DailyDose

బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రయత్నంలో కేసీఆర్‌ – TNI నేటి తాజా వార్తలు

బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రయత్నంలో కేసీఆర్‌ –  TNI  నేటి  తాజా వార్తలు

* బీహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని, దీనికి ప్రజలు మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

* అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు మనాలిలో చిక్కుకుపోయారు. మనాలి నుంచి చండీగఢ్‌ వెళ్లే మార్గంలో లారీపై బండరాళ్లు పడటంతో లారీ బోల్తా పడింది. దాంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విశాఖకు చెందిన 95 మంది కార్పొరేటర్ల బృందం మనాలిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నది.

*అనంతపురం: జిల్లాలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిన నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాతూరు కూరగాయల మార్కెట్ను పరిశీలించి కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. కొత్తిమీర కట్ట అమ్ముతూ ఏపీసీసీ చీఫ్ని రసన వ్యక్తం చేశారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ… వైసీపీ (YCP) హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతోనే నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయని తెలిపారు. నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు శైలజానాథ్ వెల్లడించారు.

*బార్ అసోసియేషన్ కష్టాలు తనకు తెలుసని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు సముదాయాన్ని ఎన్వీ రమణ (NV Ramana) ప్రారంభించారు. అనంతరం జస్టిస్ మాట్లాడుతూ… విజయవాడ కోర్టు కాంప్లెక్స్ను సరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. భవన నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలంటే కేంద్రం నుంచి వ్యతిరేకిత వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఏపీ సీఎం (AP CM), బెంగాల్ సీఎం (Bengal CM) తమకు మద్దతు ఇచ్చారన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోవద్దని అన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

*మోదీ ప్రభుత్వం ఇందిరా గాంధీ కుటుంబంపై కక్ష కట్టిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. తిరుపతిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి చింతా మోహన్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పై పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని అన్నారు. చైనా .. ఇండియాపై కాలుదువ్వుతున్నప్పటికీ మోదీ సర్కార్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం.. బీజేపీ (BJP) సర్కార్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

*గుంటూరు: జిల్లాలోని తాడికొండ అధికార పార్టీ రాజకీయాలు రోడ్డెక్కాయి. తాడికొండ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. వైసీపీ అధిష్ఠాన నిర్ణయంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. డొక్కా నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి, అనుచరుల బైఠాయించారు. దాంతో సుచరిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

*గుంటూరు: జిల్లాలోని తాడికొండ అధికార పార్టీ రాజకీయాలు రోడ్డెక్కాయి. తాడికొండ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. వైసీపీ అధిష్ఠాన నిర్ణయంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. డొక్కా నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి, అనుచరుల బైఠాయించారు. దాంతో సుచరిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

* జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో డెంగీ విజృంభిస్తోంది. వాదే ముస్తఫా బస్తీకి చెందిన ఇద్దరు, పహాడిషరీ్‌ఫలో ఇద్దరు, బిస్మిల్లాహ్‌ కాలనీలో ఒకరు, కొత్తపేట్‌లో ఒకరు డెంగీ బారిన పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డెంగీ ప్రభలడంతో బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అనుమానితుల రక్త నమూనాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, నీరసంగా ఉన్న వారి వివరాలు తెలుసుకుంటున్నారు. డెంగీ కేసులు గుర్తించిన పరిసర ప్రాంతాల్లోని యాభై ఇళ్లల్లో ఉంటున్న వారిని పరీక్షించి, జ్వరాలు ఉన్నవారికి సేవలు అందిస్తున్నామని డాక్టర్‌ శారద తెలిపారు. దోమల నియంత్రణకు పిచికారీ చేయిస్తున్నట్లు కమిషనర్‌ వై. సుదర్శన్‌ తెలిపారు.

*శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4.10 తర్వాత నిమిషాల వ్యవధిలోనే వేగంగా కురిసిన వర్షంతో రోడ్లపై వరద ప్రవాహం కనిపించింది. పాఠశాలల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో పడిన వర్షంతో పిల్లలు, తల్లిదండ్రులు తడిసి ముద్దయ్యారు. రాగల రెండు రోజులపాటు గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 29.5 మిల్లీమీటర్లు కురిసింది. శివరాంపల్లిలో 25.5, జియాగూడ, శాస్ర్తిపురంలో 24.8, గన్సీబజార్‌లో 22.5, జూపార్కు వద్ద 21.0, రాజేంద్రనగర్‌లో 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

*హైదరాబాద్‌ తొలి మేయర్‌ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ శుక్రవారం జరిగింది. జూబ్లీ బస్టాండ్‌ ఎదురుగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మేయర్‌గా కృష్ణస్వామి ముదిరాజ్‌ చేసిన సేవలను తలసానితోపాటు ముదిరాజ్‌ సంఘం నాయకులు కొనియాడారు.

*ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. దీంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాక ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.

*ఈసారి యూఎస్‌ ఓపెన్‌ పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేతలు ఏకంగా రూ. 20.77 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ అందుకోనున్నారు. రన్నర్‌పకు రూ. 10.38 కోట్లు లభిస్తాయి. నిరుడు విజేతకు రూ. 19 కోట్లుగా ఉండేది. కాగా..టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 479.40 కోట్లుగా నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత ఏడాది మొత్తం ప్రైజ్‌మనీ రూ. 455.40 కోట్లు. ఈ ఏడాది మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌ల మొత్తం ప్రైజ్‌మనీ కంటే.. యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ ఎక్కువ కావడం విశేషం. మెయిన్‌ డ్రాలో అడుగుపెట్టిన వారికి రూ. 64 లక్షలు అందజేస్తారు. రెండో రౌండ్‌లో ఓడితే రూ. 80 లక్షలు, క్వార్టర్‌ఫైనల్‌ చేరితే రూ. 3.55 కోట్లు, సెమీఫైనల్లో అడుగుపెడితే రూ. 5.63 కోట్లు అందజేస్తారు.

*టోక్యో పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రో చాంపియన్‌ సుమిత్‌ అంటిల్‌, డిస్కస్‌ త్రో రజత పతక విజేత యోగేశ్‌ కుతునియా ఇండియా ఓపెన్‌ జాతీయ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో రికార్డు ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం జరిగిన పోటీల్లో సుమిత్‌ ఎఫ్‌64 ఈవెంట్‌లో జావెలిన్‌ను ఏకంగా 68.62 మీటర్లు త్రో చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటేనున్న 68.55 మీటర్ల రికార్డును అధిగమించాడు. యోగేశ్‌ డిస్క్‌ను 48.34 మీటర్లు విసిరి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.

*గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి. సురే్‌షరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను అనంతపురం, బళ్లారి బాస్కెట్‌బాల్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రేవతి, ఆంజనేయులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

*ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియోని ఢిల్లీలోని కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎస్‌ నవితమ్మ డిమాండ్‌ చేశారు. ఎంపీ మాధవ్‌ కులం బోర్డు తగిలించుకుని, కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

*‘మంకీపాక్స్‌’ను నిర్ధారించే టెస్టింగ్‌ కిట్‌ను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. మెడ్‌టెక్‌ జోన్‌లోని ‘ట్రాన్సాసియా ఎర్బా’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను గాజువాక సమీపంలోని మెడ్‌టెక్‌ జోన్‌ ప్రాంగణంలో ఆవిష్కరించారు. మంకీపాక్స్‌పై ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించిన తరువాత.. ట్రాన్సాసియా సంస్థ దీనిపై పరిశోధనలు సాగించి కిట్‌ తయారీని ప్రారంభించింది. అత్యంత సున్నితత్వంతో కూడిన ఆర్టీపీసీఆర్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా డాక్టర్‌ అజయ్‌కుమార్‌ సూద్‌, డాక్టర్‌ బలరామ్‌ భార్గవ మాట్లాడుతూ.. ఈ టెస్టింగ్‌ కిట్‌ వల్ల వేగంగా వ్యాధి బారిన పడినవారిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

*ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశాలకు అధికారులు షెడ్యూల్‌ రూపొందించారు. రెండు విడతల్లో ప్రవేశాలు కల్పించనుండగా.. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. నేషనల్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) అడ్మిషన్లపై శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 2022-23 విద్యాసంవత్సరానికిగాను రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ కాలేజీ, 11 ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 830 సీట్లున్నాయి. వీటిని కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణానికి ఇండెంటు పెట్టింది. సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ అప్పు తీసుకోనుంది. ఈ నెల 23న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే వేలం పాట ద్వారా రుణాన్ని సేకరించనుంది. రాష్ట్రంతో కలిపి 5 రాష్ట్రాలు రూ.6,800 కోట్ల రుణాలను తీసుకోనున్నాయి.

*’వరద బాధితులను ఆదుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటూ పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా నిలువునా ముంచేస్తున్నాయి’’ అంటూ సీపీఎం రాష్ట్ర కమిటీ మండిపడింది. విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజులు జరగనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన తొలిరోజు సమావేశంలో సీపీ ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఎం.ఎ.బేబీ, ఇతర ముఖ్యనేత లు పాల్గొన్నారు. గోదావరి వరద బాధితుల న్యాయమైన డిమాండ్లను తక్షణ మే పరిష్కరించాలని కోరుతూ తీర్మానించారు. జూలైలో వచ్చిన వరదల నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదని, ప్రభుత్వ అందిస్తున్న సహాయం అరకొరగా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.

*నీట్‌, జేఈఈ 2023 ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు డిజిటల్‌ మెటీరియల్‌ రూపొందించినట్లు ఐఐటీ-జేఈఈ, నీట్‌ ఫోరం తెలిపింది. కాన్సె్‌ప్టలు, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుతో కోటా గ్రాండ్‌ టెస్ట్‌లు, సొల్యూషన్లు, ప్రీవియస్‌ టెస్ట్‌లు, ర్యాంక్‌ బూస్టర్‌ టెస్ట్‌లు, ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్న పత్రాలు, టెస్ట్‌ సిరీస్‌ ఇందులో ఉంటాయని వివరించింది. ఈ మెటీరియల్‌ కావాల్సినవారు ‘నీట్‌ 2023’ లేదా ‘జేఈఈ 2023’ అని టైప్‌ చేసి 9849016661కు వాట్సాప్‌ చేయాలని ఓ ప్రకటనలో సూచించింది.

*జూనియర్‌ లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరిగా ఉండాలన్న తాజా ఆదేశాలకు అనుగుణంగా స్కూల్‌ అసిస్టెంట్లకు జేఎల్‌ పదోన్నతులు కల్పించాలని జేఎల్‌ పదోన్నతుల పోరాట వేదిక గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు.

*పదకొండవ పీఆర్‌సీ రికమెండ్‌ చేసిన క్యాడర్‌ వారీ పేస్కేళ్లను షెడ్యూల్‌ రూపంలో అన్ని శాఖలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ బృందం హామీ ఇచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘కొత్త పీఆర్‌సీ అమలైన వెంటనే 130కి పైగా డిపార్ట్‌మెంట్ల శాఖాధిపతులకు సంబంధిత పేస్కేల్‌ షెడ్యూల్‌ను అందిస్తారని చెప్పారు. పీఆర్‌సీపై ఇప్పటివరకు షెడ్యూల్‌ ఇవ్వలేదని మంత్రుల బృందం దృష్టికి తీసుకురాగా తక్షణం శాఖలన్నింటికీ పంపేందుకు హామీ ఇచ్చారు’’ అని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీకి సంబంధించి ఆర్థికశాఖ అధికారులతో తక్షణమే పీటీడీ పేస్కేల్స్‌ ఆమోదించి పంపాలని కోరినట్టు తెలిపారు. తాము అడగకపోయినా కార్పొరేషన్‌, యూనివర్సిటీ, గురుకుల ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 ఏళ్ళు వర్తింప జేయడంపై వీలైనంత త్వరలో ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రివర్గ బృందం హామీ ఇచ్చినట్టు తెలిపారు.

*రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చాపల వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు అతిపెద్ద సాహసం చేశారు. ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఆగస్టు 15వ తేదీన అధిరోహించారు. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల మధ్య పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాహసయాత్ర కోసం 10వ తేదీన మాస్కో చేరుకున్న ఈ దంపతులు.. 15వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఎలబ్రస్‌ శిఖరాగ్రానికి చేరుకున్నారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఆవిష్కరించి, అజాదీ కా అమృత మహోత్సవ్‌ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాగా, విజయలక్మీ.. త్రిపురారం మండలం కంపాసాగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

*అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌లో దోపిడీకి గురైన నగలు దాచిన అచ్చరపాక్కం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తూ గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12న ఫెడ్‌బ్యాంక్‌లో 32 కిలోల బంగారు నగలను ఆ బ్యాంక్‌ ఉద్యోగి మురుగన్‌తో మరో ఆరుగురు దోపిడీ చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోపే ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు జరిపిన విచారణలో మురుగన్‌ అనుచరుడు సంతోష్‌ తన తోడల్లుడైన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ ఇంట్లో 3.5కిలోల బంగార నగలను దాచినట్లు తేలింది. అమల్‌రాజ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు, ఆయన భార్యనూ నిందితురాలిగా చేర్చారు.

*దేశ ఆర్థిక భవిష్యత్‌పై కంపెనీలు, వినియోగదారుల దృక్పధంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ముందు ముందు లాభాలకు ఢోకా ఉండదని కంపెనీలు భావిస్తుంటే, వినియోగదారులు మాత్రం ఆదాయాలు, కొలువులు అంత ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నారు. కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సీసీఎస్‌), ఇండస్ట్రియల్‌ ఔట్‌లుక్‌ సర్వే (ఐఓఎస్‌) పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల నిర్వహించిన రెండు సర్వేల్లో ఈ విషయం తేలినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేర్కొంది. పారిశ్రామిక, వినియోగదారుల అభిప్రాయాల్లో గతంలో ఎన్నడూ ఇంత తేడా లేదని తెలిపింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే సీసీఎస్‌ గత ఏడాది సెప్టెంబరు నాటికి సగానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్‌ త్రైమాసికానికి ఇది కోలుకుని 76.6 పాయింట్లకు చేరింది. గత ఏడాది కాలంగా ఐఓఎస్‌ మాత్రం 110 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. లాభాలపై పారిశ్రామిక రంగం గత రెండు దశాబ్ధాల్లో ఎన్నడూ ఇంత ఆశాజనకంగా లేదు.

* నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చాపల వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు అతిపెద్ద సాహసం చేశారు. ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఆగస్టు 15వ తేదీన అధిరోహించారు. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల మధ్య పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాహసయాత్ర కోసం 10వ తేదీన మాస్కో చేరుకున్న ఈ దంపతులు.. 15వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఎలబ్రస్‌ శిఖరాగ్రానికి చేరుకున్నారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఆవిష్కరించి, అజాదీ కా అమృత మహోత్సవ్‌ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాగా, విజయలక్మీ.. త్రిపురారం మండలం కంపాసాగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

* తెలంగా ణ భాషా సాంస్కృతిక శాఖ, జీఎన్‌ఆర్‌ యాడ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో రవీంద్రభారతి వేదికగా యాడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. ఈమేరకు శుక్రవారం వర్క్‌షా్‌పనకు సంబంధించిన పోస్టర్‌ను రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహికులు ఈ వర్క్‌షా్‌పను సద్వినియోగించుకోవాలని అన్నారు. వివరాలకు 9014198366, 7661085248, 9392462676 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

* తెలంగాణ ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతికుమార్‌ హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసి న చిత్రాలను వారు తిలకించారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టీపీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్‌, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, టీఈఎంజేయూ అధ్యక్షుడు ఇస్మాయిల్‌, యోగి, వినయ్‌ మడపు, శ్రీనివా్‌సశెట్టి, సర్వే్‌షరెడ్డి, చిన్న యాదగిరిగౌడ్‌, ముజిబ్‌, పరమేశ్వర్‌, శ్రీనివాస్‌, కృష్ణ తదిరులు పాల్గొన్నారు. పోటీలకు 256 ఎంట్రీలు రాగా 626 ఫొటోలకు గాను 504 చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు.

*కృష్ణా నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధి విధానాలను రూపొందించడానికి కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ (రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) ఈనెల 23న ఉద యం 11 గంటలకు బోర్డు కార్యాలయంలో సమావేశం కానుంది.