DailyDose

కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి – TNI నేటి నేర వార్తలు

కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి –  TNI   నేటి నేర వార్తలు

* మహారాష్ట్ర నుంచి అనంతపురం జిల్లాలో కూలి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం మహమ్మారికి బలయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఈ ముగ్గురూ.. కిక్కు కోసం మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు సమీపంలోని గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి అతిగా సేవించడం వల్లే వారు మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆలమూరులో ద్రాక్ష తోటల్లో పనిచేసేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తుంటారు. ఆలమూరు వాసి పలమాసి రాజుకు చెందిన ద్రాక్షతోటలో పనిచేసేందుకు మహారాష్ట్రలోని సౌలాజి ప్రాంతానికి చెందిన భరత్‌ నామ్‌దేవ్‌ చౌహన్‌ (43), దీపక్‌ జైసింగ్‌ శిరితోడే (45), సదా (40) వచ్చారు.

* విశాఖ ఎంవీపీ కాలనీలో బుధవారం జరిగిన రౌడీషీటర్ బొడ్డు అనీల్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన బస్ డ్రైవర్ వాసుపల్లి శ్యామ్ అనే వ్యక్తి.. నగరానికి చెందిన ఎర్రయ్య, సమీర్లతో కలిసి హత్య చేసినట్టు గుర్తించామని క్రైమ్ డీసీపీ గంధం నాగన్న తెలిపారు. మృతుడు అనీల్ స్థానికంగా రౌడీయిజం చేస్తూ వేధించడంతోనే.. శ్యామ్ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిర్ధారణైనట్లు తెలిపారు. స్థానిక అనుపమ బార్లో మద్యం సేవించడానికి వెళ్ళిన సమయంలో శ్యామ్.. అనీల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని.. బార్ నుంచి బయటకు వచ్చినప్పుడు కత్తితో పొడిచి శ్యామ్ చంపి పరారైనట్లు తెలిపారు.

* కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పారిశ్రామిక వాడలోని ప్యారీ పంచదార శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘనటలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన ఓ జవాన్‌ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్‌, సుపాల్‌ జిల్లాలోని వీర్‌పుర్‌లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్‌ఎస్‌బీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ చిమాల్‌ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

* కాకినాడ ప్యారీ షుగర్స్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కన్వేయర్‌ బెల్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.

* హైదరాబాద్‌: నగరంలో అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగి ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌, మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

* వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్‌ దాఖలుచేశారు. మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయన రి మాండ్‌ ఈనెల 20వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ఆయన తరపున న్యాయవాదులు ఇప్పటికే రెండు దఫాలు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మూడో బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అయినా..ఇంతవరకూ పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబం తరపున ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం (సీఎల్‌ఏ) అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు ఈ కేసును వాదిస్తూ, నిందితుడికి బెయిల్‌ రాకుండా అడ్డుకోగలిగారు. కానీ రిమాండ్‌ విధించిన 90రోజుల వరకూ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోతే నిందితుడికి ఆటోమేటిక్‌గా బెయిల్‌ మంజూరవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కావాలనే చార్జిషీట్‌ దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అనంతబాబు అరెస్టు కోసం గట్టిగా పోరాడిన దళిత, ప్రజా సంఘాలు.. చార్జిషీట్‌ వెంటనే వేయాలంటూ మరోసారి కాకినాడలో ఉద్యమించాయి. దీంతో అరెస్టుచేసిన 88రోజుల తర్వాత పోలీసులు గురువారం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేశారు.

* కలర్‌ జిరాక్స్‌తో నకిలీ కరెన్సీ నోట్లు తయారుచేసి వాటి చెలామణికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన సయ్యద్‌ అన్సార్‌(27), హైదరాబాద్‌కు చెందిన షేఖ్‌ ఇమ్రాన్‌(33) ఉన్నారు. వీళ్ల నుంచి రూ.2.50 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని హుల్సూర్‌ ప్రాంతంలో జిరాక్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న షాకిర్‌.. కలర్‌ ప్రింటర్‌తో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించాడు. వాటిని మార్చేందుకు తన బంధువు, మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన సయ్యద్‌ అన్సార్‌ను సంప్రదించాడు. రూ.8 వేల అసలు నోట్లకు రూ.50 వేలు నకిలీ డబ్బు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌, పాత నగరంలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందిన షేఖ్‌ ఇమ్రాన్‌తో ఒప్పందం చేసుకున్న అన్సార్‌ రూ.8 వేలు అసలు కరెన్సీకి రూ.50 వేల నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రూ.2.50 లక్షల నకిలీ కరెన్సీని తీసుకునేందుకు ఇమ్రాన్‌ అంగీకరించగా.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అన్సార్‌ హైదరాబాద్‌ వచ్చాడు. మహాత్మాగాంధీ బస్టాండ్‌ ఔట్‌గేట్‌ వద్ద కరెన్సీ మార్పిడి చేసుకుంటుండగా టాస్క్‌ఫోర్స్‌, మీర్‌చౌక్‌ పోలీసులు వాళ్లని అరెస్టు చేశారు.

* స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందుకు ఓ వ్యక్తి నుంచి రూ.6000 లంచం తీసుకున్న వేములవాడ పోలీసుస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం ఈ ఘటన జరిగింది. వేములవాడలో చికిన్‌ సెంటర్‌ నిర్వహించే వేముల భరత్‌ అనే యువకునికి ఈ నెల 8న మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసు నిందితుల్లో ఒకరైన వేముల భరత్‌కు 9వ తేదీన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందున రూ.10వేలు లంచం ఇవ్వాలని భరత్‌ను డిమాండ్‌ చేశారు. దీంతో రూ.6 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన భరత్‌.. చంద్రప్రకాశ్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వేములవాడ పోలీసు స్టేషన్‌కు సమీపంలోని ఓ పండ్ల దుకాణం దగ్గర భరత్‌ నుంచి డబ్బు తీసుకుంటున్న చంద్రప్రకాశ్‌ను గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు చంద్రప్రకాశ్‌ను కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని విచారణ అనంతరం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు

* రాష్ట్రంలో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజిపల్లిలో రమావత్‌ జీవన్‌(28) వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్‌ను కొనుగోలు చేయటానికి రూ.5 లక్షల వరకు అప్పు చేశారు. వ్యవసాయం కలిసి రాకపోవటంతో అప్పు తీర్చలేనన్న బెంగతో ఉరేసుకున్నారు. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో యారవ రవీందర్‌రెడ్డి(45) తనకున్న మూడెకరాల పొలంలో సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.

* భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువతి అబార్షన్ వికటించడంతో కన్నుమూసింది. ముల్కలపల్లి మండలం వీ కే రామవరంకు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువతిని ఓ యువకుడ ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు. అయితే గర్భాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా సదరు యువకుడు భార్యభర్తలమని నమ్మించి యువతిని ఆస్పత్రిలో చేర్చాడు. కాగా అబార్షన్ వికటించి యువతి మృతి చెందడంతో యువకుడు పరారయ్యాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

* రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆరంఘర్ చౌరస్తాలో పాన్ షాప్ తెరిచేందుకు వచ్చిన రౌడీ షీటర్ ఖాజా పాషాపై మరో రౌడీ షీటర్ చిన్న అలియాస్ మోసిన్ కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఖాజా పాషా పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇరువురు హసన్‌నగర్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. గతంలో రౌడీలు జైలు శిక్షను కూడా అనుభవించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* మద్యం మత్తులో వచ్చిన ఇద్దరు యువకులు టీ స్టాల్‌ నిర్వాహకుడు లలిత్‌కుమార్‌పై దాడి చేశారు.ఈ సంఘటన కావలిలోని ఉదయగిరి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం మేరకు, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై టీ దుకాణం వద్దకు వచ్చారు. పక్క అంగట్లోకి వెళ్లి సిగరెట్లు తీసుకురమ్మని టీ షాపు నిర్వాహకుడు లలిత్‌కుమార్‌ను కోరారు. తాను పనిలో ఉన్నానని, మీరే తెచ్చుకోవాలని అతడు తెలిపాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు దుర్భాషలు ఆడుతూ విచక్షణా రహితంగా లతిత్‌కుమార్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్నవారు ‘పాపం.. వదిలేయండి’… అని కోరినా వారు వినిపించుకోలేదు. ఈ సంఘటనను కొందరు ఫోన్‌లో చిత్రీకరించగా, వైరల్‌ అయింది. దాడి విషయమై బాధితుడు రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కాగా రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా పోలీసులు స్పందించలేదు.

* మహారాష్ట్ర నుంచి అనంతపురం జిల్లాలో కూలి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం మహమ్మారికి బలయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఈ ముగ్గురూ.. కిక్కు కోసం మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు సమీపంలోని గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి అతిగా సేవించడం వల్లే వారు మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆలమూరులో ద్రాక్ష తోటల్లో పనిచేసేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తుంటారు. ఆలమూరు వాసి పలమాసి రాజుకు చెందిన ద్రాక్షతోటలో పనిచేసేందుకు మహారాష్ట్రలోని సౌలాజి ప్రాంతానికి చెందిన భరత్‌ నామ్‌దేవ్‌ చౌహన్‌ (43), దీపక్‌ జైసింగ్‌ శిరితోడే (45), సదా (40) వచ్చారు.

* ఎన్టీఆర్: జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఫెర్రీ ఘాట్‌లో పవిత్రస్నానం ఆచరించేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు అక్కడకు చేరుకుని వెంటనే ఐదుగురు విద్యార్థులను కాపాడారు. ఒక విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరందరూ కొండపల్లి బి కాలనీకి వాసులుగా గుర్తించారు. గల్లంతయిన ఒక విద్యార్థి పేరు లోకేష్‌‌గా తెలుస్తోంది. వీరందరూ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతు అయిన విద్యార్థి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బంది గాలిస్తోంది. కాగా… వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి.

*కలర్‌ జిరాక్స్‌తో నకిలీ కరెన్సీ నోట్లు తయారుచేసి వాటి చెలామణికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన సయ్యద్‌ అన్సార్‌(27), హైదరాబాద్‌కు చెందిన షేఖ్‌ ఇమ్రాన్‌(33) ఉన్నారు. వీళ్ల నుంచి రూ.2.50 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని హుల్సూర్‌ ప్రాంతంలో జిరాక్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న షాకిర్‌.. కలర్‌ ప్రింటర్‌తో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించాడు. వాటిని మార్చేందుకు తన బంధువు, మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన సయ్యద్‌ అన్సార్‌ను సంప్రదించాడు. రూ.8 వేల అసలు నోట్లకు రూ.50 వేలు నకిలీ డబ్బు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌, పాత నగరంలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందిన షేఖ్‌ ఇమ్రాన్‌తో ఒప్పందం చేసుకున్న అన్సార్‌ రూ.8 వేలు అసలు కరెన్సీకి రూ.50 వేల నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రూ.2.50 లక్షల నకిలీ కరెన్సీని తీసుకునేందుకు ఇమ్రాన్‌ అంగీకరించగా.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అన్సార్‌ హైదరాబాద్‌ వచ్చాడు. మహాత్మాగాంధీ బస్టాండ్‌ ఔట్‌గేట్‌ వద్ద కరెన్సీ మార్పిడి చేసుకుంటుండగా టాస్క్‌ఫోర్స్‌, మీర్‌చౌక్‌ పోలీసులు వాళ్లని అరెస్టు చేశారు.

* వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్‌ దాఖలుచేశారు. మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయన రి మాండ్‌ ఈనెల 20వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ఆయన తరపున న్యాయవాదులు ఇప్పటికే రెండు దఫాలు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మూడో బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అయినా..ఇంతవరకూ పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబం తరపున ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం (సీఎల్‌ఏ) అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు ఈ కేసును వాదిస్తూ, నిందితుడికి బెయిల్‌ రాకుండా అడ్డుకోగలిగారు. కానీ రిమాండ్‌ విధించిన 90రోజుల వరకూ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోతే నిందితుడికి ఆటోమేటిక్‌గా బెయిల్‌ మంజూరవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కావాలనే చార్జిషీట్‌ దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అనంతబాబు అరెస్టు కోసం గట్టిగా పోరాడిన దళిత, ప్రజా సంఘాలు.. చార్జిషీట్‌ వెంటనే వేయాలంటూ మరోసారి కాకినాడలో ఉద్యమించాయి. దీంతో అరెస్టుచేసిన 88రోజుల తర్వాత పోలీసులు గురువారం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేశారు.

* ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఇవాళ స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌సిబ్బంది తక్షణమే స్పందించి ఐదుగురు విద్యార్థులను కాపాడగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* అంబర్‌పేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ కాలేజికి చెందిన నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. సదరు విద్యార్థికి టీసీ ఇవ్వకుండా కాలేజీ ప్రిన్సిపాల్ చాలా ఇబ్బంది పెడుతున్నాడని, అందుకే అతను ఇలా చేశాడని నారాయణ స్వామి స్నేహితులు చెప్తున్నారు. క్రమంలోనే కాలేజీకి వచ్చిన సదరు నారాయణ.. టీసీ గురించి మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌ ఎదురుగానే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతనితోపాటు రక్షించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ సహా మరో ఇద్దరు విద్యార్థులకు కూడా కాలిన గాయాలైనట్లు సమాచారం.

*దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబైలోని బొరివ‌లి (వెస్ట్‌) ప్రాంతంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం, గాయ‌ప‌డిన వివ‌రాలు వెల్ల‌డికాక‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.సాయిబాబా న‌గ‌ర్‌లోని సాయిబాబా ఆల‌యం స‌మీపంలోని గీతాంజ‌లి బిల్డింగ్ మ‌ధ్నాహ్నం 12.34 గంట‌ల ప్రాంతంలో కూలిపోయింది. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న మెట్ర‌పాలిట‌న్ ఫైర్‌, ఎమ‌ర్జెన్సీ సేవ‌ల మండ‌లి, పోలీస్ సిబ్బంది స‌హాయక చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు.

* పట్ట‌ప‌గ‌లు స్టేడియంలో బాలిక‌పై లైంగిక దాడి య‌త్నానికి పాల్ప‌డిన ముగ్గురు వ్య‌క్తులు ప్ర‌తిఘ‌టించిన బాలిక‌ను పైక‌ప్పు నుంచి తోసివేసిన ఘ‌ట‌న పంజాబ్‌లోని మోగా గొదెవాలా స్టేడియంలో వెలుగుచూసింది. ఆగ‌స్ట్ 17న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో బాలిక‌కు గాయాల‌య్యాయి.ముగ్గురు నిందితుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు వారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. బాలిక స్నేహితుడు ఫోన్ చేసి ఆమెను స్టేడియానికి పిలిపించాడ‌ని అక్క‌డ మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో కలిసి బాలిక‌తో వాగ్వాదానికి దిగాడ‌ని పోలీసులు చెప్పారు.ఆపై ముగ్గురు వ్య‌క్తులు బాలిక‌పై అత్యాచార య‌త్నం చేయ‌గా ప్ర‌తిఘ‌టించ‌డంతో పైక‌ప్పు నుంచి ఆమెను కింద‌కు నెట్టివేశార‌ని తెలిపారు. కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

*కాకినాడ గ్రామీణ మండలంలోని ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది . కన్వేయర్‌ బెల్ట్‌లో పేలుడు సంబవించి ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. కొండవరంకు చెందిన రాయుడు వీరబాబుతో పాటు సామర్లకోటకు చెందిన మరో ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఘటన జరిగిన తరువాత సకాలంలో యాజమాన్యం స్పందించినట్లయితే మృతుల సంఖ్య తగ్గేదని ఆరోపిస్తూ ఫ్యా్క్టరీ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల ని డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలాన్ని రూరల్‌ ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ సందర్శించారు.

*ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఇవాళ స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌సిబ్బంది తక్షణమే స్పందించి ఐదుగురు విద్యార్థులను కాపాడగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* బీహార్‌లోని శ‌శ‌స్త్ర సీమాబ‌ల్‌లో ప‌నిచేస్తున్న తెలంగాణ‌కు చెందిన జ‌వాను చీమల విష్ణు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఎస్ఎస్బీ 45 బెటాలియ‌న్‌కు చెందిన అత‌ను సుపౌల్‌లోని వీర్‌పూర్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చుకుని విష్ణు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అత‌ని గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

*మద్యం మత్తులో వచ్చిన ఇద్దరు యువకులు టీ స్టాల్‌ నిర్వాహకుడు లలిత్‌కుమార్‌పై దాడి చేశారు.ఈ సంఘటన కావలిలోని ఉదయగిరి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం మేరకు, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై టీ దుకాణం వద్దకు వచ్చారు. పక్క అంగట్లోకి వెళ్లి సిగరెట్లు తీసుకురమ్మని టీ షాపు నిర్వాహకుడు లలిత్‌కుమార్‌ను కోరారు. తాను పనిలో ఉన్నానని, మీరే తెచ్చుకోవాలని అతడు తెలిపాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు దుర్భాషలు ఆడుతూ విచక్షణా రహితంగా లతిత్‌కుమార్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్నవారు ‘పాపం.. వదిలేయండి’… అని కోరినా వారు వినిపించుకోలేదు. ఈ సంఘటనను కొందరు ఫోన్‌లో చిత్రీకరించగా, వైరల్‌ అయింది. దాడి విషయమై బాధితుడు రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కాగా రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా పోలీసులు స్పందించలేదు.

* రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌పై మరో రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆరంఘర్ చౌరస్తాలో పాన్ షాప్ తెరిచేందుకు వచ్చిన రౌడీ షీటర్ ఖాజా పాషాపై మరో రౌడీ షీటర్ చిన్న అలియాస్ మోసిన్ కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఖాజా పాషా పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇరువురు హసన్‌నగర్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. గతంలో రౌడీలు జైలు శిక్షను కూడా అనుభవించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

*భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువతి అబార్షన్ వికటించడంతో కన్నుమూసింది. ముల్కలపల్లి మండలం వీ కే రామవరంకు చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువతిని ఓ యువకుడ ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు. అయితే గర్భాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా సదరు యువకుడు భార్యభర్తలమని నమ్మించి యువతిని ఆస్పత్రిలో చేర్చాడు. కాగా అబార్షన్ వికటించి యువతి మృతి చెందడంతో యువకుడు పరారయ్యాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

* రాష్ట్రంలో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజిపల్లిలో రమావత్‌ జీవన్‌(28) వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్‌ను కొనుగోలు చేయటానికి రూ.5 లక్షల వరకు అప్పు చేశారు. వ్యవసాయం కలిసి రాకపోవటంతో అప్పు తీర్చలేనన్న బెంగతో ఉరేసుకున్నారు. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో యారవ రవీందర్‌రెడ్డి(45) తనకున్న మూడెకరాల పొలంలో సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంటలు సక్రమంగా పండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.

*స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందుకు ఓ వ్యక్తి నుంచి రూ.6000 లంచం తీసుకున్న వేములవాడ పోలీసుస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం ఈ ఘటన జరిగింది. వేములవాడలో చికిన్‌ సెంటర్‌ నిర్వహించే వేముల భరత్‌ అనే యువకునికి ఈ నెల 8న మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసు నిందితుల్లో ఒకరైన వేముల భరత్‌కు 9వ తేదీన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందున రూ.10వేలు లంచం ఇవ్వాలని భరత్‌ను డిమాండ్‌ చేశారు. దీంతో రూ.6 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన భరత్‌.. చంద్రప్రకాశ్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వేములవాడ పోలీసు స్టేషన్‌కు సమీపంలోని ఓ పండ్ల దుకాణం దగ్గర భరత్‌ నుంచి డబ్బు తీసుకుంటున్న చంద్రప్రకాశ్‌ను గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు చంద్రప్రకాశ్‌ను కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని విచారణ అనంతరం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు

* మహారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని బోరివాలి ప్రాంతంలో శుక్ర‌వారం నాలుగంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలింది. సాయిబాబా న‌గ‌ర్‌లో గీతాంజ‌లి బిల్డింగ్ మ‌ధ్నాహ్నం 12.34 గంట‌ల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలుతున్న సమయంలో భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం అకస్మాత్తుగా కూలుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

* కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి వద్ద ప్యారి షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిశ్రమలో కన్వేయర్ బెల్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. 8 మంది గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు, ప్రజా సంఘాలు పరిశ్రమ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంతో చర్చలు జరిపి ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్పడంతో కార్మికులు శాంతించారు.

* కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కోసురువారిపాలెంకు చెందిన నలుగురు యువకులు ఎడ్లబండి కడిగేందుకు కృష్ణా నది వద్దకు వచ్చారు. బండిని కడుగుతున్న సమయంలో యువకులు నదిలో పడిపోయారు. గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను కాపాడగా.. మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన శశిధర్, వెంకటేశ్‌ కోసం పోలీసులు, సహాయ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

* పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఓ దొంగను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. జిల్లాలోని కదిరి మండలం మల్లయ్య గారిపల్లి గ్రామంలోని ఓ పొలంలో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధురాలు మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో వెనుక వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వెళ్లి అతడిని అడ్డుకుని.. దొంగను పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆ ఊరి గ్రామస్థులు దొంగను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. బంగారు గొలుసు లాక్కెళ్లి న వ్యక్తి కదిరి పట్టణానికి చెందిన శివ కుమార్గా గుర్తించిన స్థానికులు.. అక్కడి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపహరణకు గురైన గొలుసుతో పాటు దొంగను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లు వెల్లడించారు.

* శ్రీ సత్యసాయి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి తేజస్విని చికిత్స కోసం పోలారక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని శ్రీనివాసపురంకి చెందిన శంకరమ్మ అంజప్ప తనకల్లు మండలం దిగువ తోట్లపల్లి లోని బంధువుల ఇంట్లో జరిగిన కేశఖండన వేడుకలో పాల్గొని మనవరాలుతో కలిసి సొంత ఊరికి తిరుగుప్రయాణంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాఘవేంద్ర స్వల్పంగా గాయాలతో కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.