NRI-NRT

కెనడాలో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

కెనడాలో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్‌గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్‌ ఫిలిప్‌్ళలో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్‌ నాథన్‌ ఫిలిప్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి.ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Whats-App-Image-2022-08-23-at-1-15-55-PM-1
ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్‌ వైదేహి భగత్‌ భారత్‌లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్‌ టవర్‌ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్‌ చేశారు.
Whats-App-Image-2022-08-23-at-1-15-54-PM
అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు.అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది. కెనడాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారు ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
parade