DailyDose

అనాధలా మారిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

అనాధలా మారిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అను వుగా సౌకర్యాలు సమకూర్చినప్పటికీ, ఆ కల మాత్రం నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఒప్పించేందుకు కనీసం ప్రతి పాదించే వారు లేకుండాపోయారు. ఎయిర్ ట్రాఫిక్పై గతంలో విమానయాన సంస్థలతో ప్రతినెలా సమావే శాలు నిర్వహించి నివేదికలు ఇచ్చేవారు. గన్నవరంలో ఇలాంటి భేటీ జరిగి రెండేళ్లు దాటింది. త్వరలోనే విదేశీ రాకపోకలను ప్రారంభిస్తామంటూ ఆరు నెలల కోసారి జరిగే అభివృద్ధి కమిటీ సమావేశాల్లో చెప్పడం మినహా ఎలాంటి పురోగతి లేదు. విదేశీ సర్వీసుల రాకపోకలకు వీలుగా మూడేళ్ల క్రితమే ఇక్కడ రూ. 5 కోట్లకు పైగా వెచ్చించి టెర్మినల్ నిర్మించారు. ఆధునిక పరికరాలు సమకూర్చారు. కొవిడ్ సమయంలో గల్ఫ్ దేశాల నుంచి ‘వందేభారత్ మిషన్’ సర్వీసులు మినహా మరేవీ ఇక్కడ ఎగరలేదు.
*ఉన్న కొద్దిపాటి సిబ్బందీ వెనక్కి!
గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేం దుకు కస్టమ్స్ , ఇమ్మిగ్రేషన్ విభాగాలతో భారత విమాన యాన సంస్థ ( ఏఏఐ ) గతంలో ఒప్పందం చేసుకుంది. కస్టమ్స్ సిబ్బందికి నెలకు రూ.30 లక్షలు, ఇమ్మిగ్రేషన్ విభాగంలోని 400 మందికి జీతాల రూపేణా రూ.40 లక్ష లకు పైగా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఈ సొమ్ములూ ఇవ్వడం లేదు. ఈ సిబ్బందిని వెనక్కి తీసు కున్న ఉన్నతాధికారులు.. వందేభారత్ విమానాలు
వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలికంగా పంపిస్తున్నారు. మిగతా రోజుల్లో ఈ టెర్మినల్ మూసి ఉంటుంది. ఇందు లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, కన్వేయర్ బెల్టు, ఎక్స్ బ్యాగేజీ యంత్రాలు, మూడంచెల భద్రతా వ్యవస్థ నిరుపయోగంగా ఉన్నాయి. ‘సాధారణంగా ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందున విదేశీ సంస్థలు సర్వీసులు నడిపేందుకు ముందుకురావాలి. కాని ఆయా సంస్థలను ఒప్పించే వ్యవస్థ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వానికి ఇది ప్రాధాన్యాంశంగా లేదు ‘ అని ఆ రంగా నికి చెందిన నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. గన్నవ రంలో 2019 సెప్టెంబర్ ఎయిర్ లైన్స్ సమ్మిట్ ( సదస్సు ) నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేశారు. ఇక్కడి సౌకర్యాలు, ఎయిర్ కార్గో అవకాశాలను విదేశా ల్లోనూ చాటిచెప్పాలని ఆరు నెలల పాటు కసరత్తు చేశారు. అన్ని దేశీయ ఎయిర్లైన్స్ సంస్థల అధినేతలు, టూర్ ఆపరేటర్లను ఆహ్వానించారు. విమానాశ్రయ అధి కారులు, ఏఏఐ ప్రతినిధులతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. అంతా సిద్ధమయ్యాక అనూహ్యంగా సదస్సు వాయిదా వేశారు. తర్వాత స్థానికంగా సమావేశం నిర్వ హించి మమ అన్పించారు. ఎయిర్పోర్టుకు రగా పూర్తిస్థాయి డైరెక్టర్ లేరు. నుంచి నేరుగా విదేశీయానం కలగా మిగిలింది. ఏడాదిన్న వెరసి విజయవాడ నేరుగా విదేశీయానం కలగ మిగిలింది.