Movies

కొండ దూకుడు స్వభావం కారణం కావచ్చు

కొండ దూకుడు స్వభావం కారణం కావచ్చు

విజయ్‌ దేవరకొండ నటించిన ‘లైగర్‌’ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్స్‌ చేశారు. లైగర్‌ సినిమా ప్రేక్షకాదరణ పొందకపోవడానికి విజయ్‌ దేవరకొండ దూకుడు స్వభావం కారణం కావచ్చని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమా పరాజయం పొందడానికి కరణ్‌ జోహర్‌ కారణమని వర్మ కామెంట్‌ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘ విజయ్‌ స్టేజీపై సహజంగానే దూకుడుగా ఉంటాడు. అందరినీ ఆకర్షించాలని రకరకాల చేష్టలు చేస్తుంటాడు. కానీ, బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ లైగర్‌ ఉద్యమం రావడానికి ప్రాథమిక కారణం కరణ్‌ జోహర్‌. అతనికి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉండడం వల్లే బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రజలు కరణ్‌ సినిమాలను బహిష్కరించడం సర్వసాధారణమైంది’’.