తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు గుడ్‌న్యూస్. పలు ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇకపై ఎవరినీ అడగకుండానే కొండపై ఒకచోట నుంచి మరో చోటకు సులువుగా చేరుకోవచ్చు. ఇందుకు సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తితిదే కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలోని వివిధ కార్యాలయాలను తెలిపే క్యూఆర్ కోడ్‌ను రూపొందించింది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు.. తితిదే అతిథిగృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, తితిదే లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, విజిలెన్స్ కార్యాలయాలు.. ఇలా కొండపై ఉన్న విభాగాల వివరాలు ప్రత్యక్షం కానున్నాయి. అలాగే, భక్తులు తాము వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే మ్యాప్ కూడా డిస్‌ప్లే అవుతుంది.
“తిరుమల మార్గదర్శిని” విడుదల
Related tags :