Movies

లైగర్ దెబ్బ…ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరీ?

లైగర్ దెబ్బ…ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరీ?

లైగర్‌ ఫ్లాప్‌తో పూరి జగన్నాథ్‌ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్‌ భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఈ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. మూవీ షూటింగ్‌, ప్రమోషన్స్‌లో భాగంగా గతేడాది పూరీ ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్‌ 4 బిహెచ్‌కే ఫ్లాట్‌ను రూ. 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటనెన్స్‌ ఖర్చులు కలుపుకుని దాదాపు రూ. 15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక లైగర్‌ డిజాస్టర్‌తో ఇప్పుడు ఆ రెంట్‌ కట్టేలేని పరిస్థితులో పూరి ఉన్నాడని, అందువల్లే ఈ ఫ్లాట్‌ను ఖాళీ చేశాడని తెలుస్తోంది.