NRI-NRT

చంద్రబాబుపై ద్వేషంతోనే అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారు

Bonda Uma And Komati Jayaram Slams YS Jagan

చంద్రబాబుపై ద్వేషంతోనే అమరావతిపై విషం చిమ్మటం మంచిది కాదని ఎన్నారై తెదేపా అమెరికా కో-ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ఆదివారం నాడూ మినియాపోలిస్‌లో NTR శతజయంతి వేడుకల్లో బోండా ఉమాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ విశాఖలో అవినీతి సామ్రాజ్యం నిర్మించటానికి అమరావతిని సమాధి చేయడం మంచిది కాదన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని సాక్షత్తూ ముక్యమంత్రే భావోద్వేగాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు.
చంద్రబాబుపై ద్వేషంతోనే అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారు - Bonda Uma And Komati Jayaram Slams YS Jagan
మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన,ఎమర్జెన్సీ రోజులను జగన్ రెడ్డి గుర్తుకు తెస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మూడేళ్ళలో ప్రభుత్వం చేసిన నేరాలు-ఘోరాలు,ధరల పెంపుతో ప్రజలను దోచుకున్న విధానాలు, తప్పుడు లెక్కలను ఖండించారు. సాయి బొల్లినేని,రామ్ వంకిన,వెంకట్ జువ్వ,వేదవ్యాస్ అరవపల్లి,అజయ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.