DailyDose

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య – TNI నేటి నేర వార్తలు

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య –  TNI   నేటి నేర వార్తలు

* బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సురేష్‌ హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి సురేష్‌ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, మృతుడు ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ప్రేమవ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

* చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బానాల విజయ కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి.. తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో చెన్నూరు శివారులోని సుద్దాల ఎక్స్‌రోడ్‌.. ఎన్‌హెచ్‌63 హైవే వద్దకు రాగా.. సుద్దాల నుంచి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ద్విచక్ర వాహనంపై ఆటోను ఢీకొట్టాడు.

* ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, కృష్ణ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి . బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీకి చెందిన నాయకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.చంద్రగిరి నుంచి చిలకలూరిపేటకు బయలు దేరిన టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యలో లారీని ఢీ కొనగా చంద్రగిరి మండలం టీడీపీ యూత్‌ అధ్యక్షుడు భానుప్రకాశ్‌(31) మృతి మృతి చెందాడు. తిరుపతి జిల్లా టీడీపీ కార్యదర్శి గంగుపల్లి భాస్కర్‌కు గాయాలయ్యాయి.కృష్ణ జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారి వద్ద లారీని వెనుకనుంచి కారు ఢీ కొనగా ఏపీ జెన్‌కో ఉద్యోగి వరప్రసాద్‌ భార్య మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలకు చిక్కుకుని ఎందరో విలవిల్లాడుతున్నారు. రోజుకో రకం చీటింగ్‌తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా వీరి వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నగదు మాయమైంది. ఈ ఘటన విశాఖలోని ద్వారాకానగర్‌లోని యూనియన్‌ బ్యాంకులో చోటుచేసుకున్నది.

* తిరుపతి: జిల్లాలోని చిలకలూరిపేట వద్ద ఘోర రొడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్ళుతున్న లారీని కారు ఢీ కొన్న ప్రమాదంలో చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డి (బన్ని) మృతి చెందాడు. చిత్తూరు పార్లమెంటు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి బాస్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. చిలకలూరిపేటలో చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని పీఏ వీజిత్ వివాహానికి వెళ్ళుతుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

* హ‌ర్యానాకు చెందిన బీజేపీ నేత‌, న‌టి సోనాలి ఫోగట్ క‌న్న‌మూశారు. గోవా టూర్‌లో ఉన్న ఆమెకు తీవ్ర గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు. బిగ్ బాస్ 14లో ఆమె చివ‌రిసారి క‌నిపించారు. వైల్డ్‌కార్డ్ తో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ త‌ర్వాత పాపుల‌ర్ స్టార‌య్యారు. సోనాలికి ఒక కూతురు ఉన్న‌ది. 2019 హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసింది. టిక్‌టాక్‌లోనూ సోనాలికి పాపులారిటీ ఉంది. ఏక్ మా జో లాకోం కి లియే బ‌నీ అమ్మా అనే టీవీ సీరియ‌ల్‌లో న‌టించింది. కొన్ని హ‌ర్యానా చిత్రాల్లో న‌టించారు. పంజాబీ, హ‌ర్యాన్వీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆమె క‌నిపించింది. ద స్టోరీ ఆఫ్ బ‌ద్మాష్‌ఘ‌ర్ వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది. సోనాలి భ‌ర్త సంజ‌య్ ఫోగ‌ట్ 2016లో అనుమానాద‌స్ప రీతిలో త‌న ఫామ్‌హౌజ్‌లో మృతిచెందిన విష‌యం తెలిసిందే.

* పంట కాల్వలో కారు బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు-అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. మృతులంతా మహిళలే. వీరంతా భీమవరం కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.భీమవరం కొత్త బస్టాండ్ సమీపంలో నివసించే మహబూబ్ బాషా బంధువుల వివాహం ఏలూరులో జరిగింది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు అమరజహాన్ (50), మహ్మద్ షంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45) తోపాటు అమర్‌జహాన్ కుమారుడు కమల్ బాషా, ఎండీ రహీమాలు కారులో బయల్దేరారు. వివాహం అనంతరం తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు కారులో భీమవరం బయలుదేరారు. వల్లూరు వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని పంట కాల్వలోకి దూసుకెళ్లింది.స్థానికులు వెంటనే కారులో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు నీటిలో సగం వరకు మునిగిపోవడంతో కారులో ఉన్న అమర్‌జహాన్, మహ్మద్ షంషాద్‌, ఫాతిమా జహర్బీ అనే ముగ్గురు మహిళలు ఊపిరాడక కారులోనే చనిపోయారు. కారు నడుపుతున్న అమర్‌జహాన్‌ కుమారుడు కమల్‌బాషా, ఎండీ రహీమాలను స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడికి సంబంధించిన ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మొత్తం 26 మందిపై ఐసీపీ 341, 147, 148, 353, 332, 509 రెడ్‌విత్‌ 149 సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సోమవారం బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.

బీజేపీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే అవకాశం ఉన్నది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ నేతలను అరెస్టు చేయలేదని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

* కడప పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు తమిళ ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలు స్వాధీన పరుచుకున్నారు. సిద్ధవటం వైపు నుంచి నాలుగు చక్రాల వాహనాల్లో స్మగ్లర్లు… ఎర్రచందనం దుంగలు వేసుకొని వెళ్తుండగా జేఎంజే కళాశాల వద్దకు రాగానే పోలీసులను చూసి స్మగ్లర్లు వాహనాన్ని వదిలేసి సమీపంలోని పాలకొండలోకి పరుగులు తీశారు. పోలీసులు స్మగ్లర్లను వెంబడించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చేజింగ్లో ఎట్టకేలకు ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు.

*లైంగిక వేధింపులతో మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన మాళవిక(19) ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై హరిప్రియ, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మాళవిక ఇంటర్‌ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన సంగాల సాయి, మాళవిక ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి ఆమె ఫొటోలు తీసుకున్నాడు. మాళవిక ఆచిత్రాలను తొలగించాలని వేడుకుంది.

*గోరంట్ల మండలంలోని చింతలపల్లికి చెందిన ప్రియురాలు బోయ రామకుమారి ఇంట్లో ప్రియుడు ఈడిగ సురేష్‌ (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

*అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన కౌలు రైతు దశరథుడు (50) అప్పుల బాధ భరించలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దవడుగూరు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దశరథుడు పొలం కౌలుకు తీసుకుని, పంటలు సాగు చేస్తుండేవాడు. మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో నష్టాలపాలయ్యాడు. సాగు కోసం చేసిన రూ.8లక్షల అప్పఉ తీర్చే మార్గంలేక ఆవేదన చెందుతుండేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

*తల్లిని కడతేర్చేందుకు ప్రయత్నించిన ఓ కుమారుడు.. తండ్రి చేతిలో హతమయ్యాడు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కిల్లాం గ్రామానికి చెందిన గొలివి సూర్యనారాయణ, పోలమ్మ కుమారుడు రాము కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. విధుల్లో అలసత్వం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంటికి వచ్చేశాడు. మూడేళ్లుగా మద్యానికి బానిసై తల్లిదండ్రులపై దాడులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తల్లిపై ఇనుపరాడ్డుతో దాడి చేస్తుండగా సూర్యనారాయణ అడ్డుకున్నాడు. అదే రాడ్డుతో రాము తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

* అమ లాపురం సావరం రోడ్డులో యువకులు గంజా యి సేవిస్తున్నారన్న సమాచా రంతో పట్టణ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌ఐ టి.శ్రీనివాస్‌ పోలీసులతో ఆదివారం దాడి నిర్వహించారు. గంజాయి తాగుతున్న ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అమలాపురానికి చెందిన నలుగురు, ముమ్మిడివరం, రావులపాలెం ప్రాంతాల కు చెందిన మరో నలుగురిని అరెస్టు చేసి అమలాపురం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన వారిలో విత్తనాల అవినాష్‌, సాధనాల హరీష్‌, చోడపనీడి రాజు, రాయుడు సూరిబాబు, త్రిపురాని సాయిసూర్యజగదీష్‌, పలివెల చరణ్‌, యాగా వీరబాబు, కడలి గణేష్‌ ఉన్నారు. వీరికి కోర్టు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

*నెల్లూరు: జిల్లాలోని కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో దారుణం చోటు చేసుకుంది. దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి సురేశ్రెడ్డి లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని యువకుడు సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు.

*లోన్‌యాప్‌ (Loan App) వేధింపులకు మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు రుణ గ్రహీత రాజేంద్రప్రసాద్‌(35) ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆయన బంధువులకు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజేంద్రప్రసాద్ పురుగు మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. దండేపల్లి మండలం మామిడిపల్లిలో ఈ ఘటన జరిగింది. లోన్‌యాప్‌ నిర్వాహకులపై మృతుడి బంధువులు మండిపడుతున్నారు.
*అబార్షన్‌ వికటించి యువతి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి గర్భవతిని చేసిన వివాహితుడు అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించగా వైద్యం వికటించడంతో శుక్రవారం ఆ యువతి మృతిచెందింది.

*రాజస్థాన్‌లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్‌పూర్‌లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులు జైసల్మేర్‌లోని రామ్‌దేవరా ఆలయాన్ని దర్శించుకుని తిరుగుపయాణమయ్యారని, ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీని ఓ లారీ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

*బేగంబజార్‌ మార్కెట్‌లో నకిలీ అల్లం వెల్లులిని వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.5 లక్షల విలువైన 650 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆసి్‌ఫనగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జాఫర్‌ ఆలం (38) ఓ గదిని అద్దెకు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసే చిన్నపాటి ఫ్యాక్టరీని ప్రారంభించాడు. పేస్ట్‌ నిల్వ ఉండేందుకు కొంతకాలంగా సిట్రిక్‌ యాసిడ్‌ను కలుపుతున్నాడు. మాలకుంట ప్రాంతానికి చెందిన సోమనాథ్‌ శెట్టి (50) జాఫర్‌ నుంచి ఈ పేస్ట్‌ను కొనుగోలు చేసి, ప్రజలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌, బేగంబజార్‌ పోలీసులు ఆలం ఇంటిపై దాడి చేసి 650 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

* ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ మరో కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవసరానికి అప్పు తీసుకున్న కుటుంబ పెద్ద, యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సుల్తాన్‌బజార్‌ పోలీసుల కథనం ప్రకారం.. రాంకోఠిలో ఉండే సి.చైతన్య యాదవ్‌(40)కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో లోన్‌ యాప్‌ చిచ్చు రేపింది. గతంలో ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా చైతన్య లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో యాప్‌ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చైతన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య సెల్‌ఫోన్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులు లోన్‌ యాప్‌ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

*లోన్‌ యాప్‌ నుంచి రుణం తీసుకొని చెల్లించినా వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీయాక్ట్‌ ప్రయోగించారు. వెస్ట్‌బెంగాల్‌ ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షోయబ్‌ అక్తర్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వద్ద టెలీకాలర్‌. లోన్‌ తీసుకొని చెల్లించిన వారికి కూడా డబ్బులు కట్టాలంటూ వేధించేవాడు. ఇతడిపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులు నమోదయ్యాయి. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. అతడిపై రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌ పీడీయాక్ట్‌ నమోదు చేశారు.

*ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి (36) ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఆయన నివాసం ఉంటున్న అవంతి అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి సమయంలో ఉరేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మణిపాల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన రెడ్డి అండ్‌ రెడ్డి అనే కంపెనీని నిర్వహిస్తున్నారని, అప్పుడప్పుడు కుంచనపల్లిలోని నివాసానికి వస్తుంటారని వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు.. లేదంటే కుటుంబ కలహాల కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆత్మహత్య విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

* హోటల్‌ నుంచి తెచ్చుకున్న బిర్యానీ తిని కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురికాగా ఓ బాలుడు మృతి చెందాడు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ మారుతీనగర్‌కు చెందిన రాంబాబు ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 13న రాత్రి లక్డీకాపూల్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఈ కుటుంబం రెండు చికెన్‌ బిర్యానీలు తెచ్చుకొని తిని పడుకున్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. పక్కింటి వారు తలుపు తీసి చూడగా ఇంట్లో రాంబాబుతో పాటు భార్య త్రివేణి, కొడుకు గౌతం నంద(10), కూతురు నిహారిక అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు నీళ్లు చల్లగా త్రివేణి మత్తుగా లేచినా మిగతా ముగ్గురు లేవలేదు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షించగా అప్పటికే గౌతం నంద మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాంబాబును, నిహారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్రివేణి ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ ఎస్‌ఐ నవీన్‌ విచారిస్తున్నారు. బిర్యానీ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపారు.

*రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్‌ రామ్‌దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

* ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా చేశాడని, ప్రియుడితో సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. భర్తను ప్రియుడితో చంపించింది ఓ భార్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సింగరేణిలో కార్మికుడిగా పనిచేసే కోరుకొప్పుల రాజేందర్‌(35)ను శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండం రాజు, అతడి స్నేహితుడు సయ్యద్‌ కాల్చి చంపారు. హతుడు రాజేందర్‌ భార్య రవళికి, నిందితుడు బండం రాజుకు మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. అయితే రవళి తల్లిదండ్రులు ఏడేళ్ల క్రితం రాజును కాదని ఆమె మేనబావ రాజేందర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ, పెళ్లి తరువాత కూడా బండం రాజుతో రవళి సంబంధాలు కొనసాగించింది. దీనిపై రాజేందర్‌ పలుమార్లు అడ్డు చెప్పాడు. దీంతో రవళి, రాజు ఇద్దరూ రాజేందర్‌ను చంపాలని పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఆ ఘటనల నుంచి రాజేందర్‌ బయట పడడంతో ఇంట్లోనే హత్య చేయాలని కుట్ర పన్నారు. శుక్రవారం రాత్రి రాజేందర్‌ ఇంట్లో నిద్రిస్తుండగా, రవళి ప్రియుడు బండం రాజు, అతని స్నేహితుడు సయ్యద్‌లు తుపాకీతో రాజేందర్‌ కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రాజేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు బండం రాజు, సయ్యద్‌, రవళిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

* శనివారం ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణం చెందారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో పప్పుల పోచయ్య(43) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, ఏడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొలాల్లో ఇసుక మేటలు వేసి పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రూ. 5లక్షలు ఎలా తీర్చాలన్నా ఆందోళనతో పురుగుల మందు తాగాడు. నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం అంతర్ని తండాలో రాథోడ్‌ తానాజీ (38) ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఇందుకోసం రూ.3లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల వర్షా

* ఓ వీధి కుక్కను అమానుషంగా కొట్టి చంపి, ఆపై బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కరీంనగర్‌ జిల్లా కొత్తపెల్లి పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ చేసిన వినతి మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. కొత్తపెల్లి మండలంలోని సంగం క్రాస్‌ రోడ్డు వద్ద ఈ నెల 15న కొందరు వ్యక్తులు ఓ వీధి కుక్కను చంపారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో చూసిన హైదరాబాద్‌కు చెందిన పృథ్వీ పన్నీరు ఈ విషయాన్ని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె శుక్రవారం రాత్రి కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన పోలీసులు.. పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

*వద్దన్నా సరే.. వెంటపడి మరీ రుణమిచ్చారు. కానీ, రెండు ఈఎంఐలు చెల్లించలేదని వేధింపులకు గురి చేసి చివరికి ఉసురు తీశారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలను గుర్తుచేసే మరో ఘటన ఇది. భద్రాద్రి జిల్లా అశ్వారావు పేట మండలంలోని వినాయకపురానికి చెందిన మక్కెళ్ల నాగరాజు(30)కు భార్య ఓ కూతురు ఉన్నారు. కూలీ పనులు చేసుకునే నాగరాజు బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా మూడు నెలల క్రితం రెండు సెల్‌ఫోన్లు కొనుగోలు చేశాడు. ఈఎంఐలను నాగరాజు సకాలంలో చెల్లించడంతో.. అతడికి తరచూ ఫోన్లు చేసి మరీ రూ.1లక్ష అప్పు ఇచ్చారు.అనారోగ్యానికి గురైన భార్యకు చికిత్స చేయించేందుకు నాగరాజు ఆ డబ్బు ఖర్చు చేశాడు. కానీ, ఆ అప్పునకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో బకాయిల వసూలుకు ఇంటికి పలుమార్లు వచ్చిన రికవరీ ఏజెంట్లు నాగరాజుతో దురుసుగా ప్రవర్తించారు. వారి వేధింపులతో మనస్తాపానికి గురైన నాగరాజు మూడు రోజుల క్రితం కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూశాడు. మృతుడి కుటుంబీకులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో వైసీపీ నాయకులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై సోమవారం దాడికి యత్నించారు. గుత్తి పట్టణంలోని 12, 13 వార్డుల్లో గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెనుక వెళుతున్న ఆర్‌ఐ గోపీనాథ్‌ను వైసీపీ నేత ఉమర్‌, అతని కుమారుడు మైను భూమి విషయంలో ప్రశ్నిస్తూ.. దురుసుగా ప్రవర్తించారు. దాడికి ప్రయత్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్‌ఐలనూ వారు అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆర్‌ఐ గోపీనాథ్‌ కల్పించుకుని, అధికారులను అలామాట్లాడటం సరికాదన్నారు. దీంతో వారు ఆర్‌ఐ గోపీనాథ్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. దుర్భాషలాడి దాడికి యత్నించారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల తీరుపై తహసీల్దారు మహబూబ్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిపై దాడికి ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్‌ఐని అక్కడి నుంచి పంపివేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

*జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఎస్‌వీ కోఆపరేటివ్‌ సొసైటీలోని శ్రీధర్‌ ల్యాబ్స్‌ రసాయన సంస్థలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌ల వద్ద ఉష్ణోగ్రతను అదుపు చేయడంలో విఫలం కావడంతో అవి పేలిపోయాయని, అందువలనే ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బయటకు పరుగులు తీశామని కార్మికులు పేర్కొన్నారు.

*మైలార్‌దేవుపల్లి టీఎన్‌జీవోస్‌ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి(65) మృతదేహం పడిఉంది. విషయం తెలిసిన మైలార్‌దేవుపల్లి పోలీసులు సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీఎన్‌జీవోస్‌ కాలనీలో కొండల మధ్య చెట్ల పొదల్లో వ్యక్తి మృతి చెంది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*ఈసీ నదిలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. హిమాయత్‌సాగర్‌ సమీపంలోని వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(వాలంతరీ) వెనుక భాగంలో ఈసానది ఉంది. ఈసీ నదిలో గుర్తుతెలియని యువకుడి(30) మృతదేహం కనిపించడంతో సోమవారం రాజేంద్రనగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించామని, అతడి సంబంధీకులు ఉంటే రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ బి.నాగేంద్రబాబు తెలిపారు.