Politics

పలకరించుకోని మోదీ, జిన్‌పింగ్‌

పలకరించుకోని మోదీ, జిన్‌పింగ్‌

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO summit) కొనసాగుతోంది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో (Samarkand) జరుగుతున్న ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. అయితే, ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పొరుగు దేశం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మాత్రం పలకరించుకోకపోవడం గమనార్హం. ఒకే వేదికపై ఉన్న వీరు కరచాలనం చేసుకోలేదని, కనీసం మాట్లాడుకోలేదని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దూరంగా, ఎడముఖం పెడముఖంగానే ఉన్నట్లు తెలిపాయి.