NRI-NRT

‘తానా-అశోక్ కొల్లా డే’‌గా ఆగస్టు 26

‘తానా-అశోక్ కొల్లా డే’‌గా ఆగస్టు 26

ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా- TANA)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’‌గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్ హోరిగన్ తాజాగా ప్రకటించారు. తెలుగు ప్రజలకే కాకుండా.. ఆక్రాన్ నగర పౌరులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తానా ఈ గౌరవం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటూ అమెరికాలోని తెలుగు వారి అభ్యున్నతి కోసం తానా విశేషంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా సంక్షోభ సమయంలో తానా సంఘంతో పాటూ ఆశోక్ కొల్లా.. నార్త్‌ఈస్ట్ ఒహాయోలో అనేక మందికి ఉచితంగా భోజనం అందించారు. అంతేకాకుండా.. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, ఉచిత కొవిడ్ కిట్లు, పీపీఈ కిట్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటివరకూ తానా వారు ఆక్రాన్-కాంటాన్ ఫుడ్ బ్యాంక్‌కు 5 లక్షలకు పైగా మీల్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానికంగా ఉన్న వారికి ఆశోక్ కొల్లా అదనంగా మీల్స్‌ను ఏర్పాటు చేశారు. తానాతో పాటూ అశోక కొల్లా తమ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా నగర్ మేయర్‌ చేతులమీదుగా ఈ అరుదైన గౌరవాన్ని పొందారు.

09052022232804n5
09052022232818n14