికారులతో కలిసి పర్యవేక్షించి, నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల వివరాలు తప్పనిసరిగా నోటీస్‌ బోర్డులో పెట్టాలని కమిషన్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు టాస్క్‌ఫోర్సు కమిటీలను బలోపేతం చేసి తరచూ తనిఖీలు నిర్వహించి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

*ఫర్‌ డ్రాప్‌-మోర్‌ క్రాప్‌(చుక్కనీటితో చాలా పంట) సాధించే లక్ష్యంతో ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌, స్ర్పింక్లర్‌ విధానం అమలుకు రూ.1,395.45కోట్లతో 2022-23 వార్షిక కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ప్రధానమంత్రి క్రిషి సించాయ్‌ యోజన, రాష్ట్రీయ క్రిషి వికాస్‌ యోజన పథకాల కింద ఈ ప్రాజెక్ట్‌ విలువలో కేంద్రప్రభుత్వ వాటా రూ.445.67కోట్లు, చట్టబద్ధంగా రాష్ట్రప్రభుత్వ వాటా రూ.297.11కోట్లు, అదనపు రాష్ట్ర వాటా రూ.429.03కోట్లు, రైతుల వాటా రూ.223.64కోట్లుగా నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో ఐదెకరాలోపు డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90%, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో 5-10ఎకరాలకు 70%, మిగతా జిల్లాలకు 50% రాయితీని ఖరారు చేస్తూ గురువారం గెజిట్‌ విడుదలైంది. స్ర్పింక్లర్స్‌ ఇరిగేషన్‌కు ఐదెకరాల్లోపు చిన్నమధ్యతరహా రైతులకు 55%, 5-12.5ఎకరాల్లోపు ఇతర రైతులకు 45% రాయితీ లభిsస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

*రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా వైసీపీ ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంటూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

*పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపు సమాచారాన్ని విద్యార్థులకు నేరుగా ఫోన్‌ మెసేజ్‌ల రూపంలో పంపుతామని సాంకేతిక విద్య డైరెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. అడ్మిషన్లకు అర్హత పొందిన విద్యార్థుల వివరాలను ఈనెల 21న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో 70 వేల పాలిటెక్నిక్‌ సీట్లు అందుబాటులో ఉంటే, 40 వేల మంది వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు.

* భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గింది. ఎగువనుంచి ప్రవాహం నెమ్మదించడంతో భద్రాచలం వద్ద వరద గోదావరి శాంతించింది. మూడు రోజుల క్రితం 53 అడుగులు దాటి ప్రమాదకరంగా ప్రవహించింది. అయితే నదిలో క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం నీటిమట్టం 49.5 అడుగులకు చేరుకుంది. నీటి ప్రవాహం 12,24,690 క్యూసెక్కులుగా ఉన్నది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సెప్టెంబరు మొదటి వారంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,032 వైఎ్‌సఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఏఎన్‌ఎం, ముగ్గురు ఆశా వర్కర్లు ఈ కేంద్రాల్లో సేవలందిస్తారని చెప్పారు. ఇప్పటికే 8,500 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించామని, మరో 1,500 మంది నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశామని తెలిపారు.

* రాబోయే అంబేడ్కర్‌ జయంతి నాటికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌మైదాన్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో జరుగుతున్న పనులపై సచివాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు.

*డర్టీ వీడియో వ్యవహారంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు పోలీస్‌ శాఖ పడరాని పాట్లు పడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. వీడియో నిజమో కాదో తెలియడానికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపాలని సవాల్‌ విసిరారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ డర్టీ వీడియోకు సంబంధించిన అసలు ఫోరెన్సిక్‌ రిపోర్టును సీఐడీ అధికారులు బయటపెట్టాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. గురువారం విశాఖపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పిలవని పేరంటానికి వెళ్లినట్టుగా ఫోరెన్సిక్‌ రిపోర్టుపై సీఐడీ అధికారుల తీరు ఉందన్నారు.

* ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపి రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. పవర్ ఎక్సేంజ్‌ ద్వారా కొనుగోలులో ఏపీకి బకాయిలు లేవని స్పష్టం చేశారు. ఏపీ డిస్కమ్‌లు కూడా ఇప్పటికే కేంద్రానికి రూ. 350 కోట్లు చెల్లించేశాయని పేర్కొన్నారు. సమాచారం లోపం వల్లే ఏపీ పేరును జాబితాలో చేర్చారని ఆయన వెల్లడించారు.

* దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా నిర్ధారణకాగా, నేడు ఆసంఖ్య 15,754కు చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి పెరిగింది. ఇందులో 4,36,85,535 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంనిణీ చేశామని ప్రకటించింది.

*ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీప అడవుల్లో కూంబింగ్‌ పార్టీకి.. మావోయిస్టులు తారపడ్డారు. దీంతో అక్కడినుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

*బర్డ్ ఆసుపత్రిలో ముంద‌స్తుగా ఓపి బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్‌ను రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి బ‌ర్డ్‌ ఆస్పత్రి నిర్వహణపై ఈవో సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తం గా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు బ‌ర్డ్ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఓపి ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పద్ధతిలో బర్డ్ ఆసుపత్రిలోని ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేయాలని, ల్యాబ్‌ల‌కు అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న భోజ‌నం నాణ్యత మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.బ‌ర్డ్ ఆసుపత్రిలో సెంట్రల్ యూపిస్‌ ఏర్పాటు చేయాలని, ఆటోమేషన్‌ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ అందించే ప‌నులు పూర్తి చేయాలన్నారు. ల్యాబ్ మెటీరియల్స్, బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు తదితరాలను టెండర్ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

* వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రసుత్తం ఒరిస్సాలోని బాలాసోర్‌కు దగ్గర్లో గంటకు 20 కిమీ వేగంతో వాయివ్యంగా ప్రయాణి స్తోందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు.ఈ కారణంగా ఒరిస్సా, ఝూర్ఖండ్, చత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్‌ రాష్రాలతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు అవకాశాలున్నాయని స్పష్టం చేసింది . దీంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది .

*నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నేతలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఇక్కడి వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి, ఫకీరు, రాజు తదితర నాయకులు.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో వీకంతా టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

*దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి మహాద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.

*యూట్యూబర్ బాబీ క‌టారియాను ఉత్త‌రాఖండ్ పోలీసులు అరెస్టు చేయ‌నున్నారు. దీని కోసం రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబ‌ర్ క‌టారియా మ‌ద్యం సేవించాడు. పోలీసుల్ని బెదిరించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో అత‌నిపై కేసు న‌మోదు అయ్యింది. ఐపీసీలోని 342, 336, 290, 510 సెక్ష‌న్ల కింద కేసును బుక్ చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేష‌న్‌లో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు. యూట్యూబ‌ర్ క‌టారియాను అరెస్టు చేసేందుకు హ‌ర్యానాకు పోలీసుల్ని పంపిన‌ట్లు ఓ ఆఫీస‌ర్ తెలిపారు.ఇటీవ‌ల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ అత‌ను సిగ‌రేట్ తాగాడు. దాంతో అత‌ను ఇంట‌ర్నెట్‌లో ఫేమ్ అయ్యాడు. ఫిబ్ర‌వ‌రిలో అత‌న్ని నో ఫ్ల‌యింగ్ జాబితాలో చేర్చారు. ఆ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ అదో డ‌మ్మీ విమానం అని, దుబాయ్‌లో షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ వీడియో తీసిన‌ట్లు బాబీ క‌టారియా తెలిపాడు.

*ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వివిధ రకాల పర్యాటక యాత్రలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘మహాలయ పిండప్రదానం’ పేరుతో రూపొందించిన ప్యాకేజీలో 15న అర్ధరాత్రి 12.05 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే రైలు విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌ గుండా వెళ్తోందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డీఎ్‌సజీపీ కిశోర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 20న పర్యాటకులు తిరిగి ఇంటికి చేరుకుంటారన్నారు. అలాగే.. వివిధ ప్రాంతాలకు విమాన యాత్రల ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పూర్తి సమాచారం కోసం 040-27702407, 9701360701, 8287932229 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. వెబ్‌సైటులో కూడా సమాచారం అందుబాటులో ఉందన్నారు

*స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు గురువారం స్వల్ప గాయాలపాలయ్యారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ విద్యార్థులు కొందరు గాంధీ సినిమా చూసేందుకు ఆర్‌కే సినిమ్యాక్స్‌కు వచ్చారు. అయితే, థియేటర్‌లోని ఎస్కలేటర్‌ అతి వేగంగా కదలడంతో దానిపై ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయురాలు అదుపు తప్పి పడిపోయారు. అప్రమత్తమైన నిర్వాహకులు వారిని హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అపోలో ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.

* ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వివిధ రకాల పర్యాటక యాత్రలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘మహాలయ పిండప్రదానం’ పేరుతో రూపొందించిన ప్యాకేజీలో 15న అర్ధరాత్రి 12.05 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే రైలు విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌ గుండా వెళ్తోందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డీఎ్‌సజీపీ కిశోర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 20న పర్యాటకులు తిరిగి ఇంటికి చేరుకుంటారన్నారు. అలాగే.. వివిధ ప్రాంతాలకు విమాన యాత్రల ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పూర్తి సమాచారం కోసం 040-27702407, 9701360701, 8287932229 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. వెబ్‌సైటులో కూడా సమాచారం అందుబాటులో ఉందన్నారు

* భాగ్యనగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్‌ (ISKCON Golden Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి