DailyDose

భారత్ లో త్వరలో 5G సేవలు – TNI నేటి తాజా వార్తలు

భారత్ లో త్వరలో 5G సేవలు  –  TNI  నేటి  తాజా వార్తలు

*5జీ టెలికం సేవలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాకపోతే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 5జీ సేవలు ఆరంభంలో అందుబాటులో ఉండవు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే ముందుగా ఈ సేవలు మొదలవుతాయి. తర్వాత కొంత కాలానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఇవి చేరువవుతాయి. ఎందుకంటే టెలికం కంపెనీలు 5జీ సేవలకు వీలుగా తగిన పరికరాలను దేశవ్యాప్తంగా అన్ని టవర్ల పరిధిలో ఏర్పాటు చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ఈ నెలలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4జీ సేవలతో పోలిస్తే 5జీలో వేగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముందుగా 5జీ సేవలు హైదరాబాద్ తో పాటు, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్ కతా, లక్నో, ముంబై, పూణెలో మొదలు కానున్నాయి. ఇక ఈ పట్టణాల పరిధిలోనూ కవరేజీ పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకూ ఉంటుందా? అంటే కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా ప్రారంభమయ్యే పట్టణాల్లోనూ 5జీ సేవలు ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు. పూర్తి స్థాయి ఫలితాల విశ్లేషణ తర్వాత మిగిలిన ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావచ్చు.

* క్రాంగెస్‌ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈ మేరకు సోనియాగాంధీ మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ద్రౌపది ముర్ముని కలిసి ఆమెని అభినందించారు. ఇటీవలే సోనియా గాంధీ రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతుంది.

* జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించనున్నారాయన.అలాగే వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌తో పాటు జగనన్న గృహనిర్మాణ పథకం, ఇళ్ళ పట్టల పంపిణీపైనా సమీక్ష నిర్వహిస్తారు. టిడ్కో ఇళ్లపై దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష సర్వే పైనా సమీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న పిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

* విధి నిర్వహణలో ఎదుర్కొన్న అభియోగాలు రుజువుకావటంతో ఒక సిఐ,మరొక కానిస్టేబుల్ ను సర్వీసు ‌నుండి తొలగిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విజయవాడ లోని భవానీపురం పోలీస్ స్టేషన్ల్ లో యస్ ఐ గా పనిచేసిన యు. రామారావు,గాలి వీరేంద్రబాబు ల పై వచ్చిన ఆరోపణల పై జరిపిన విచారణలో ఇద్దరూ దోషులని తేలటంతో ఇద్దరినీ ఉద్యోగం నుండి తొలగించారు..ప్రస్తుతం సిఐ రామారావు రాజమహేంద్రవరం డిటిసిలో పనిచేస్తుండగాజనన కానిస్టేబుల్ వీరేంద్ర విజయవాడ సీసీయస్ లో పనిచేస్తున్నాడు..

* ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన కాకతీయ యూనివ‌ర్సిటీ 22వ స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం ఉద‌యం 10:30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంద‌ని యూనివ‌ర్సిటీ వీసీ తాటికొండ ర‌మేశ్ తెలిపారు.

* కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బయో పెట్రోల్ వినియోగించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లాలోని నాగవరం, అంకుర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన‌ బయో పెట్రోల్ పంపులను మంత్రి నిరంజ‌న్ రెడ్డి, క‌లెక్ట‌ర్ షేక్ యాస్మిన్ భాష క‌లిసి మంగ‌ళ‌వారం ప్రారంభించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో తుగ్లక్‌ పాలన కొనసాగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పన్నుల పేరిట ప్రజల నడ్డి విరుస్తున్న జగన్‌ ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా కొత్తకొత్తవాటిపై పన్నులు వేయడం సిగ్గుచేటని అన్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు వేసే పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని పేర్నొన్నారు.

* కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు 25 వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే . తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు ఈ అవకాశం కల్పించింది. అయితే తన బెయిల్‌ను మరో 11 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఇవాళ ఆయన హైకోర్టులో లంచ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరి కొద్ది సేపట్లో పిటిషన్‌పై వాదనలు జరుగనున్నాయి.మరోవైపు అతడి రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్‌పై రేపు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ సాగనుంది. మే 19న రాత్రి కాకినాడలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం అనంతబాబు మే 23న అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంచారు. మూడు నెలలుగా పోలీసులు హత్య కేసుపై ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

* పార్టీ గుర్తుపై శివసేన వర్గాల వాదనలను రాజ్యంగ విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు మంగళవారంనాడు అప్పగించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మధ్య పార్టీ గుర్తు విషయంలో నడుస్తున్న పోరాటానికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలను విస్తృత ధర్మసనం ముందు అత్యున్నత న్యాయస్థానం ఉంచింది. గుర్తు కేటాయింపు వ్యవహారంపై వచ్చే గురువారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌ ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఈనెల 25న దీనిపై విచారణ జరుపనుంది

* హితకరిని సమాజం కళాశాలకు చెందిన కాలేజ్ భూములు విద్య శాఖకు అప్పగిస్తామని చెపుతున్నమని మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ తెలిపారు. విద్యాశాఖ కాలేజ్‌ల తరహాలో దీనిని రన్ చేసే ఏర్పాటు చేస్తుంది అని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏడెడ్ పేరుతో ఎస్‌కేవీటీ కళాశాల స్వాధీనానికి ప్రభుత్వ ప్రయత్నం? చేస్తుందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు యూనిఫాం అమలు చేస్తామన్నారు.

* ఈనెల 26న సీఎం విశాఖపట్నం వస్తున్నారని, సముద్రములో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, మళ్లీ ఉపయోగించే అంశంపై పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ నెల 26 న25 వేల మందితో 39 లోకేషన్స్‌లో సముద్రంలో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరిస్తామన్నారు. సముద్రంలో సేకరించిన వ్యర్ధాలను అడిడాస్ షూస్ తయారీలో ఉపయోగిస్తారని చెప్పారు. అదే రోజున మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన 9200 మందికి సీఎం చేతుల మీదగా సర్టిఫికెట్లు అందించనున్నారని తెలిపారు.

* స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.స్వాతంత్ర సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని అని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు

* రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం, పార్టీ ‘ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌’, అనుకూల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ అగ్ర నేతలు వరుస పర్యటనలతో దుమ్మురేపుతు న్నారు. గత నాలుగు నెలల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పలుమార్లు తెలంగాణలో పర్యటించి వివిధ సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు అమిత్‌ షా రాగా, ఈ నెల 27న హనుమకొండలో సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర–3 ముగింపు బహిరంగసభకు నడ్డా రానున్నారు.

ఇటీవల అమిత్‌ షా రాష్ట్రంలో మూడుసార్లు పర్యటించగా, నడ్డా కూడా మూడోసారి రాను న్నారు. మే 26న ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టు సభ లో, జాతీయ కార్యవర్గభేటీ సందర్భంగా జూలై 3న పరేడ్‌ గ్రౌండ్స్‌ బహిరంగసభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే దాకా ప్రతీ నెలా రెండురోజులపాటు తెలంగాణలో పర్యటించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు అమిత్‌ షా సైతం ప్రకటించారు. నడ్డా సమక్షంలో మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీలో చేరనున్నారు.

* పద్మ అవార్డులు–2023కు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది.ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్‌ ఇన్‌ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్‌ గోపాలరత్న–2022కు, నేషనల్‌ వాటర్‌ అవార్డ్స్‌కు సెప్టెంబర్‌ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్‌–2023కి అక్టోబర్‌ 31 చివరి తేదీ అని వివరించింది.

*లఖింపూర్‌ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే.

*టీవీ యాంకర్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌(43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి గుండె పోటుతో అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. 2006లో టీవీ యాంకర్‌గా, టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సోనాలి ఫోగట్‌.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. టిక్‌ టాక్‌ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పుంజుకుంది. దీంతో బీజేపీ ఆమెను స్టార్‌ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది. సోషల్‌ మీడియాలో సోనాలికి ఫాలోయింగ్‌ ఎక్కువే.2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్‌ నేత కుల్దీప్‌ బిష్ణోయ్‌ చేతిలో ఓడిపోయారు. అయితే.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్‌.. బీజేపీలో చేరారు.

*తాడేపల్లి: జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించనున్నారాయన. అలాగే వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌తో పాటు జగనన్న గృహనిర్మాణ పథకం, ఇళ్ళ పట్టల పంపిణీపైనా సమీక్ష నిర్వహిస్తారు. టిడ్కో ఇళ్లపై దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్‌.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష సర్వే పైనా సమీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న పిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

*పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో టీ-5 బ్లాకులో రూ.83.78 కోట్ల విలువైన పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థకు 60 సీ కింద నోటీసులు అందజేసింది. వెలిగొండ టీ-5 బ్లాకులో తీగలేరు బ్రాంచి కెనాల్‌లో భాగంగా మట్టిపనులు, టెయిల్‌ ఎండ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పనులు మిగిలున్నాయి. ఈ పనులు పూర్తి చేస్తే 11,500 ఎకరాలకు సాగు నీరు అందుతుందని జల వనరుల శాఖ చెబుతోంది. కాంట్రాక్టు సంస్థ నుంచి పనులు తొలగించి, కొత్తగా టెండర్లను పిలుస్తామని సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొం ది. ప్రస్తుతం టీ-5 పనులను హైదరాబాద్‌కు చెందిన మెసర్స్‌ జైప్రకాశ్‌, గాయ త్రీ జాయింట్‌ వెంచర్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పనులను వాటి నుంచి తొలగించి కొత్త సంస్థకు అప్పగించాలన్న యోచనలో జల వనరుల శాఖ ఉంది. మట్టి పనులు, కాలువ నిర్మాణం పనులు చేయడం అత్యంత సులభమైనవి కావడంతో తమకు అనుకూలమైన సంస్థకు అప్పగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

* పార్టీ గుర్తుపై శివసేన వర్గాల వాదనలను రాజ్యంగ విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు మంగళవారంనాడు అప్పగించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మధ్య పార్టీ గుర్తు విషయంలో నడుస్తున్న పోరాటానికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలను విస్తృత ధర్మసనం ముందు అత్యున్నత న్యాయస్థానం ఉంచింది. గుర్తు కేటాయింపు వ్యవహారంపై వచ్చే గురువారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌ ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఈనెల 25న దీనిపై విచారణ జరుపనుంది

* విద్యుత్‌ సంస్థల్లో ఇంజనీర్‌ ఉద్యోగం. నెలకు రూ.90 వేల దాకా జీతం. 30 ఏళ్ల సర్వీసు పూర్తైతే నెలకు రూ.4 లక్షల పైనే వస్తుంది. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకొంటారా.. ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ కొలువులను ఐదుగురు ఇంజనీర్లు వద్దనుకున్నారు. 42 ఏఈ-ఎలక్ట్రికల్‌, 26 ఏఈ-సివిల్‌ ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్‌కో ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, ఎంపికైనవారిలో ఐదుగురు(ఏఈ-ఎలక్ర్టికల్‌కు ఎంపికైన పులవర్తి రఘు ఆదిత్య, కాపర్తి ప్రపుల్ల, పెద్దెల్లి శేఖర్‌.. ఏఈ-సివిల్‌కు ఎంపికైన సయ్యద్‌ జాబేర్‌, పత్తిపాక రజనీకాంత్‌) ఉద్యోగాల్లో చేరలేదు. వీరి కోసం కొన్ని రోజులు ఎదురుచూశారు. ఎంతకీ విధుల్లో చేరకపోవడంతో సోమవారం వారి నియామకాలను రద్దు చేశారు. ఈ మేరకు సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కన్నా మెరుగైన జీతం ఉన్న ఉద్యోగాలు వచ్చినందువల్లే విధుల్లో చేరలేదని అధికారులు గుర్తించారు.

*రాష్ట్రంలో 5 నెలలుగా జీతాల్లేక ఇబ్బంది పడుతున్న గెస్ట్‌ లెక్చరర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో టీచర్లు, విద్యా వాలంటీర్లు, గెస్ట్‌ లెక్చరర్లు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు జీతాలు రాక అత్యహత్యలు చేసుకుంటున్నారన్నారు. చేసిన పనులకు డబ్బులు రాక కాంట్రాక్టర్లు, బిల్లులు రాక సర్పంచ్‌లు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం వండిపెట్టే వారికి జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఈటల ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇలాంటి తిరోగమనంలో ఉన్న కేసీఆర్‌ పాలనను ప్రోగ్రెసివ్‌గా ఉందంటూ వామపక్ష పార్టీలు మద్దతివ్వడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.

*స్వాతంత్య్ర సమర యోధురాలు, రచయిత్రి, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవన పునరుద్ధరణకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమాయత్తమైంది. భవనాన్ని పునరుద్ధరించే పనులను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ)కు అప్పగించినట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు. ఈ భవనాన్ని 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ భవనంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున అబిడ్స్‌లో 1.66 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కాంప్లెక్స్‌లో మూడు నిర్మాణాలు ఉన్నాయి.

*విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. థర్డ్‌ పార్టీ వ్యవస్థను రద్దు చేసి.. యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్ప యాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామనే తాను ఈ లేఖ రాసినట్లు లోకేశ్‌ తెలిపారు.

*గ్రంథాలయ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ త్వరలో ఉత్తర్వులు విడుదలవుతాయని, ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కళ్లేపల్లి మధుసూదన్‌ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు ఆమోదం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 40 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వారంతా జీవో రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

*ఆడిట్‌ శాఖలో సీనియర్‌ ఆడిటర్లకు వర్క్‌ అలాట్‌మెంట్‌ తగ్గించి కొత్త విధానంలో ఏఏవోలకు కేటాయించడంపై ఏపీ స్టేట్‌ ఆడిట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడిట్‌శాఖ సీనియర్‌ ఆడిటర్లు సోమవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. డైరెక్టరును కలిసి తమ డిమాండ్లు ఏకరువుపెట్టారు. చర్చల అనంతరం, వర్క్‌ అలాట్‌మెంట్‌లో పాత విధానాన్నే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్‌ తమకు హామీ ఇచ్చినట్లు ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షులు బీవీఎ్‌సఎన్‌ రవిశంకర్‌, ఎం.అభిరామ్‌ తెలిపారు.

*చేపల చెరువుల్లో వరి పండించినట్టు ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలకు పాల్పడినందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 23 మంది ఆర్బీకే అసిస్టెంట్లను జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సోమవారం సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో 10 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఈ-క్రా్‌పలో తప్పుగా నమోదు చేశారు. అలాగే ఒక ఎకరం పైబడి ఈ-క్రా్‌పలో తప్పుగా నమోదు చేసిన మరో 84 మంది ఆర్బీకే అసిస్టెంట్లకు చార్జీ మోమోలు జారీ చేశారు.

*హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారికి.. చట్ట నిబంధనల మేరకు 14 ఏళ్లు శిక్ష పూర్తికాకుండానే క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఎలా విడుదల చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవిత ఖైదుపడినవారు సత్ప్రవర్తన కలిగి, 14 ఏళ్లు జైలుశిక్ష పూర్తి చేసుకుని ఉంటేనే క్షమాభిక్షకు అర్హులని గుర్తు చేసింది. ప్రభుత్వ జీవోను పరిశీలిస్తే.. 14 ఏళ్ల కాలాన్ని తగ్గించినట్లు కనబడుతోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం పై వివరాలు సమర్పించి, వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. తన భర్తను హత్య చేసిన కేసులో జీవిత ఖైదుపడిన ఎనిమిది మంది నేరస్థులు పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్‌ రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్‌రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, యల్లసిరి మస్తాన్‌, కలతూరు సుధాకర్‌రెడ్డి, చెన్నూరు వెంకటరమణారెడ్డిలను ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష పెట్టి, విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు.
*దేశవ్యాప్తంగా ఆదివాసీల అభివృద్ధి, వికాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్టు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అధికార యంత్రాంగం, క్షత్రియ సేవా సమితి నిర్వహించిన మన్యం (రంప) తిరుగుబాటు శతాబ్ది ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత, అల్లూరి దాడి చేసిన పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నూతనంగా ఆయన భారీ విగ్రహాన్ని కేంద్రమంత్రులు అర్జున్‌ ముండా, కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో అర్జున్‌ ముండా మాట్లాడారు. ‘‘దేశ ప్రజలు స్వేచ్ఛాయుత జీవితాన్ని సాగిస్తున్నారంటే అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే. వివిధ రాష్ట్రాల్లో నివాసముంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

* బీజేపీ రాష్ట్రంలో మరో బహిరంగ సభకు సిద్ధమవుతోంది. బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ నెల 27న వరంగల్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

* తెలుగువారితో పాటు, దేశ ప్రజలంతా సిగ్గుపడే పనిచేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకపోవడం జగన్మోహన్‌రెడ్డి అసమర్ధతకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో ఆయన మాటాడారు. సిగ్గులేని పనిచేసి కమ్మ సామాజిక వర్గంపై నిందలేస్తావా అని మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవాడలో నిర్వహించడం ద్వారా మరో చారిత్రక ఘట్టం నమోదవుతుందని మహాసభల ఆహ్వాన సంఘం ప్యాట్రన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరావు అన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో మహాసభల ఆహ్వాన సంఘ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు

*కాంగ్రెస్‌ పార్టీ 2024లో అధికారంలోకి రాకపోతే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐయూడబ్ల్యూఈసీ జాతీయ చైర్మన్‌ ఉదిత్‌రాజ్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆలిండియా అనార్గనైజ్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ కాంగ్రెస్‌ (ఏఐయూడబ్ల్యూఈసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభకు ఉదిత్‌రాజ్‌తోపాటు, పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదిత్‌రాజ్‌ మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల కోసం కాంగ్రెస్‌ పాలనలో అనేక చట్టాలు, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసిందన్నారు. అయితే బీజేపీ వాటిని నిర్వీర్యం చేసిందని.. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందని ఆరోపించారు.

*కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి శంషాబాద్‌ నొవాటెల్‌ హోటల్లో ఈ భేటీ జరిగింది. ఎన్టీఆర్‌ అమిత్‌షాకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువా కప్పి, సన్మానించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను షా వీక్షించారు. అందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటనను ఆయన ప్రశంసించినట్లు తెలిసింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పాల్గొన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది.

* ఇకపై జగన్‌ సర్కార్‌తో యుద్ధమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పలాస టూర్‌కు అనుమతి లేదని లోకేష్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి హైదరాబాద్ (Hyderabad) బయల్దేరారు. ఈ సందర్బంగా లోకేశ్ మాట్లాడుతూ కోర్టు అనుమతితో మళ్లీ పలాస వస్తానన్నారు. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తానని చెప్పారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. కావలిలో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబానికి ఫోన్‌లో పరామర్శించారు. కరుణాకర్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి సురేశ్రెడ్డి లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని యువకుడు సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకుపైగా సమయం పట్టగా, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

*ఆర్థిక ఇబ్బందులు భరించలేక, కుటుంబ పోషణ భారమై తన ముగ్గురు పిల్లలతోసహా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్వచ్ఛంద సంస్థ సకాలంలో స్పందిం చడంతో తల్లీపిల్లల ఊపిరి నిలిచింది. వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం చీలాపూర్‌ గ్రామానికి చెందిన వరమ్మ భర్త, అత్తమామలు ఆర్థిక ఇబ్బందులతో కొన్ని రోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆమె తన ముగ్గురు పిల్లలనూ పోషించడం కోసం కూలీ పనులు చేస్తున్నారు. ఆమెకున్న ఎకరం పదిగుంటల భూమిలో ఇటీవలే అప్పుల కింద అదే గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డి కొంత భూమిని లాక్కున్నారని తెలుస్తోంది. ఈ అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో వరమ్మ విరక్తి చెంది పిల్లలతోసహా చనిపోవడానికి సిద్ధపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ‘ఫార్మర్‌ ఫస్ట్‌’ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళితే పరిష్కారం దొరుకుతుందని సూచించామన్నారు. వెంటనే సంస్థ చైర్మన్‌ చక్రధర్‌గౌడ్‌తో వరమ్మను మాట్లాడించామన్నారు. ఆయన గ్రామానికి చేరుకొని వరమ్మ ఆర్థిక ఇబ్బందులపై ఆరా తీశారు. ఆ కుటుంబానికి తోడుగా మేమున్నామంటూ రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. దీంతో వాళ్లకు జీవితంపై ఆశ చిగురించిందని స్థానికులు పేర్కొన్నారు.

*గన్‌తో సంచరిస్తున్న మహారాష్ట్ర గ్యాంగ్‌ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్టేషన్‌ హోంగార్డు వెంకట్రాములు ను ఆదివారం గోషామహల్‌లోని హోంగార్డు కమాండర్‌ కార్యాలయంలో తెలంగాణ స్టేట్‌ హోంగార్డ్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కొత్వాల్‌ దయానంద్‌ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి హోంగార్డు ధైర్యసాహసాలతో పనిచేసి, ఉన్నతాధికారుల మన్ననలను పొందాలన్నారు. సీఎం కేసీఆర్‌ హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న వెంకట్రాములు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. నిందితులను చూసి, అనుమానించి, వారి బ్యాగులు వెతకగా తుపాకీ దొరకడంతో వారిని అరెస్ట్‌ చేశారు.

*శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,69,206 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,75,043 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

*తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన వీఆర్‌ఏలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో ప్రత్యేక ధూంఽధాం కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల జిల్లాల్లో మహిళా వీఆర్‌ఏలు బోనాలు ఎత్తగా.. పురుషులు పోతురాజుల వేషంలో విన్యాసాలు చేసి నిరసన తెలిపారు. రంగారెడ్డి, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, మహబుబాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కూడా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల పీర్ల ఊరేగింపు, ప్రధాన చౌరస్తాల్లో అలాయ్‌ బలాయ్‌, కర్రసాము లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

*మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం కూడా టీఆర్‌ఎ్‌సకే మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై పార్టీ ప్రకటన చేయనుంది. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సివస్తుందో కేడర్‌ను ఒప్పించి ఆ తర్వాత ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం ముఖ్యనేత ఒకరు తెలిపారు.

*మావోయిస్టు ముఖ్యనేతల తలలపై ములుగు జిల్లా పోలీసులు రివార్డులు ప్రకటించారు. ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌ ఏజెన్సీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మావోయిస్టులు నేతలు కుర్సం మంగు అలియాస్‌ భద్రు, పాపన్న, కుంజా వీరయ్య అలియాస్‌ లచ్చన్న, లక్ష్మణ్‌, కోవాసి గంగ అలియాస్‌ మహేష్‌, జనార్దన్‌, మడకం సన్నల్‌ అలియాస్‌ మంగు, కోవాసి రాము ఫొటోలతో ఈ పోస్టర్లను ముద్రించారు. ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రివార్డులు ప్రకటించారు. వారి సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

* మిగులు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో ఘోరంగా విఫలమై, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని దుమ్మెత్తిపోశారు. ఆమె ప్రారంభించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర శనివారం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలానికి చేరింది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేసీఆర్‌ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రి చేయడం వంటి ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్‌, ప్రజలను మోసం చేశారు’’ అని షర్మిల స్పష్టం చేశారు.

*జగన్‌ రెడ్డి పాలన రాష్ట్రంలో మరో దళితుడికి ఉరి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది… రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడన్న దానిపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనపై ఆయన శనివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్‌ అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను రూ.లక్షలు ఖర్చుచేసి సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనీయకుండా వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకొంటున్నట్లు కరుణాకర్‌ తన లేఖలో తెలిపాడు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యునిగా ఉన్న జగదీశ్‌ రెడ్డి ఆగడాలకు జగన్‌ రెడ్డి ముందుగానే అడ్డుకట్ట వేసి ఉంటే ఇప్పుడు ఈ దళిత సోదరుని ప్రాణాలు పోయేవి కావు. కరుణాకర్‌ ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి.. ఒక కుటుంబం రోడ్డున పడటానికి కారణమైన వారిపై ఇప్పటికైనా పోలీసులు చర్య తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఘటనకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

* రాజధాని అమరావతిపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం రాజధాని రైతులు అన్నమయ్య పేరుతో పాదయాత్ర చేపట్టారు. అనంతవరం వేంకటేశ్వరుని సన్నిధి నుంచి వెంకటపాలెం శ్రీవారి సన్నిధి వరకు ఈ యాత్ర జరిగింది. తొలుత అనంతవరంలో ఈ యాత్రను గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. పొంగళ్లతో స్వామి వారి చిత్రపటాలను పట్టుకుని రైతులు, మహిళలు దొండపాడు, లింగయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం గ్రామాల మీదగా సుమారు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అమరావతి కోసం జీవనాధారమైన భూములను ఇస్తే వైసీపీ ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు. సెప్టెంబరు 12వ తేదీకి అమరావతి ఉద్యమం 1000 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా చేపట్టే అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర విజయవంతం చేయాలని శ్రీవారిని మొక్కుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నేత పువ్వాడ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

*ప్రధాన మంత్రి అనుసుచిత్‌ జాతి అభ్యుదయ యోజన(పీఎం-అజయ్‌) పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆదాయం పొందే స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన శనివారం తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆదాయం గడించే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.

*ప్రధాన మంత్రి అనుసుచిత్‌ జాతి అభ్యుదయ యోజన(పీఎం-అజయ్‌) పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆదాయం పొందే స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన శనివారం తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆదాయం గడించే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.

*ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌కు విశాఖపట్నం నుంచి ప్రత్యేక వారాంతపు రైళ్లు ప్రవేశపెడుతున్నట్టు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు గమనించాలని కోరారు.

* జగన్‌ రెడ్డి పాలన రాష్ట్రంలో మరో దళితుడికి ఉరి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది… రోజుకో దళితుడు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడన్న దానిపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనపై ఆయన శనివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్‌ అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను రూ.లక్షలు ఖర్చుచేసి సాగుచేసిన చేపల చెరువుల్లో పంటను అమ్ముకోనీయకుండా వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకొంటున్నట్లు కరుణాకర్‌ తన లేఖలో తెలిపాడు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యునిగా ఉన్న జగదీశ్‌ రెడ్డి ఆగడాలకు జగన్‌ రెడ్డి ముందుగానే అడ్డుకట్ట వేసి ఉంటే ఇప్పుడు ఈ దళిత సోదరుని ప్రాణాలు పోయేవి కావు. కరుణాకర్‌ ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి.. ఒక కుటుంబం రోడ్డున పడటానికి కారణమైన వారిపై ఇప్పటికైనా పోలీసులు చర్య తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఘటనకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

* కడప నగరంలోని ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలపై సీఐడీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో నకిలీ పాస్‌పోర్టులు, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ), స్టాంపింగ్‌ ఫోర్జరీ చేసి మహిళలను గల్ఫ్‌ దేశాలకు పంపిస్తుండగా కడపకు చెందిన పలువురు ట్రావెల్‌ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు సీఐడీ బృందం శనివారం కడపకు చేరుకుని ఇక్కడి కృష్ణా సర్కిల్‌, మాచుపల్లె బస్టాండ్‌ వద్ద ఉన్న ట్రావెల్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రికార్డులతో పాటు పలు పాస్‌పోర్టులు, పీసీసీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వన్‌టౌన్‌ సీఐ నాగరాజును వివరణ కోరగా సీఐడీ పోలీసులు వచ్చింది వాస్తవమేనని.. ఇతర సమాచారం తమకు తెలీదన్నారు.

*ఆమె ఓ రిటైర్డ్‌ టీచర్‌. ఇటీవల ఆమె వాట్సాప్‌ నంబర్‌కు గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. ఆమె దాన్ని ఓపెన్‌ చేసి చూసింది. అంతే.. అప్పటి నుంచి ఆమె ఖాతాలోని నగదు రూ.20 వేలు, రూ.40 వేలు, రూ.80 వేలు లెక్కన రెట్టింపుగా కట్‌ అయింది. ఇలా సైబర్‌ నేరగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ.21 లక్షలు కాజేశారు. దీంతో ఆమె శనివారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ వరలక్ష్మి వాట్సా్‌పకు ఇటీవల ఒక మెసేజ్‌ వచ్చింది. అది ఏమిటో తెలియక ఆమె పలుమార్లు ఓపెన్‌ చేసింది. ఆ తర్వాత నుంచి ఆమె ఖాతాలో నగదు కట్‌ అయినట్టు సందేశాలు వస్తున్నాయి. అనుమానం వచ్చి బ్యాంకు అధికారులకు చూపించగా.. ఆమె ఖాతా హ్యాక్‌ అయినట్టు తేలింది. దీంతో ఆమె శనివారం సైబర్‌ క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జ్ఞానప్రకాశ్‌ ఖాతాలోని రూ.12 లక్షలు ఇటీవల సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ ఘటనపై శుక్రవారమే టూటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆ మరుసటి రోజే వరలక్ష్మీ ఖాతాలోని రూ.21 లక్షలు మాయమైనట్టు ఫిర్యాదు అందింది.

*విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా 50జీవ ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రూ.25.41లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేశారు.
*చేపల చెరువులో దిగుబడిని అమ్ముకోనివ్వకుండా వైసీపీ (YSRCP) నేతలు కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వేధించడంతోనే కావలిలో కరుణాకర్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్న జగదీష్‌రెడ్డి ఆగడాలకు సీఎం జగన్‌ ముందుగానే అడ్డుకట్టవేసుంటే.. కరుణాకర్‌ ప్రాణాలు పోయేవికాదన్నారు. భూదందాలు, సెటిల్మెంట్లను దాటిన వైసీపీ నేతల ధనదాహం..ఇప్పుడు వ్యక్తుల ప్రాణాలను కూడా మింగేస్తోందని విమర్శించారు. వైసీపీ రాక్షసులను కట్టడి చేయడంలో ఆపార్టీ ఉదాసీనంగానే వ్యవహరిస్తోందని, ఘటనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

* దేశ విద్యాసంస్థల్లో విదేశీ విద్యార్థులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో వారికి 25ు సూపర్‌ న్యూమరరీ సీట్లను సృష్టించాలని నిర్ణయించింది. ఆయా కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు గతవారం ‘భారత్‌లో యూజీ, పీజీ ప్రోగ్రామ్స్‌ అంతర్జాతీయీకరణ’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో యూజీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌ జగదేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో యూజీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

* దేశ సరిహద్దులు, సముద్ర తీరం వెంబడి నిఘా కోసం అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్‌ సాయుధ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్‌ అగ్రరాజ్యం అమెరికాతో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ డీల్‌ విలువ సుమారు రూ.23,977 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంక్యూ-9బీ డ్రోన్లు.. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ), సముద్ర తీర ప్రాంతంలో నిఘా, జలాంతర్గాముల దాడులను గుర్తించడం, స్థిరమైన భూ లక్ష్యాలను ఛేదించడం వంటి వివిధ పాత్రలు నిర్వర్తించగలవు. గతనెల కాబూల్‌లో అల్‌ కాయిదా నేత జవహరిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన ఎంక్యూ-9 డ్రోన్‌కు ఈ ఎంక్యూ-9బీ డ్రోన్‌ మరింత అధునాతన వెర్షన్‌.