Business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్య వార్తలు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు  –  TNI  వాణిజ్య వార్తలు

* దేశీయ స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోతోంది. సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లు కుప్ప కూలింది. నిఫ్టీ కూడా 154 పాయింట్ల మేర నష్టపోయి 17800 స్థాయి దిగువకు చేరింది. అలాగే తాజా నష్టాలతో సెన్సెక్స్‌ 60వేల దిగువకు పడిపోయింది. మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 14 పాయింట్లు నష్టంతో 79.78 వద్ద ఉంది.
* యూకేలోనూ యూపీఐ చెల్లింపులు
భారత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ).. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కూ విస్తరిస్తోంది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థ ‘ది ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌.. ఇందుకోసం పేఎక్స్‌పర్ట్‌ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్‌లోని పేఎక్స్‌పర్ట్‌ ఆండ్రాయిడ్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) డివైజెస్‌ ఉన్న వ్యాపార సంస్థలన్నీ క్యూ-ఆర్‌ కోడ్‌ ఆధారిత యూపీఐ చెల్లింపులను అనుమతిస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం ముందుముందు రూపే చెల్లింపులను కూడా వీటికి అనుసంధానించే అవకాశం ఉంది.
* పెళ్లిళ్ల సీజన్.. తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సిందే అనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చే వార్తే. దాదాపు వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది కానీ పెరిగిందైతే లేదు. ఆగస్టు 13వ తేదీ నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250గా ఉంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా వెండి ధర మాత్రం తగ్గుతూనే ఉంది. మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.2400 తగ్గింది.
* మరో ఎనిమిదేళ్లలో (2030నాటికి) భారత్‌లోని మిలియనీర్ల సంఖ్య 60 లక్షలు దాటనుందని హెచ్‌ఎ్‌సబీసీ హోల్డింగ్స్‌ పీఎల్‌సీ రిపోర్టు అంచనా వేసింది. దేశ వయోజనుల జనాభాలో వీరు ఒక శాతానికి సమానమని నివేదిక తెలిపింది. కాగా, ఈ దశా బ్దం చివరినాటికి చైనా దాదాపు 5 కోట్ల మంది మిలియనీర్లను కలిగి ఉండనుందని హెచ్‌ఎ్‌సబీసీ తెలిపింది. దేశ వయోజనుల్లో మిలియనీర్ల వాటా పరంగా సింగపూర్‌ మరో 8 ఏళ్లలో ఆస్ట్రేలియాను అధిగమించనుందని, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మిలియనీర్ల రాజధానిగా అవతరించనుందని హెచ్‌ఎ్‌సబీసీ రిపోర్టు వెల్లడించింది
* దేశీయ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. వారికి ‘వేరియబుల్‌ పే’ (పనితీరు ఆధారిత చెల్లింపులు) నిలిపివేసింది. లాభాల మార్జిన్లపై ఒత్తిడితో పాటు నిపుణులు ఆశించిన మేరకు పనితీరు కనబర్చకపోవడం, సాంకేతిక పెట్టుబడులను ఇందుకు కారణంగా పేర్కొనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మేనేజర్‌ స్థాయి నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు వేరియబుల్‌ చెల్లింపులను ఈసారి పూర్తిగా నిలిపివేసిన విప్రో.. ఫ్రెషర్ల నుంచి టీమ్‌లీడర్‌ స్థాయి వరకు 70 శాతం చెల్లింపులు జరపనున్నట్లు సిబ్బందికి పంపిన ఈ-మెయిల్‌లో వెల్లడించింది. * మారుతీ సుజుకీ మార్కెట్లోకి మ రో కొత్త కారు తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కె ట్లో ఉన్న చిన్న కారు ‘ఆల్టో’కి మెరుగులు దిద్ది ‘ఆల్టో కే10’ పేరుతో ఈ కొత్త కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల మధ్యన ఉన్నాయి. 2000 సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి తొలి ఆల్టో కారును విడుదల చేయగా ఈ ఏడాది జూలై వరకు మొత్తం 43.3 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా నెక్ట్స్‌ జెనరేషన్‌ కే-సిరీస్‌ 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఆల్టో కే10.. లీటర్‌ పెట్రోల్‌కు 24.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకీ పేర్కొంది.
* దేశీయ మార్కెట్లో డీజిల్‌, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. లీటర్‌ డీజిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పేరుతో ప్రస్తుతం విధిస్తున్న ఎగుమతి సుంకాన్ని రూ.5 నుంచి రూ.7కు పెంచింది. ఏటీఎఫ్‌ ఎగుమతులపైనా లీటర్‌కు రూ.2 చొప్పున విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించింది. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఏటీఎ్‌ఫపై ఈ ట్యాక్స్‌ ఎత్తివేసింది. 15 రోజులైనా గడవక ముందే మళ్లీ ఏటీఎ్‌ఫపై ఈ భారం మోపడం విశేషం.
* భారత స్టాక్‌ మార్కెట్లో మరో కొత్త రికార్డు నమోదైంది. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి రూ.280.52 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బుల్‌ ర్యాలీ ఇందుకు దోహదపడింది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ వరుసగా ఐదో రోజూ లాభాల్లో పయనించింది. ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఆఖరి గంటలో కొనుగోళ్లతో స్వల్ప లాభాలతో గట్టెక్కింది. 37.87 పాయింట్ల లాభంతో 60,298 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 12.25 పాయింట్లు పెరిగి 17,956.50 వద్ద ముగిసింది.
* ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు గురువారం నాటి ఇంట్రా-డే లో బీఎస్‌ఈ లో 2 శాతం పెరిగి రూ. 1,332.30 వద్ద కొత్త గరిష్టానికి చేరాయి. బీమా కంపెనీ స్టాక్ గత రెండు నెలల్లో 24 శాతం ర్యాలీ చేయగా.. గత ఆరు నెలల్లో 16 శాతం పెరిగింది. ఇది ఆరు నెలల కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌ లో 4 శాతం పెరిగింది. SBI లైఫ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ.
* సూక్ష్మ రుణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) భారీగా 24 శాతం పెరిగింది. 2021–22 రూ.2,22,307 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో తాజా సమీక్షా కాలంలో రూ.2,75,750 కోట్లకు ఎగసింది.