Politics

ఈటల నివాసానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా .

ఈటల నివాసానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా .

కేంద్ర హోం మంత్రి అమిత్ షా శామీర్ పేటలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూసిన విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తూ, ఈటల కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఈటల నివాసానికి వచ్చారు. ఈటల రాజేందర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అమిత్ షా పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని ఆయన తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు.