DailyDose

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు – TNI తాజా వార్తలు

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  ఏపీ  హైకోర్టు నోటీసులు – TNI తాజా వార్తలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలపై దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.వంశీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాలు, చిన్న తరహా ఖనిజాల వెలికితీయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు వ్యాపారులు అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె.శేషుకుమార్‌ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్‌ ఈ వాజ్యాన్ని దాఖలు చేశారు.

*టెన్త్ పరీక్షలు 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి 6 పేపర్ల విధానం అమలుపై జీవో విడుదల చేసింది. గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు నిర్వహించింది. కొవిడ్కా రణంగా టెన్త్ పరీక్షలు 7 పేపర్లకు కుదిచింది. తాజాగా ఆరు సబ్జెక్టులకు 6 పేపర్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు రాయాలని జగన్స ర్కార్ నిర్ణయం తీసుకుంది.

*అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. గడపగడపకు కార్యక్రమంలో అర్బన్‌ ఆర్‌ఐ గోపినాథ్‌పై వైసీపీ నేత ఉమర్, కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. గతంలోనూ భూ వ్యవహారంలో ఆర్‌ఐ గోపినాథ్‌పై ఉమర్‌ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

*ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం నేపథ్యంలో.. ఏపీలో కూడా లిక్కర్ మాఫియా గుట్టు బయటపడకుండా ఉండేందుకు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ . విజయసాయి రెడ్డి అల్లుడి సన్నిహితుడితో జగన్‌ లిక్కర్ మాఫియా నడిపిస్తున్నాడని విమర్శించారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతమ్మ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గొడ్డలి వేటు గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు ఢిల్లీ స్థాయిలో జగన్ లాబీయింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు జగన్ చేసిందేమీ లేదని, పోలవరం కోసమే ఢిల్లీ పర్యటన అనే ప్రకటన పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ నేడు కేసుల కోసం అదే కేంద్రం ముందు మోకరిల్లుతుందడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

*సచివాలయ ఉద్యోగులు ఎవరు చెపితే డబ్బులు వసూలు చేశారని, సస్పెండైన ఉద్యోగులు తప్పు చేయడానికి కారణం ఎవరు? అని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులకు, అధికారులకు తెలియకుండా సచివాలయ ఉద్యోగులు ధైర్యంగా గ్రూప్‌లో వాయిస్ పంపి.. ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. నంద్యాల మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తే ఏ పనైనా జరుగుతుందని భూమా బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు.

*హైదరాబాద్‌లో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Sha)ను జూ. ఎన్టీఆర్ (NTR) కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishna Reddy) స్పష్టత నిచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో అమిత్ షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్ సినిమా అంశాలే మాట్లాడుకున్నారని, వారి మధ్య రాజకీయ చర్చలు రాలేదని చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలపైనే ఎక్కువగా చర్చించారని చెప్పారు. అమిత్‌, ఎన్టీఆర్ భేటీపై విమర్శలకు తాను స్పందిచనని, ఏమైనా ఉంటే వారినే అడగాలని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.

*సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్‌ లేఖ రాశారు. విద్యుత్ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో 26 వేల మంది ఒప్పంద కార్మికులు… ఉద్యోగ భద్రత లేకుండా వారంతా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

*నంద్యాలలో కానిస్టేబుల్ (Constable) సురేంద్రనాధ్ హత్య (Murder) కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జిల్లా అదనపు జడ్జి అర్చన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడంతో భారీ బందోబస్తు మధ్య ఎనిమిది మంది నిందితులను పోలీసులు కడప సెంట్రల్‌ జైల్‌కు తరలించారు.

*పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై మంత్రి జోగి రమేష్అ నుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జనసైనికులు ఆందోళనకు దిగారు. జోగి రమేష్‌కు శవయాత్ర నిర్వహించి.. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. మంత్రి జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ బీసీ ద్రోహి అని, కులాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. పెడన నియోజకవర్గ ప్రజలకు, పవన్ కళ్యాణ్‌కు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్‌కు సిగ్గుంటే ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. బూతులతో మంత్రి పదవి తెచ్చుకున్న జోగి రమేష్ సంస్కారహీనుడని, మంత్రిని వైసీపీ వాళ్లే తరిమికొట్టే రోజులు వస్తాయని రామ్ సుధీర్ అన్నారు.

* సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు కోల్పోయారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో కేటాయించిన ఇంటికి కూడా ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉంటే ఇప్పుడు ఈ జగన్ రెడ్డి ప్రభు( త్వం ప్రభుత్వ స్థలం ఆక్రమించాడని కూలగొట్టడానికి అర్ధరాత్రి వెళ్లడం దొంగల పని అని మండిపడ్డారు. నిజంగా ఆక్రమిస్తే ప్రభుత్వం వారు కొలతలు కొలిచి, నోటీసులు ఇచ్చి తదుపరి కార్యాచరణ చేయాలి కానీ అది చేయకుండా కక్షపూరితంగా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. గత మునిసిపల్ ఎన్నికలలో వైసీపీ (YCP) కౌన్సిలర్‌ను ఓడించి టీడీపీ కౌన్సిలర్‌గా టీడీపీ తరఫున గెలిచాడన్న అక్కసుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి తమ యువ నాయకుడు లోకేష్ వెళితే అడ్డుకుంటారా అని అన్నారు. ఇదే విధానం టీడీపీ హయాంలో అనుసరించి ఉంటే జగన్ రెడ్డి అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసేవారా అని బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు.

*పీ కి పట్టిన రాహు – కేతువులు బీజేపీ (BJP), వైసీపీ (YCP)లు అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి (Tulasi reddy) అని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను బీజేపీ, వైసీపీలు ప్రశ్నార్థకం చేశాయని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ(AP)ని బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. ఏపీలో లాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా రాజ్యమేలుతోందని అన్నారు. బీజేపీ, వైసీపీలను తరిమికొడితేనే ఏపీ బాగుపడుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

*బానిస రాజకీయాలకు బీజేపీ (BJP) తెర లేపిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోశారన్నారు. తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించ పరిచారని మండిపడ్డారు. మునుగోడు ఆత్మగౌరవం చెబుతున్న బీజేపీ … తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ , షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని తెలిపారు. భారత రాజ్యాంగం సమానాత్వన్ని ప్రొత్సహిస్తుంటే… బీజేపీ బానిసత్వాన్ని ప్రొత్సహిస్తోందన్నారు. బీజేపీ మనువాదంతో… స్త్రీ సమానత్వాన్ని కోరదని చెప్పారు. బీజేపీ విధానాల వల్లే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తప్ప మరెవరు చేరలేదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

*కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందుంటుందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందన్న దానిపై అమిత్‌షా మాట్లాడలేదన్నారు. రాజకీయ మీటింగ్‌లకు జనం ఎలా వస్తారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ అవినీతి పరుడని బీజేపీ చెబుతున్నప్పడు ఆయనపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

*జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఒకేసారి ఐదు రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని శాపూర్‌నగర్‌లోని రామ్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా రియాక్షన్ అయ్యి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడతో స్దానికులు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులుతీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

*యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్‌ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు బంగారంతో లాకెట్లను తయారు చేయించారు. ఒక్కో లాకెట్‌ను 3 గ్రాముల బంగారంతో తయారు చేశామని, లాకెట్‌ ధర రూ.17,500గా నిర్ణయించామని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. రెండు బంగారు లాకెట్లను విక్రయించినట్లు వెల్లడించారు. కొండపైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన దేవస్థాన ప్రచార శాఖ ద్వారా లాకెట్‌ విక్రయాలు జరుపుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం 60 లాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, వెండి, రాగి లోహాలతోనూ లాకెట్లను తయారు చేస్తున్నామని, అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.